Tuesday, October 25, 2016

రూపంలో చలనం లేదు ఆకారంలో కదలిక లేదు

రూపంలో చలనం లేదు ఆకారంలో కదలిక లేదు
భావంలో అర్థం తెలియదు శ్వాసలో ధ్వనితం లేదు
చూపులో గమ్యం లేదు హృదయంలో నాదం లేదు   || రూపంలో ||

ఏనాటి మహాత్మ రూపమో ఏనాటికి తెలియని ఆత్మ భావము
ఏనాటి జీవాత్మ ఆకారమో ఏనాటికి తెలియని పర తత్వము

ఎవరికి తెలియని భావంతో నిలిచిపోయిన రూపం శిల్పత్వము
ఎవరికి తోచని స్వభావంతో ఒదిగిపోయిన ఆకారం కల్పత్వము   || రూపంలో ||

మానవుడిగా ఉదయించి మాధవుడిగా ఎదిగిన మహాత్ముడే ఇతడు
మాధవుడిగా జీవించినా పరంధామగా ఒదిగిన పరమాత్ముడే ఇతడు

జీవితమే అఖండమైన తత్వాలతో సాగించిన కాల బంధువుడు
జీవనమే అఖిలమైన సత్యాలతో పలికించిన సమయ మిత్రుడు  || రూపంలో || 

No comments:

Post a Comment