Monday, October 24, 2016

అంతర్జ్యోతినై పరంజ్యోతిగా ఆరంజ్యోతిని నేనే

అంతర్జ్యోతినై పరంజ్యోతిగా ఆరంజ్యోతిని నేనే
పరంధామనై పరమాత్మగా పరంపర ధాతను నేనే
మహాత్మనై మహర్షిగా అంతర్భావ మాధవుడను నేనే  || అంతర్జ్యోతినై ||

మీలో కలిగే భావాలకు నేనే స్ఫూర్తిగా నిలిచివున్నాను
మీలో నిలిచే తత్వాలకు నేనే స్తంభించి పోతున్నాను
మీలో మిగిలే స్వభావాలకు నేనే స్థిరపడి ఉంటున్నాను

ఏ భావమైన మహాత్ములకు మహా తత్వమే
ఏ తత్వమైన మహర్షులకు మహా తీతత్వమే
ఏ వేదమైన మాధవులకు మహా తత్వేత్తమే    || అంతర్జ్యోతినై ||

విశ్వమంతా వెలుగునిచ్చే ఆరంజ్యోతిగా సూర్యోదయమౌతున్నా
జగమంతా విజ్ఞానాన్నిచ్చే పరంజ్యోతిగా అంతర్భావమౌతున్నా
లోకమంతా పరిశోధించే అంతర్జ్యోతిగా నేనే అవధూతమౌతున్నా

ఆత్మ స్వరూపమై ప్రతి జీవిలో నేనే ఉదయించనా
దైవ స్వరూపమై ప్రతి అణువులో నేనే జీవించనా
వేద స్వరూపమై ప్రతి దేహంలో నేనే శ్వాసించనా
నాద స్వరూపమై ప్రతి ప్రదేశంలో నేనే ధ్వనించనా  || అంతర్జ్యోతినై || 

No comments:

Post a Comment