Monday, October 17, 2016

ఏమి భాగ్యమో శ్రీ హరి రూపము

ఏమి భాగ్యమో శ్రీ హరి రూపము
ఏనాటి సౌభాగ్యమో శ్రీ హరి దర్శనము
ఎంతటి అద్భుతమో శ్రీ హరి విశ్వ రూపము  || ఏమి భాగ్యమో ||

మహా జీవిగా జీవించే మహాత్ముడే మహా విష్ణువై కొలువైనాడు
మహా ఆత్మగా జీవించే పరమాత్ముడే పరంధామై ఉంటున్నాడు
మహా ఋషిగా జీవించే మహర్షియే అవధూతగా నిలయమైనాడు

అవతారములు ఎన్నైనా ఇరువై ఒక అవతారాలలో దశవతారాలే మనకు ప్రాముఖ్యములు
యుగ యుగాలుగా మనము దర్శించిన దశవతారాలే అవధూత రూపముల సౌభాగ్యములు  || ఏమి భాగ్యమో ||

మహాత్ముడిగా కొలిచినా నారాయణుడివి నీవే
మహర్షిగా తలచినా శ్రీమన్నారాయణవు నీవే
పరమాత్మగా దర్శించినా శ్రీ మహా విష్ణువు నీవే

అవతారముల అవధూత తత్వములు మన లోని అరిషడ్వార్గాల భావ స్వభావములు
అవతారముల పరమాత్ముని తత్వములు మన దేహం లోని జీవ కార్యాల లక్షణములు
అవతారముల పరంధాముని తత్వములు మన లోకానికి రక్షణ కలిగించే సౌఖ్యములు  || ఏమి భాగ్యమో ||

No comments:

Post a Comment