Friday, August 28, 2015

తెలియని వయసులో చేసే పనులు ఏవో

తెలియని వయసులో చేసే పనులు ఏవో తెలిసేదాక చేసెదరు
తెలిసిన నాటి నుండి మానుకోలేక అలవాటుగా సాగించెదరు
ఎరుక లేని ధ్యాసలో ఎవరు చూడలేనంతగా ఆలోచించెదరు
ఆలోచనలలో ఏ లోపమో ఇష్టానికి ఏది సరియో తెలుసుకోలేరు
సంఘానికి సూచనగా ఎదిగే ఆలోచన మీలో లేకపోతే ఎవరూ తెలుపలేరు
తరతరాలకు సాగే జీవన విధానాలలో సరి కొత్త పరిస్థితులను ఎవరూ ఆపలేరు
మీకు మీరే నవ సమాజానికి మార్గ దర్శకులు కాలేకపోతే మీకెవరూ చెప్పలేరు
ఎక్కడ ఎలా ఉండాలో విజ్ఞానంగా ఆలోచిస్తే మార్గ దర్శకమైన నడవడికను సాగించెదరు
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

No comments:

Post a Comment