Tuesday, October 11, 2016

అమ్మ అంటే హృదయం అందించునే ప్రేమామృతం

అమ్మ అంటే హృదయం అందించునే ప్రేమామృతం
శ్వాస అంటే ప్రాణం కలిగించునే మన తల్లి హృదయం || అమ్మ ||

ఎన్నో తరాల బందుత్వాన్నే సాగించును మన అమ్మే
ఎన్నో యుగాల అనుబంధాన్నే తెలిపేను మన అమ్మే

ఏదో తెలియని జీవితం నడిపించేను మన కోసం
ఏది లేని జీవనం సహనంతో సాగించేను మన కోసం

ఎక్కడికో ఎప్పటి వరకో తెలియని ప్రయాణం తపనంతో సాగే తన ప్రాణం
ఎందుకో ఎవరి కొరకో తెలియని కాల ప్రభావం సాహసంతో వెళ్ళే తన జీవం || అమ్మ ||

మన కోసమే జీవిస్తుంది మన కోసమే ఎదురు చూస్తుంది
మనతోనే ఉంటుంది మనందరి కోసమే శ్రమిస్తుంటుంది

మనమే తమకు లోకం ఏ ఐశ్వర్యం భోగ భాగ్యాలు వద్దనుకుంది
మనమే తన ప్రపంచం ఏ ఆశలు అతిశయాలు అనవసరమంది

మనం పలికించే మాటలతోనే జీవితాన్ని నింపుకుంటుంది
మనం తెలిపే అనుభవాలతోనే జీవనాన్ని అల్లుకుంటుంది || అమ్మ || 

No comments:

Post a Comment