Thursday, September 24, 2015

మేధస్సులో మంచి లేదు ఇక మాటలు ఎందుకు

మేధస్సులో మంచి లేదు ఇక మాటలు ఎందుకు
ఆలోచనలలో నీతి లేదు ఇక ప్రస్థానం ఎందుకు
మనస్సులో భావన లేదు ఇక ప్రమాణం ఎందుకు
జీవితంలో నేర్పు లేదు ఇక ప్రగతి ఎందుకు
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Tuesday, September 22, 2015

జన్మించిన నాడు అనుకోలేదు నేను

జన్మించిన నాడు అనుకోలేదు నేను విశ్వ భావాలతో జీవిస్తానని
ఎదిగే కొద్ది నా ఆలోచనలు భావాలుగా మార్పు చెందుతున్నాయి
నేను జీవించుటలో నా ఆలోచనల తీరు ప్రకృతిని గ్రహిస్తుంటాయి
ప్రకృతిని తిలకిస్తూ భావాలను ఆలోచనలుగా మార్చుకుంటున్నాను
ప్రకృతి భావాల ఆలోచనలతో విశ్వ తత్వాలను పరిశోధిస్తున్నాను
విశ్వ భావాల తత్వాలతో జీవితాన్ని మరో దశలో కొనసాగిస్తున్నాను
మరణించిన తర్వాత నాలో ఏ భావన ఉంటుందో విశ్వానికే ఎరుక  
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Monday, September 21, 2015

ఎంత సాధించినను ఇంకా సాధన సాగుతున్నది

ఎంత సాధించినను ఇంకా సాధన సాగుతున్నది మహా అధ్యాయంలా
మనిషిగా ఎంత పొందిననూ ఇంకా కావాలనే ఆలోచనల తీరు మనలో
కాలం సాగుతున్నంతవరకు సామర్థ్యం ఉన్నంతవరకు సాధన సాగేను
మానవ జీవితంలో ఎటువంటి ఆశలకైనా కోరికలకైనా అంతం ఉండదు
కోరికలను తీర్చుకొనుటలో మన సామర్థ్యం కూడా ధృడంగా కొనసాగును
ఆశ పడుటలో నష్టం లేదు వాటిని తీర్చుకొనుటలో ఆవేశం పనికి రాదు
సరైన పద్ధతిలో సరైన సిద్ధాంతాన్ని పాటిస్తూ సరైన సామర్థ్యాన్ని సాగించాలి
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Tuesday, September 15, 2015

సూర్యుని తేజస్సులో శిలనునై సువర్ణము వలే ప్రకాశిస్తున్నా

సూర్యుని తేజస్సులో శిలనునై సువర్ణము వలే ప్రకాశిస్తున్నా
కిరణాల తేజస్సులో మిళితమై ఎవరికి కనిపించలేక పోతున్నా
సూర్యుని ప్రజ్వల కాంతిలో జఠిలమై జగతికి వెలుగునిస్తున్నా
విశ్వమంతా వెలుగుతో నిలిచిపోయేలా సూర్యునితో ఉదయిస్తున్నా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

నిత్యం సత్యం ఒకటే మాట

నిత్యం సత్యం ఒకటే మాట
ఎప్పటికైనా ఎక్కడైనా అదే మాట
నిజం ఎప్పటికైనా ధైర్యంగా చెప్పే మాట
ఉన్నది ఉన్నట్టుగా తెలిపేదే గొప్ప మాట
నమ్మకాన్ని కలిగించేదే నిజమైన మాట
నిన్ను నడిపించేది నిత్యం సత్యమైన మాటే
ప్రపంచమంతా కోరుకునేది విశ్వాసంతో కూడిన మాటే
ఎప్పటికి మారనిది ఎవరూ మార్చలేనిది సత్యమే
సత్యాన్ని రక్షిస్తే ధర్మం ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది
ప్రపంచాన్ని ధర్మంగా నడిపించాలంటే మనం సత్యాన్ని పాటించాలి
విశ్వం ఎప్పుడూ ప్రకృతి ధర్మంతో సాగుతూ సహజమైన కారణాన్ని కలిగి ఉంటుంది
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

