Thursday, October 27, 2016

శతమానం భవతి యుగాలకే యువతి

శతమానం భవతి యుగాలకే యువతి
శతాబ్దాల జగతి లోకాలకు మా జాగృతి
సృష్టికే సుమతి ప్రతి ఇంటికి శ్రీమతి
ఆకాశానికే అరుంధతి ప్రకాశంలో ప్రణతి  || శతమానం ||

శుభోదయమే శోభనం నవోదయమే వందనం
కళ్యాణమే కమనీయం ఓంకారమే శ్రీకారం

బంధువులకు బహురూపం బంధాలకు బహుమానం
తరతరాలకు సమ భావం యుగయుగాలకు సుమధురం  || శతమానం ||

జగమంతా సూర్యోదయం విశ్వమంతా మహోదయం
మమకారమే మహా మధురం  మాతృత్వమే మహనీయం

అనురాగమే అనుబంధం అనుభవాల అమరత్వం
అనుగుణమే ఆనందం అభిరుచులకు అమోఘం    || శతమానం ||

No comments:

Post a Comment