Thursday, October 6, 2016

అదిగో బ్రంహాండ నాయకుని బ్రంహోత్సవం

అదిగో బ్రంహాండ నాయకుని బ్రంహోత్సవం
తిరుమల గిరి నివాసపు శ్రీనివాసుని రథోత్సవం  || అదిగో ||

బ్రంహ విష్ణు మహేశ్వరులే జరిపించు వైకుంఠ వాసుని బ్రంహోత్సవం
మహా జనుల సమూహంతో ఘన ఘనంగా సాగిపోయే మహా రథోత్సవం

శ్రీనివాసుని ఇరు వైపుల మెరిసే శంఖు చక్రములను దర్శించే తేజోత్సవం
శ్రీనివాసుని నిలువెత్తు అలంకరించిన సువర్ణ ఆభరణముల సువర్ణోత్సవం

భూలోకములోనే బ్రంహాండముగా జరిగే మహా నాయకుని బ్రంహోత్సవం
సర్వ లోకములలోనే మహా సంభరంగా జరిగే తిరుమల వాసుని రథోత్సవం  || అదిగో ||

ఊరూర ఊరేగిపోయే బ్రంహాండ నాయకుని సువర్ణ పల్లకి మహోత్సవం
ఊరంతా కలిసి జరుపుకునే మహా నాయకుని కళ్యాణ మహోన్నోత్సవం

ఉదయించు వేళ సుప్రభాత స్వర సంగీతములతో ఆరంభమయ్యే బ్రంహోత్సవం
అస్తమించు వేళ మహా మకర జ్యోతులతో కొనసాగే అశ్వ గజ ముఖ వాహన రథోత్సవం

సప్త ద్వారాలలో దాగి ఉన్న మహా నాయకుని సప్త వాహనాల ఊరేగింపు బ్రంహాండమైన మహోత్సవం
సప్త సముద్రాల గంగా జల పాతములతో అభిషేకము చేసే మహా నాయకుని బ్రంహాండమైన ఉత్సవం  || అదిగో || 

No comments:

Post a Comment