Monday, September 14, 2015

ప్రేమం ప్రియం ప్రాణం

ప్రేమం ప్రియం ప్రాణం
స్వరం సర్వం సంగీతం
మోహం మౌనం మృదంగం
తాళం తాపం తపనం
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

యోగ్యత ఉన్నదా యోగివై ఉండి పోయెదవా

యోగ్యత ఉన్నదా యోగివై ఉండి పోయెదవా
జీవం ఉన్నదా జీవుడై నిలిచి పోయెదవా
ఆత్మ ఉన్నదా పరమాత్మగా సాగి పోయెదవా
సత్యం ఉన్నదా నిత్యమై మెరిసి పోయెదవా  
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

హృదయం ఉన్నంతవరకే ప్రేమ జీవితం

హృదయం ఉన్నంతవరకే ప్రేమ జీవితం
తల్లి ఉన్నంతవరకే మాతృత్వ ప్రేమత్వం
జీవం ఉన్నంతవరకే జీవత్వ యోగత్వం
స్నేహం ఉన్నంతవరకే సంతోష జీవనం
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

హృదయమందు ఏమున్నదో నదులన్నీ ప్రవహిస్తున్నాయేమో

హృదయమందు ఏమున్నదో నదులన్నీ ప్రవహిస్తున్నాయేమో
మేధస్సుయందు ఏమున్నదో ఆకులన్నీ రాలిపోతున్నాయేమో
మనస్సుయందు ఏమున్నదో గాలులన్నీ వీచిపోతున్నాయేమో
ఆత్మయందు ఏమున్నదో దేహాలన్నీ జీవిస్తూ నశిస్తున్నాయేమో
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

ఎక్కడైనా నిలిచిపో ఏనాటికైనా నిలిచిపో

ఎక్కడైనా నిలిచిపో ఏనాటికైనా నిలిచిపో
తెలుగు తత్వాల తెలుగు నాడితో ఉండిపో
నదుల ప్రవాహంలా జగమంతా తెలుగుతో సాగిపో
దేశ విదేశాల ప్రయాణాలలో తెలుగు విజ్ఞానాన్ని చాటిపో
జగమంతా తెలుగు తెనీయం ప్రపంచమంతా తెలుగు పంచామృతం అని తెలిపిపో
విశ్వమంతా తెలుగు వినయం స్వరమంతా తెలుగు సంగీతమని తీయగా పాడుతూ వెళ్ళిపో
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Friday, September 11, 2015

