Thursday, October 20, 2016

పరమాత్మా నీవే ఓ ఆత్మ

పరమాత్మా నీవే ఓ ఆత్మ
పరంధామా నీవే మా రామ
పరంజ్యోతి నీవే మాకు జ్యోతి  || పరమాత్మా ||

విశ్వానికి నీవే జీవమై జీవిస్తున్నావు
జగతికి నీవే తేజమై వెలుగుతున్నావు
సృష్టికి నీవే సూర్యుడై ప్రకాశిస్తున్నావు

కాలంతో నీవే ఏకాంతమై క్షణాలనే సమయంతో దాటిస్తున్నావు
జీవంతో నీవే ఏకాగ్రతవై ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ఆడిస్తున్నావు  || పరమాత్మా ||

విశ్వంలో నీవు ఉన్నట్లు ఎవరికి కనిపించలేవు
జగతిలో నీవే పలికినట్లు ఎవరికి వినిపించలేవు
లోకంలో నీవే వస్తున్నట్లు ఎవరికి చూపించలేవు

మహాత్ములచే విశ్వానికి కావాలి ఒక శక్తి మహర్షులచే జగతికి చాలా కావాలి ఒక భక్తి
మహానుభావులతో లోకానికి కావాలి ఒక యుక్తి మాధవులతో సృష్టికి కావాలి ఒక రక్తి   || పరమాత్మా || 

No comments:

Post a Comment