ఓ విశ్వ జీవి! నీవు ఎచట ఉన్నావో
నీవు లేని ఇచట మనస్సులో మరో మాట
నీ శ్వాస ఎప్పటిదో నీ ధ్యాస ఎంతటిదో
యుగాలుగా ధ్యానిస్తూనే ఉన్నావు శ్వాసగా జీవిస్తూనే ఉన్నావు
నీ శ్వాసలో ఏమున్నదో నీ ధ్యాసలో ఏది ఉన్నదో
శూన్యము నుండి ఆరంభ మైనదా నీ శ్వాస ధ్యాస
ఖండాలుగా విభజించినా నీ శ్వాస అఖండమే
నీ శ్వాస భావన నాలో కలిగించే అన్వేషణ
నీ ధ్యాస తత్వం నాలో మెలిగే ఆలోచన
నీ శ్వాస ధ్యాసకై నా మేధస్సులో నిత్యం పర్యవేక్షణ
మరణం లేని నీ శ్వాసలో నా ధ్యాస అమరమై అన్వేషిస్తున్నది

No comments:
Post a Comment