విశ్వానికి స్వాగతం! విశ్వ పూజకు సుస్వాగతం! అందరూ ఆహ్వానితులే

విశ్వానికి స్వాగతం! విశ్వ పూజకు సుస్వాగతం! అందరూ ఆహ్వానితులే
విశ్వానికి దయచేయండి విశ్వ పండుగను అందరు కలిసి చేసుకొందాం
విశ్వ విజ్ఞేశ్వర శ్రీ సత్య 'సూర్య' నారాయణ వ్రత పూజ నేడు ఇక్కడ జరుగుతోంది
పవిత్రత పరిశుద్ధత పరిపూర్ణత వినయం విధేయత విజ్ఞాన అనుభవాలతో సాగుతున్నది
సూర్యోదయం అవుతున్నది ఆకాశం తెల్లవారి మెలకువతో పిలుస్తున్నది
సూర్య కిరణాలు భూమిని నీటిని తాకూతూ దివ్య తేజస్సుతో పవిత్రతను కలిగిస్తున్నాయి
సుప్రభాతం గాయిత్రి మంత్రం శివ స్తుతి లతో కార్యం మొదలవుతున్నది
గోరింటాకుతో కూడిన చేతులను కడుగుతూ కార్యాలు మొదలవుతున్నాయి
శుభ్రమైన నీటితో వస్తువులను వివిధ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు
ఎక్కడ ఏది చూసిన శుభ్రంగా అందంగా సుగంధాలతో కూడియున్నది
ఎక్కడి ఏది ఉంచాలో ఎక్కడ ఎవరు ఉండాలో చక్కగా నిర్ణయించారు
గోరు వెచ్చని నీళ్ళు సుగంధ పుష్పాల సరస్సులో పసుపు స్నానాలు
నూతన వస్త్రాలు సువర్ణ వజ్ర ముత్యపు నవరత్న ఆభరణ అలంకరణాలు
సుగంధము కుంకుమ తిలకము పసుపు పారాణి ఇలా సాగుతున్నాయి
సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు అంతరిక్షమై పూజకు బయలు దేరుతున్నారు
ముక్కోటి దేవతలతో బ్రంహా విష్ణు మహేశ్వరులు భువికి బయలు దేరినారు
పల్లె నుండి పట్టణాల వరకు స్వదేశం నుండి విదేశీయులందరూ వస్తున్నారు
ప్రతి ఒక్కరు ఏదో ఒక కార్యాన్ని చేస్తూ అలా అందరితో సాగిపోతున్నారు
విశ్వ పూజకు పూలు పండ్లు మిఠాయిలు నవ దశ శత ధాన్యాలు వచ్చేస్తున్నాయి
తేనే పాలు పెరుగు పసుపు కుంకుమ అభిషేకం అర్చనలు జరుగుతున్నాయి
కర్పూర అగరబత్తీలు టెంకాయలు సాంబ్రాణి సుగంధ ధూపములున్నాయి
నైవేద్యం పరమాణ్ణం పంచామృతం అమృతం తీర్థం సిద్ధమైనాయి
హోమం హారతి లక్షల దీపారాధన కోట్ల పుష్పాల అలంకరణాలు ఉన్నాయి
శిల్పాలంకారణ చిత్రాలంకారణ రంగుల ముగ్గుల అలంకారణాలు ఎన్నో ఉన్నాయి
నామకరణం గృహ ప్రవేశం శంకుస్థాపన భూమి పూజ ఆయుధ పూజలున్నాయి
విగ్రహ ప్రతిష్ట మూల స్థంబ ప్రతిష్టాపన ఆలయ గోపుర నిర్మాణములు ఉన్నాయి
అద్భుతం ఆశ్చర్యం పరిచే శిల్ప కళ చిత్ర కళ నైపుణ్యములు కొనసాగుతున్నాయి
పుష్పావతీయం వివాహ నిశ్చయాలు పెళ్ళిళ్ళు షష్టి పూర్తి  ఇచ్చి పుచ్చు కోవడాలున్నాయి
స్నేహితులు శత్రువులు బంధువులు ఉన్నవారు లేనివారు కలసి మెలసి పోతున్నారు
సన్నాయి మేళ తాళాలతో మంగళ వాయిద్య భజంత్రీలు మ్రోగుతున్నాయి
గౌరీ గోమాత వర లక్ష్మి వ్రతం సంతోష మాత దేవి శక్తి కాళిక వ్రతాలు ఎన్నో ఉన్నాయి
శివ రాత్రి నవ రాత్రులు ఎన్నో జాగరణాలు భజన హరి కథలతో సాగుతున్నాయి
ఉత్సవ వైభవ బ్రంహోత్సవ రథోత్సవాలు పల్లకి ఊరేగింపులు ఎన్నో ఉన్నాయి
