Tuesday, August 11, 2015

సంపూర్ణమైన అమావాస్య నాడు అంతరిక్షమున వెలిగే

సంపూర్ణమైన అమావాస్య నాడు అంతరిక్షమున వెలిగే అఖండమైన దివ్య నక్షత్రాన్ని నేనే
నా దివ్య తేజస్సు కాంతికి వివిధ నక్షత్రాలు గ్రహాలన్నీ రూప రహిత వెలుగుతో మిలితమౌతాయి  
అంతరిక్షమున నా నక్షత్ర కాంతి తప్ప ఏ రూపము ఏ నేత్రానికి కనిపించని విధంగా ఉంటుంది
మలినమైనను మహా రూపమైనను ఆనాడు మహోదయ వర్ణపు కాంతితో ఆవరించి ఉంటుంది
ఆకాశానికి ఒకవైపు సంపూర్ణమైన చీకటి మరో వైపు సుందరమైన కాంతి తత్వం ఉంటుంది

No comments:

Post a Comment