Showing posts with label సంస్కారం. Show all posts
Showing posts with label సంస్కారం. Show all posts

Wednesday, March 15, 2017

ఏ భాషలో లేదని చెప్పగలవు స్వాగతం సుస్వాగతం

ఏ భాషలో లేదని చెప్పగలవు స్వాగతం సుస్వాగతం
ప్రతి భాషలో ఉందని చెప్పగలవు పలకరించే ఆహ్వానం

ప్రతి జీవికి తెలుసు జీవించే విధానం పలకరించే స్వభావం
ప్రతి జీవికి తెలుసు జీవనమే సాగరం జీవితమే తమ లక్ష్యం  || ఏ భాషలో ||

మనలో లేని విజ్ఞానం మన భాష తెలుపకున్నా పరభాష తెలిపేను మన కోసం ఒక అనుభవం
మనలో లేని వినయం మనం ఎవరికి తెలుపకున్నా పరభాష మిత్రులకు అణకువతో కలిగేను

మనం నేర్చే కొత్తది ఏదైనా ఇతరులకు తెలిపితే మనకై ఎవరైనా మరో కొత్త విజ్ఞానం తెలిపేను కృతజ్ఞతతో
మనం తెలిపే జ్ఞానం ఏదైనా ఇతరులకు ఉపయోగమైతే ఉపకారం చేసేదరు మన కోసం ఒక గొప్ప భావంతో  || ఏ భాషలో ||

ప్రతి జీవికి భాషే ప్రధానం విచక్షణే ప్రముఖం చలనమే సౌఖ్యం ప్రయాణమే బంధం
ప్రతి జీవికి పరభాష తెలియని విషయమే తెలుసుకుంటే నేర్చుకునే పర భావ తత్వం

ప్రతి జీవిలో సుఖ దుఃఖాల కలహాలు ఆహార ఆరోగ్యపు జాగ్రత్తలు కాలంతో కలిగే మార్పుల సంభవాలు
ప్రతి జీవిలో ప్రశాంతమైన భావాలు పరివర్తనం కలిగే మార్పులు కాలంతో అనుకూలించే సంఘటనలు  || ఏ భాషలో ||

ప్రతి జీవి మన విజ్ఞానం ప్రతి భాష మన అవసరం ప్రతి సమస్య మన అనుభవం ప్రతి హితం పరమార్థం
ప్రతి జీవి మన ఉపయోగం ప్రతి సమస్య ఓ పరిష్కారం ప్రతి నేర్పు ఓ గమనం ప్రతి కార్యం ఓ చైతన్యం

ప్రతి జీవిలో ఓ పట్టుదల ఓ సాహసం ఓ దీక్ష ఓ సాధన ఓ లక్ష్యం ఓ నైపుణ్యం
ప్రతి జీవిలో ఓ ఎదుగుదల ఓ అనుభవం ఓ విజయం ఓ గౌరవం ఓ సంస్కారం  || ఏ భాషలో ||