యోగ ధ్యాన శిభిరాలు విశ్రాంతి సేవ శిభిరాలు విశిష్టమై ఉన్నాయి
రాజ మందిరాలు కోటలు మండపాలు అత్యంత సుందరమై ఉన్నాయి
నదులు సరస్సులు కొలనులు వాగులు వంకలు జలపాతాలు ఉన్నాయి
హిమాలయాలు శిఖరాలు పర్వతాలు ఖండాలు ద్వీపాలు ఎన్నో ఉన్నాయి
సప్త సముద్రాలు గుహలు ఎడారులు ఖనిజాలు ప్రకృతి పంచ భూతములున్నాయి
ప్రజలు సైనికులు మంత్రులు రాజులు కవులు పండితులు పురోహితులు గురువులు
వైద్యులు శాస్త్రజ్ఞులు పరిశోధకులు కార్మికులు వివిధ వృత్తుల వారు దయ చేస్తున్నారు
మహానుభావులు మహాత్ములు మహర్షులు యోగులు ఋషులు దర్శనమిస్తున్నారు
శిశువులు పిల్లలు యువకులు పెద్దలు వృద్దులు వయో వృద్దులు అందరు వస్తున్నారు
సంగీతం నృత్యం సాహిత్యం ఆటలు అంతాక్షరి పద్యాలు అన్ని రకాల కాళా ప్రదర్శనలున్నాయి
నెమలి వయ్యారం హంస శృంగారం చిలుక కోయిల పలుకులు ఇతర ధ్వనులున్నాయి
దూర దర్శనములు చిత్ర ప్రదర్శనములు సాంకేతిక అంతర్జాలములు ఉన్నాయి
వార్తలు దూర సమావేశ కార్యాలు తారా ప్రేషణము చేతి సంచార ధ్వని పరికర జ్ఞానమున్నది
వాణిజ్య వ్యాపార విజ్ఞాన ప్రకటనలు సాంకేతిక సమాచార సంగతుల సంబంధాలున్నాయి
సాంకేతిక పరిజ్ఞాన సంకేత పరి భాషా పరిశోధనలతో వివిధ జీవన కార్యాలు సాగుతున్నాయి
పురావస్తు శాస్త్రములు గ్రంథాలు సూచనలు సూక్తులు పద్దతులు సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి
రామాయణ పురాణాలు మహా భారత భగవద్గీత గ్రంథ శ్లోక పఠనాలు అనేకంగా ఉన్నాయి
శివ ధ్యానం సరస్వతి విధ్యాభ్యాసం ఇతర దేవతలా సభా సమావేశాలు జరుగుతాయి
సత్సంగం సజ్జన సాంగత్యం పరిచయాలు సంతాప శిభిరాలు వేదికలు ఎన్నో ఉన్నాయి
భక్తి ముక్తి మోక్షం జననం మరణం కర్త కర్మ క్రియ కార్య విశేషణములు ఉన్నాయి
సకల జీవ రాసులు సర్వ విధములుగా విశ్వ పూజకు అన్ని దిక్కుల నుండి వచ్చేస్తున్నాయి
జంతువులు కీటకములు జల జీవ రాసులు సూక్ష్మ అణు జీవులు వస్తున్నాయి
అన్నీ జీవులకు అనుకూలంగా ఉండేలా అన్ని విధాల ఏర్పాట్లు జరిగాయి
విశ్వపు అంచుల సరి హద్దుల నుండి సర్వ భావాలు విశ్వ తత్వాలతో వస్తున్నాయి
గాలి వర్షం మేఘం ఉరుములు మెరుపులు పిడుగులు అన్నీ వస్తున్నాయి
ప్రళయాలు సైతం సమ దృష్టితో అనుకూలంగా విశ్వ పూజకు సమకూరేను
జగతికే ఇది ఒక మహా మంచి ముహూర్తం అందరికి వచ్చే అరుదైన అవకాశం
మీ మేధస్సులను మెప్పించే ఆకాశ పందిరితో కూడిన విజ్ఞాన క్షేత్ర శిభిర సమావేశం
లోటు లేని అద్బుతం ఊహకు అందని నిర్వచనం నేత్రానికి కమనీయం
అదరహో అమోఘం అపురూపం అమర బ్రంహాండం అపూర్వం
సుగుణాలు దివ్యమైన లక్షణాలు ప్రత్యేకతలు అదృష్ట జాతకాలు
జీవితం ధన్యం శ్వాస ధ్యాసతో ధ్యానం ఆత్మ పరమాత్మతో అంతర్లీనం
అంతటికి నేనే భాద్యత వహిస్తూ ముగింపు లేని విధంగా సాగిస్తున్నా.....!

