Tuesday, October 25, 2016

లోకానికే తెలియని భావన నాలోనే నిలిచిపోతున్నది

లోకానికే తెలియని భావన నాలోనే నిలిచిపోతున్నది
విశ్వానికే కలగని స్వభావం నాయందే దాగిపోతున్నది
జగతికే తోచని జీవ తత్వం నాతోనే ఒదిగిపోతున్నది   || లోకానికే ||

అణువుగా ప్రతి అణువులో పరమాణువునై లీనమై పోయాను
జీవిగా ప్రతి జీవిలో శ్వాసనై దేహంతో కనిపించలేక పోయాను
దైవముగా ప్రతి దేహంలో జీవమై శ్వాసతోనే నిలిచి పోయాను

రూపమే మహా తత్వమై నాలో నేనే ఒదిగేలా నిలిచినది
భావమే మహా జీవమై నాలో నేనే నివసించేలా చలించినది
వేదమే మహా బంధమై నాలో నేనే ఎదిగేలా సహకరించినది  || లోకానికే ||

ఏనాటిదో జన్మ జీవించుటలో జన్మించిన భావన తెలియనిది
ఏనాటికో జన్మ ఎదుగుటలో మన జీవితం ఎందుకని కలగనిది
ఎవరికో జన్మ సరి నడుచుటలో మనతో కలిసినదెవరో తలచనిది

అణువే పరమాణువులను జత చేసుకొని బంధాన్ని తెలుపుతున్నది
రూపమే ఆకారాలను ఒకటిగా చేర్చుకొని జీవత్వాన్ని పొందుతున్నది
విశ్వమే కాలాన్ని క్షణాలుగా మార్చుకొని ప్రయాణాన్ని సాగిస్తున్నది    || లోకానికే || 

No comments:

Post a Comment