Showing posts with label మనిషి. Show all posts
Showing posts with label మనిషి. Show all posts

Friday, May 5, 2017

ఓ పరమాత్మా ... ! నీవే నా ఆత్మా ... !

ఓ పరమాత్మా ... ! నీవే నా ఆత్మా ... !
ఓ పరంధామా ... ! నీవే నా ధామా ... !

జగతికి నీవే జీవమై విశ్వానికి నీవే శ్వాసవై
లోకానికి నీవే ధ్యాసవై సృష్టికి నీవే ప్రాణమై
ప్రతి జీవి దేహంలో మహా దైవమై నిలిచావు  || ఓ పరమాత్మా ||

ఎదిగే జీవులకు విజ్ఞానం నీవే కల్పించావు
ఒదిగే జనులకు ప్రజ్ఞానం నీవే అందిచావు

మనిషిగా మానవత్వం చాటే వారికి మహాత్మ భావాలే చూపావు
మహాత్మగా మహోన్నత తత్వం చూసే వారికి కరుణే ఇచ్చావు   || ఓ పరమాత్మా ||

మహర్షిగా మారే నీ రూపంలో దైవాన్నే కొలిచావు
దేవర్షిగా మారే నీ దేహంలో ధర్మాన్నే నిలిపావు

మనిషిలోనే మహాత్ముడు ఉన్నాడని మహా తత్వాన్ని నింపావు
మహాత్మలోనే పరమాత్ముడు ఉంటాడని మహా భావాన్ని చాటావు   || ఓ పరమాత్మా || 

Wednesday, May 3, 2017

ఏది నీ దేశం ఏది మన దేశం

ఏది నీ దేశం ఏది మన దేశం
ఏది మన భావం ఏది మన తత్వం
మనలోనే విశ్వ గీతం మనలోనే జగతి పతాకం
మనమే చైతన్యం మనమే ఐక్యత చిహ్నం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

మనిషిగా జీవించు మనస్సుతో జగతినే నడిపించు
మహర్షిగా దీవించు మనస్సుతో విశ్వాన్నే సాగించు

మనలోనే మాధవుడు మనలోనే మహాత్ముడు ఉదయిస్తున్నాడు
మనలోనే పరమాత్మ మనలోనే పరంధామ ఎదుగుతున్నాడు ఓ మానవా!  || ఏది నీ దేశం ||

దేశ దేశాలు తిరిగినా ప్రపంచమంతా విజ్ఞాన అన్వేషణయే
ఎన్ని రోజులు గడిచినా విశ్వమంతా విజ్ఞాన పరిశోధనయే

మనిషిలోనే సద్భావం మనలోనే మానవత్వం
మనిషిలోనే విజ్ఞానం మనలోనే పరిశుద్ధాత్మం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

Monday, April 17, 2017

ఆలోచనకే ఆలోచనగా మిగిలావా

ఆలోచనకే ఆలోచనగా మిగిలావా
భావానికే భావనగా మిగిలున్నావా
స్వరానికే స్వరమై ఆగిపోయెదవా
వేదనకే ఆవేదనమై ఆగిపోయావా

మనలో దాగిన భావాలే ఆలోచనలుగా స్వరమై వేదమయ్యేను
మనలో నిండిన స్వప్నాలే ఊహలుగా భావాలనే కలిగించేను  || ఆలోచనకే ||

ఏ జీవి తత్వమో ఏ జీవి రూపమో
ఏ రూప భావమో ఏ తత్వ జీవమో

మనిషిగా ఎదిగే జీవం ఏ స్వభావమో
మనిషిగా ఒదిగే జీవం ఏ వేదాంతమో

మనలో మనమే మనమై జీవిస్తున్నాం
మనలో మనమే మనమై ఆలోచిస్తున్నాం   || ఆలోచనకే ||

ఏనాటి జీవ తత్వమో ఏనాటి జీవ రూపమో
ఎటువంటి రూపత్వమో ఎంతటి జీవత్వమో

మనిషిగా జీవించే స్వభావం మనలో విశ్వాసమే
మనిషిగా ధ్యానించే భావం మనలో ప్రశాంతమే

మనలో మనమే ఏకమై మనమే నివశిస్తున్నాం
మనలో మనమే ఐక్యమై మనమే జ్వలిస్తున్నాం   || ఆలోచనకే ||

Monday, July 11, 2016

మనిషి నాయకుడు అధిపతి మహామంత్రి మహాత్మ పరమాత్మ

మనిషి నాయకుడు అధిపతి మహామంత్రి మహాత్మ పరమాత్మ
మనిషి తన నివాసంతో పాటు తన సమాజాన్ని మార్చాలి
నాయకుడు తన సమాజంతో పాటు తన గ్రామాన్ని మార్చాలి
అధిపతి తన గ్రామంతో పాటు తన రాష్ట్రాన్ని మార్చాలి
మహామంత్రి తన రాష్ట్రంతో పాటు దేశాన్ని మార్చాలి
మహాత్మ తన దేశంతో పాటు ప్రపంచాన్ని మార్చాలి
పరమాత్మ తన ప్రపంచంతో పాటు అంతరిక్ష అనంత లోకాలను మార్చాలి
సామాన్యుడు తనకు తానుగా మనిషిగా ఎదుగుతూ పరమాత్మ కావాలి
ప్రతి ఒక్కరు ప్రతి మనిషికి దేశానికి ప్రపంచానికి మార్గ దర్శకం కావాలి