Thursday, October 6, 2016

బ్రంహోత్సవం బ్రంహోత్సవం జన్మ జన్మల అనుబంధాలకే బ్రంహోత్సవం

బ్రంహోత్సవం బ్రంహోత్సవం జన్మ జన్మల అనుబంధాలకే బ్రంహోత్సవం
బ్రంహోత్సవం బ్రంహోత్సవం తర తరాల అనురాగాలకే ఈ బ్రంహోత్సవం  || బ్రంహోత్సవం ||

శుభ కార్యాల ఉత్సవాలను జరుపుకునేందుకే ప్రతి ఇంట బ్రంహోత్సవం
శుభ ముహూర్తపు కళ్యాణం జరిగేందుకే ప్రతి నివాసంలోనే బ్రంహోత్సవం

తిరుమల గిరి నివాసమున కొలువై ఉన్న శ్రీనివాసునికే నిత్యం బ్రంహోత్సవం
అనంత లోకాలలో లీనమై ఉన్న బ్రంహాండ నాయకునికే మహా బ్రంహోత్సవం

ఊరంతా కలిసి జరుపుకునే మహా దేవుని కళ్యాణ రథోత్సవమే బ్రంహోత్సవం
దేశాలే కలిసి సంతోషంగా జరుపుకునే సంభరమైన ఉత్సవాలే బ్రంహోత్సవం  || బ్రంహోత్సవం ||

మహాత్ముల మహా భావాలతో ప్రతి చోట జరగాలి మహోత్తరమైన బ్రంహోత్సవం
మహర్షుల మహా తత్వాలతో ప్రతి రోజు కలగాలి మహోన్నతమైన బ్రంహోత్సవం

అద్వితీయమైన దైవత్వంతో జరపాలి మహా నాయకుని బ్రంహోత్సవం
అద్వైత్వ దైవాంశంతో యోగత్వ పరతత్వాలతో కలగాలి బ్రంహోత్సవం

అవధూతగా అవతరించే పరంధామయే వచ్చేలా జరపాలి బ్రంహోత్సవం
పరమాత్మయే తన్మయంతో పరవశించి పోయేలా కలగాలి బ్రంహోత్సవం  || బ్రంహోత్సవం || 

No comments:

Post a Comment