Thursday, April 20, 2017

ఏ రోజుతో మొదలైనదో ఈ విశ్వం

ఏ రోజుతో మొదలైనదో ఈ విశ్వం
ఏ ధ్యాసతో వెలిసినదో ఈ జగం
ఏ భావంతో ఉదయించినదో ఈ లోకం
ఏ తత్వంతో ఆరంభమైనదో ఈ ప్రపంచం  || ఏ రోజుతో ||

స్త్రీ తత్వమే జగతికి మొదటి భావన
స్త్రీ భావమే విశ్వానికి మొదటి కార్యన
స్త్రీ స్వభావమే లోకానికి మొదటి స్పర్శన
స్త్రీ ఆకారమే ప్రపంచానికి మొదటి జీవన  || ఏ రోజుతో ||

సూర్య రూపమే విశ్వానికి దైవ కార్య చలన
ఆకాశ తత్వమే లోకానికి ధర్మ భావ స్మరణ
పృథ్వీ స్వభావమే జగతికి జీవ దేహ జనన
జల స్వభావ తత్వమే సృష్టికి సజీవ కర్మన
వాయు ప్రభావమే ప్రపంచానికి ప్రాణ జీవన  || ఏ రోజుతో || 

Tuesday, April 18, 2017

జీవించవా నా శ్వాసతో ధ్యానించవా నా ధ్యాసతో

జీవించవా నా శ్వాసతో ధ్యానించవా నా ధ్యాసతో
గమనించవా నా భావాలతో తపించవా నా తత్వాలతో
ప్రతి క్షణం ప్రతి సమయం నా విశ్వ రూప విజ్ఞానంతో  || జీవించవా ||

శ్వాసలో నీవే ధ్యాసలో నీవే గమనమై మరో జీవమై ధ్యానించెదవో
రూపమే నీవై దేహమే నీవై వేద స్వభావ తత్వంతో తపించెదవో

స్వరములో నీవై ఉచ్చ్వాసలో నీవై మహా గుణముతో నీవు స్పందించెదవో
జీవములో నీవై ప్రాణములో నీవై మహా లక్ష్యముతో నీవు పరవశించెదవో   || జీవించవా ||

వినయము నీవే విధేయత నీవే విశ్వ బంధము నీవే తెలిపెదవో
మౌనము నీవే మమతవు నీవే మధుర తత్వము నీవే గ్రహించెదవో

జ్ఞానము నీవే గమకము నీవే గాత్రము నీవే నడిపించెదవో
దైవము నీవే ధీరము నీవే కాల ధర్మము నీవే సాగించెదవో       || జీవించవా ||

Monday, April 17, 2017

ఆలోచనకే ఆలోచనగా మిగిలావా

ఆలోచనకే ఆలోచనగా మిగిలావా
భావానికే భావనగా మిగిలున్నావా
స్వరానికే స్వరమై ఆగిపోయెదవా
వేదనకే ఆవేదనమై ఆగిపోయావా

మనలో దాగిన భావాలే ఆలోచనలుగా స్వరమై వేదమయ్యేను
మనలో నిండిన స్వప్నాలే ఊహలుగా భావాలనే కలిగించేను  || ఆలోచనకే ||

ఏ జీవి తత్వమో ఏ జీవి రూపమో
ఏ రూప భావమో ఏ తత్వ జీవమో

మనిషిగా ఎదిగే జీవం ఏ స్వభావమో
మనిషిగా ఒదిగే జీవం ఏ వేదాంతమో

మనలో మనమే మనమై జీవిస్తున్నాం
మనలో మనమే మనమై ఆలోచిస్తున్నాం   || ఆలోచనకే ||

ఏనాటి జీవ తత్వమో ఏనాటి జీవ రూపమో
ఎటువంటి రూపత్వమో ఎంతటి జీవత్వమో

మనిషిగా జీవించే స్వభావం మనలో విశ్వాసమే
మనిషిగా ధ్యానించే భావం మనలో ప్రశాంతమే

మనలో మనమే ఏకమై మనమే నివశిస్తున్నాం
మనలో మనమే ఐక్యమై మనమే జ్వలిస్తున్నాం   || ఆలోచనకే ||