Wednesday, September 9, 2015

దేవా.. దర్శనమియ్యవా! దేహాన్ని అర్పిస్తున్నా

దేవా.. దర్శనమియ్యవా!  దేహాన్ని అర్పిస్తున్నా
దయ చూపవా నీ దర్శన భావాన్ని కలిగించవా
కరుణామృతంతో నాకు మోక్షాన్ని ప్రసాదించవా
జీవితమంతా నీ సేవకై ధార పోసినను కరుణించవా
దేహమే చాలిస్తున్నను దైవత్వాన్ని చూపించవా
ఆత్మగా మిగిలిపోయినను పరమాత్మలో కలిపెదవా
ఆశగా లేకున్నను నా ఆశయాన్ని నెరవేర్చదవా
నేనుగా నా దేహాన్ని ఆకాశంగా మార్చేస్తున్నా చూసేదవా
పంచ భూతములయందు నేనే విశ్వమైనానని తెలిపెదవా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

Tuesday, September 8, 2015

సముద్రమందైనా హిమాలయమందైనా ఉదయించే సూర్యుడిని ఒక్కడినే

సముద్రమందైనా హిమాలయమందైనా ఉదయించే సూర్యుడిని ఒక్కడినే
ఎక్కడ ఎలా కనిపించినా ఎలా ఉదయిస్తున్నా ప్రతి చోట నేను ఒక్కడినే
మేఘాలయందైనా కొండ వాగులయందైనా ఆకాశపు సరిహద్దులయందైనా
పగటి వెలుగును ఇచ్చే దివ్య కాంతుల భావాన్ని జగతికి నేను ఒక్కడినే
నా కిరణాలే నా వర్ణ తేజస్సు నా వర్ణమే అగ్ని కణాల సమర కూటమి
అస్తమించుటలో కూడా ప్రతి చోట ఆకాశమందు ఎచటనైనా నేను ఒక్కడినే
ఎడారియందైనా పచ్చని పొలాలయందైనా ఉదయిస్తూ అస్తమించే వాడిని నేనే
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

సువర్ణములో ఒదిగిన సుందరమైన వర్ణ కాంతిని నేనే

సువర్ణములో ఒదిగిన సుందరమైన వర్ణ కాంతిని నేనే
సువర్ణములో సుందరమైన వర్ణ భావన అతి మధురం
సువర్ణములో పొదిగిన నవ రత్నాలు భావాల హారమే
సువర్ణం మేధస్సుకే మహా మోహం దేహానికే దాసోహం
సువర్ణం అలంకారానికే అమోఘం శృంగారానికే సోయగం
సువర్ణాలతో జీవించే మేధస్సులలో సుగుణాల పారిజాతం
సూర్యునిలో దాగిన సువర్ణ కాంతియే జగతికి వెలుగుల తేజత్వం
సువర్ణ భావాల విజ్ఞానమే పరిశుద్ధ పరిపూర్ణతల ఆలోచననీయం
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

