Monday, August 24, 2015

కలిపే జంటలే జీవితమా

కలిపే జంటలే జీవితమా
కలిసే జంటలే జీవనమా
జీవిస్తూ సాగే జీవనమే జీవిత కాలమా
జీవించే కాలంలో కలిసే జంట ఏదో కలిపే జత ఏదో
సరిలేని జంట సరిపోయే జత ఏదైనా జీవన జీవితమే
ఏ జంటకైనా మనో భావాలు వేరైనప్పుడు విభేధమే
ఏ జతకైన అభి రుచులు వేరైన వేళ అభి వాదమే
ఎక్కడ కలిసామో ఎక్కడ కలిపారో ఒక్కటయ్యాము
కలసి ఉంటే కలదు సుఖం అర్థమైతే కలదు సంతోషం
ఎప్పటికైనా నెమ్మదిగా ఆలోచిస్తూ చర్చిస్తే ఒకటే అర్థం - పరమార్థం
ఎక్కువ తక్కువలు ఈనాటివి కావు - ఏనాటి లక్షణాలో
అన్ని విధాలా అన్ని రకాల ఎక్కువ తక్కువలు అందరిలోను ఉంటాయి
ఎక్కువ తక్కువలు ఒకటిగా ఆలోచిస్తే ముందుకు సాగిపోతాం
ఒక్కటైనా నాడే ప్రగతిని చాలా త్వరగా అందుకోగలం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

No comments:

Post a Comment