Thursday, August 13, 2015

నా మేధస్సులో అనంతమైన విశ్వ మందిరం నిర్మితమై ఉన్నది

నా మేధస్సులో అనంతమైన విశ్వ మందిరం నిర్మితమై ఉన్నది
విశ్వ మందిరమున అనేకమైన భావాలోచనలు దాగి ఉన్నాయి
విశ్వ తత్వాలు వేద విజ్ఞాన భావాలు మేధస్సులో కలుగుతున్నాయి
వివిధ లోకాల భావాలు ఊహా చిత్ర రూప స్వరూపాలెన్నో ఉన్నాయి
తిలకించుటలో అనంతం భావాలలో అమోఘం ఆలోచనలలో అఖండం
అపురూపమైన వర్ణ కాంతులు అద్వితీయమైన కిరణాల తేజస్సులు
దైవత్వంతో కూడిన స్వప్న మందిరాలు యోగుల ధ్యాన శిభిరాలు
అనిర్వచనీయమైన కాల తత్వ స్వభావాలు సమయోచిత స్వర కీర్తనలు
సుగంధ పరిమళాల పుష్పాలు సువర్ణ సుమధుర సుదీర్ఘ క్షేత్రములు
శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన పరిపూర్ణ దేవామృత శిలా విగ్రహములు  
నైవేద్యితమైన అభిరుచులు ప్రకృతి పర్యావరణ అంద చందములు
తెలుపుటకు యుగాల కాల భావాలు తలచుటకు మేధస్సులో మర్మములు 

No comments:

Post a Comment