విశ్వ కవులలో ఆఖరి కవిగా ఐనా గుర్తింపు

విశ్వ కవులలో ఆఖరి కవిగా ఐనా గుర్తింపు తెచ్చుకోగల్గుతాను
నా ఆలోచనల భావాలతో నేను నా విశ్వ కవిత్వాన్ని వర్ణిస్తున్నా
నా ఆలోచన విధానాలు ఎప్పుడూ విశ్వాన్నే స్మరిస్తుంటాయి
ఓ వైపు జీవన విధానాన్ని ఇంకో వైపు విశ్వ కవిత్వాన్ని ఆలోచిస్తున్నా
విశ్వ కవిత్వాన్ని వద్దనుకున్నా మేధస్సులో ఏదో భావాల రుగ్మత
ఏ విశ్వ భావమైనా విశ్వ విజ్ఞానమునకై విశ్వ కవిత్వాన్ని వర్ణిస్తున్నా
విశ్వాన్ని వర్ణించుటలో భాషా విజ్ఞానం పద విషయార్థం తెలుస్తున్నది
మనకు తెలియని ఎన్నో గొప్ప ఆలోచనలు ఎందరిలో కలుగుతుంటాయి
గొప్ప ఆలోచనలు తెలియకుండా పోవడం విజ్ఞాన కొరతగా అనిపిస్తుంది
విశ్వ విజ్ఞానమునకైనా నా ఆలోచన భావాలు అర్థంగా నిలిచిపోతాయి
విజ్ఞానమునకో కవిత్వానికో మీరే అర్థాన్ని గ్రహిస్తూ ఎదగాలని నా వాంఛ
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

విశ్వమా! నేనే సూర్యుడినై ఉదయిస్తున్నా ఈ లోకంలో

విశ్వమా! నేనే సూర్యుడినై ఉదయిస్తున్నా ఈ లోకంలో
విశ్వపు జీవుల మేధస్సులలో ఉత్తేజానికై ప్రకాశిస్తున్నా
జీవుల కార్యాల బహు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నా
తరతరాల జీవుల జీవితాలకై లోకమంతా వెలుగును ఇస్తున్నా
నాలోనే విజ్ఞానం నాలోనే కదలిక నాలోనే అనంతం నేనే జీవిస్తున్నా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

Friday, September 4, 2015

తెలుగు స్వాగతం మా తెలుగు తల్లికి సుస్వాగతం

తెలుగు స్వాగతం మా తెలుగు తల్లికి సుస్వాగతం
తెలుగు స్వాగతం మా తెలుగు భాషకు సుస్వాగతం
తెలుగు స్వాగతం మా తెలుగు మాతకు సుస్వాగతం
తెలుగు స్వాగతం మా తెలుగు భారతికి సుస్వాగతం
తెలుగు స్వాగతం మా తెలుగు దేశానికి సుస్వాగతం
తెలుగు స్వాగతం మా తెలుగు ప్రపంచానికి సుస్వాగతం
తెలుగు స్వాగతం మా తెలుగు జగతికి సుస్వాగతం
తెలుగు స్వాగతం మా తెలుగు విశ్వానికి సుస్వాగతం

తెలుగు భావాలు సుమధుర మనోహర పుష్పాలు
తెలుగు పదాలు తేనీయ మకరంద మందారాలు
తెలుగు స్వరాలు సంగీత మాధుర్య మధుర గానాలు
తెలుగు గీతాలు సంగీత సరిగమల పదనిస రాగాలు
తెలుగు దనం పసిడి వెన్నెల తేట తెలుపు తరగని తరాలు
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

Thursday, September 3, 2015

రోగాన్ని జయించు అనారోగ్యాన్ని వదిలించు

రోగాన్ని జయించు అనారోగ్యాన్ని వదిలించు
ఆలోచన విధానాన్ని మారుస్తూ అలవాట్లను వదిలించు
శ్వాస ధ్యాసతో రోగ ధ్యాసను ఆలోచనలతో వదిలించు
నిత్యం వృతి వ్యవహారాలతో అనర్థక ఆలోచనలను వదిలించు
ఆహార వ్యవహారాలలో అనారోగ కారణ ఇష్టాలను వదిలించు
యోగ ఆసనాలతో రోగ ధ్యాసను రోజులుగా వదిలించు
జీవన విధానాన్ని మరో కోణంలో ఆలోచిస్తూ అశాంతిని వదిలించు
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Wednesday, September 2, 2015

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.....!

దైవ దర్శనం నిత్య పూజితం
లోక భాస్వరం విశ్వ మంగళం
సత్య సాగరం శాంతి సంభావనం
పుష్ప అలంకారం పత్ర సోపానం  
భావ స్వభావం తత్వ తాపత్రయం

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.....!

