Thursday, August 27, 2015

వెంటబడి పోయే రూపం

వెంటబడి పోయే రూపం
వర్ణాల అంద చందమైన సుందర ఆకారం
చూపులో స్వచ్ఛమైన ప్రేమ భావం
కనిపించగానే నిలిచిపోయే హృదయానందం
కంటి రెప్పను వేయలేనట్లు చేసే తేజం
విడిపోలేని కదలికతో మేధస్సులో సంచలనం
దారిలో కనిపించే రూపాన్ని క్షణాలుగానే చూసే ప్రయాణం
చూడాలన్నా వెనుక తిరగలేని కార్య క్రమాల సమన్వయత్వం
మరో సమయానికి ఎదురు చూసే బంధం
జ్ఞాపకాలలో గుర్తించుకునేలా ఆలోచింప జేసే మోహం
కాలం సాగుతూనే అన్నీ మరచిపోయే మన జీవనాల జీవితం
ఏది ఆశ్చర్యం లేదు ఏది అద్భుతం కాదు అన్నీ క్షణ కాలమే
విజ్ఞానంతో సాగిపోయే జీవితాన్ని అందుకోవడమే మన లక్ష్యం
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

No comments:

Post a Comment