Showing posts with label శ్రీమతి. Show all posts
Showing posts with label శ్రీమతి. Show all posts

Thursday, October 27, 2016

శతమానం భవతి యుగాలకే యువతి

శతమానం భవతి యుగాలకే యువతి
శతాబ్దాల జగతి లోకాలకు మా జాగృతి
సృష్టికే సుమతి ప్రతి ఇంటికి శ్రీమతి
ఆకాశానికే అరుంధతి ప్రకాశంలో ప్రణతి  || శతమానం ||

శుభోదయమే శోభనం నవోదయమే వందనం
కళ్యాణమే కమనీయం ఓంకారమే శ్రీకారం

బంధువులకు బహురూపం బంధాలకు బహుమానం
తరతరాలకు సమ భావం యుగయుగాలకు సుమధురం  || శతమానం ||

జగమంతా సూర్యోదయం విశ్వమంతా మహోదయం
మమకారమే మహా మధురం  మాతృత్వమే మహనీయం

అనురాగమే అనుబంధం అనుభవాల అమరత్వం
అనుగుణమే ఆనందం అభిరుచులకు అమోఘం    || శతమానం ||

Thursday, July 21, 2016

ఆంధ్ర భారతి అమరావతి

ఆంధ్ర భారతి అమరావతి
విజ్ఞాన సుమతి అమరావతి
భారత మాలతి అమరావతి
జీవన స్రవంతి అమరావతి
దేశ సంస్కృతి అమరావతి
విశ్వానికే జనతి అమరావతి
లోకైక స్త్రీ జగతి అమరావతి
సంగీత సాహితి అమరావతి
శతాబ్దాల నవతి అమరావతి
జలధార జలతి అమరావతి
అందరికి వినతి అమరావతి
చరిత్రకు ఛత్రపతి అధిపతి
మనోహర దేవతి అమరావతి
విదేశీయ అదితి అమరావతి
మన దేశ జాగృతి అమరావతి
శతమానం భవతి అమరావతి
విశాలాంధ్ర రేవతి అమరావతి
వేదాలకు వేదంతి అమరావతి
ఆరోగ్యానికే ఊష్ణతి అమరావతి
అన్నదాత పూర్ణతి అమరావతి
యదార్థపు సంగతి అమరావతి
సహాసంలో సమితి అమరావతి
సూర్యోదయ కాంతి అమరావతి
సత్యఆంధ్ర ప్రగతి అమరావతి
పర్యావరణ ఆర్ద్రతి అమరావతి
దైవత్వానికే విశ్వతి అమరావతి
దేశానికే బహుమతి అమరావతి
ఎప్పటికైనా సురతి అమరావతి
జ్యోతిర్మయ ప్రణతి అమరావతి
నవ్యఆంధ్ర ఆకృతి అమరావతి
కల్యాణంతో శ్రీమతి అమరావతి
విదేశాలకు ఉన్నతి అమరావతి
శాంతి క్రాంతి ఖ్యాతి అమరావతి
హరితాంధ్ర ప్రకృతి అమరావతి
నదులలో గంగావతి అమరావతి
పవిత్రమైన పార్వతి అమరావతి
ఆధ్యాత్మక ఆధ్యంతి అమరావతి
విజయంలో మారుతి అమరావతి
అమరులకే అధిపతి అమరావతి
విశ్వ లోకాలకే ఆనతి అమరావతి
పూర్ణోదయ పద్మావతి అమరావతి
అఖండ సౌభాగ్యవతి అమరావతి
విద్యాఆంధ్ర సరస్వతి అమరావతి
సూర్యోదయానికే తపతి అమరావతి
నిర్మాణములోనే పద్ధతి అమరావతి
అంతరిక్షమునకే గణతి అమరావతి
గ్రహములకే బృహస్పతి అమరావతి
జన్మభూమిలో జయంతి అమరావతి
అభివృద్ధితోనే సుశాంతి అమరావతి
పసుపు పచ్చని చామంతి అమరావతి