శ్వాస సాత్వికం ఆత్మ అద్వైత్వం
ధ్యాస ఆధ్యాత్మకం పరమార్థ సార్థకం
సుగుణ పవిత్రం శుద్ధ పరిపూర్ణం
దేహ కారణం జనన చరణం
బుద్ధి లక్షణం మరణ కర్మణం

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.....!
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.....! 

అంతర్జాల కాగితాలతో నా భావాలు ప్రపంచమంతా ప్రయాణిస్తున్నాయి

అంతర్జాల కాగితాలతో నా భావాలు ప్రపంచమంతా ప్రయాణిస్తున్నాయి
నా భాషా విజ్ఞాన పద వాక్యాలు వివిధ భావాలను తెలుపుతున్నాయి
నా విశ్వ భావాలు నా నుండి విశ్వ ప్రపంచమంతా సాగిపోతున్నాయి
ఎప్పటికప్పుడు నా భావాలు క్షణాలలో అందరికి చేరుతున్నాయి
మీ కోసం నా భావాలు కొత్త కొత్త స్వభావాలతో కొనసాగుతున్నాయి
నాలో దాగిన వివిధ తత్వాల భావాలు మీకు ఇలా అందుతున్నాయి
భావాలతో విశ్వమంతా నేనే ప్రయాణిస్తున్నట్లు మేధస్సులో పదాలు ఆలోచిస్తున్నాయి
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

అను క్షణం ఒక అక్షర యోగం

అను క్షణం ఒక అక్షర యోగం
అను దినం ఒక పద యాగం
క్షణ క్షణం అక్షరాల అధ్యాయం
ప్రతి క్షణం అనేక పదాల విన్యాసం
అను దినం బహు వాక్యాల కాల చరితం
నిరీక్షణం పద పదాల వాక్యాలతో సామరస్యం
ప్రతి రోజు అక్షర పద వాక్యాల స్వాధ్యాయం
అక్షర పద విజ్ఞానం భాషా పరిపూర్ణత్వం
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Tuesday, September 1, 2015

విశ్వ కిరణంలా ఆకాశమంతా సూర్యుని తేజస్సుతో

విశ్వ కిరణంలా ఆకాశమంతా సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నా
సూర్యుని చుట్టూ అన్ని వైపులా దివ్యమైన కాంతితో వెలుగుతున్నా
సముద్రాలు పర్వతాలు ఎడారులు లోయలు గుహలలో సైతం
నా వెలుగు విశ్వమంతా ప్రకాశిస్తూనే ఉదయిస్తూ అస్తమిస్తుంది
విశ్వపు సరి హద్దుల దాక కిరణాల తేజస్సు నిటారుగా వాలిపోతుంది
విశ్వానికి వెలుగునై ఆకాశానికి స్థానమై ప్రతి ప్రదేశాన నేనే
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

విశ్వమున నీవు భావాన్ని కలిగించు నీ మేధస్సుకు

విశ్వమున నీవు భావాన్ని కలిగించు నీ మేధస్సుకు
భావాన్ని తిలకిస్తూ ఆలోచనగా అర్థాన్ని కలిగించు
విజ్ఞాన పరమార్థమే విశ్వ భావాలకు మార్గ దర్శనం
విశ్వ భావమే జీవ తత్వాల జీవన బంధాల బంధుత్వం
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

నీ విశ్వ రూపాన్ని నేనే చూస్తున్నా మిత్రమా!

నీ విశ్వ రూపాన్ని నేనే చూస్తున్నా మిత్రమా!
నీలోని భావాలను నేనే గ్రహిస్తున్నా మిత్రమా!
నీ ఆలోచనలను నేనే తెలుపుతున్నా మిత్రమా!
నీ విజ్ఞాన కార్యాలను నేనే కొన సాగిస్తున్నా మిత్రమా!  
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!