ఎవరివో నీవు ఎక్కడి వాడివో నీవు

ఎవరివో నీవు ఎక్కడి వాడివో నీవు
ఎంతటి వాడివో నీవు ఏనాటి వాడివో నీవు
ఎలా ఉన్నావో నీవు ఎక్కడ ఉన్నావో నీవు
ఎవరైనా నిన్ను చూశారో ఏనాడైనా నిన్ను తలచారో
ఎవరికి తెలియని రూపాన్ని ఎలా తెలుసుకుంటారో   || ఎవరివో ||

ఎవరివో నీవు ఎవరివో ఏనాటి వాడివో నీవు
ఎక్కడ ఉన్నావో నీవు ఎలా ఉంటావో నీవు
నిన్నే చూడాలని నిన్నే చూస్తూన్నదే భావన
నిన్నే కలవాలని నిన్నే తలస్తున్నదే తత్వన   || ఎవరివో ||

ఎవరివో నీవు ఎవరివో ఎక్కడ వాడివో నీవు
ఎవరికి ఎలా తోచెదవో ఎవరికి ఎలా ఉంటావో
నిన్నే మరవాలని నిన్నే తపిస్తున్నదే వేదన
నిన్నే వదలాలని నిన్నే మరిపిస్తున్నది దీవెన   || ఎవరివో || 

Thursday, April 13, 2017

ఏ దేహమో నీది ఏ రూపమో నీది

ఏ దేహమో నీది ఏ రూపమో నీది
ఏ దైవమో నీది ఏ ఆకారమో నీది

సత్యానికే నిత్యమై మాటకే మౌనమై వెలసినావు జీవుల రూపాలలో   || ఏ దేహమో ||

ప్రతి రూపంలో పరిశోధనగా ప్రతి ఆకారంలో పరిశీలనగా
ప్రతి దేహంలో పర్యవేక్షణగా ప్రతి దైవంలో పరిశుద్ధంగా
పరిపూర్ణమై ప్రజ్ఞానంతో ప్రకారమై జగతిలో జీవిస్తున్నావు   || ఏ దేహమో ||

ప్రతి స్వరములో సంఘర్షణగా ప్రతి శ్వాసలో సంకీర్తనగా
ప్రతి ధ్యాసలో ధీరముగా ప్రతి ధ్యానంలో మహా దివ్యంగా
స్వర విజ్ఞాన సంపూర్ణ స్వయంభువమై విశ్వంలో వెలిసావు   || ఏ దేహమో || 

Tuesday, April 11, 2017

అద్భుతమో ఆశ్చర్యమో

అద్భుతమో ఆశ్చర్యమో
అనుభవమో అమోఘమో
జీవితానికే మహా గుణపాఠమో
జీవులకే మహా స్వభావత్వమో
కనివిని ఎరుగని విశ్వ విజ్ఞాన చరితమో  || అద్భుతమో ||

ప్రతి నిత్యం మహా అద్భుతమో
ప్రతి సత్యం మహా ఆశ్చర్యమో
ప్రతి రూపం మహా నిర్మాణమో
ప్రతి దేహం మహా సిద్ధాంతమో
అనుభవానికే ప్రతి స్వరూపం మహా దైవాంశమో  || అద్భుతమో ||

ప్రతి భావం మహా స్వభావమో
ప్రతి వేదం మహా సుతత్వమో
ప్రతి దైవం మహా గుణ సతతమో
ప్రతి జీవం మహా శ్వాస తత్వమో
విజ్ఞానానికే ప్రతి స్పర్శత్వం మహా దివ్యాంశమో  || అద్భుతమో ||