Showing posts with label అనుకువ. Show all posts
Showing posts with label అనుకువ. Show all posts

Wednesday, July 19, 2017

ఉదయించే సూర్యున్ని చూసిన క్షణమే నా మేధస్సు మెరిసిందిలే

ఉదయించే సూర్యున్ని చూసిన క్షణమే నా మేధస్సు మెరిసిందిలే
అవతరించే చంద్రున్ని చూసిన క్షణమే నా భావన మెచ్చిందిలే
అధిరోహించే మేఘాన్ని చూసిన క్షణమే నా వేదన మురిసిందిలే   || ఉదయించే ||

మెలకువతో కలిగే విజ్ఞానం ప్రజ్వలించే సూర్యోదయ తేజం
అనుకువతో కలిగే ప్రమోదం పరిమళించే చంద్రుని కాంతం

ఆకాశాన్ని చూడగా నా మేధస్సులో కలిగే వేద భావాలే అమరం
విశ్వాన్ని చూడగా నా ఆలోచనలో కదిలే వేద తత్వాలే అమోఘం
జగతిని చూడగా నా మనస్సులో కలిగే వేద స్వభావాలే అఖిలం    || ఉదయించే ||

మెలకువతో వచ్చే ఆలోచన విజ్ఞాన కార్యాల కార్యాచరణం
అనుకువతో వచ్చే స్వభావన ప్రజ్ఞాన కార్యాల కార్యాదరణం

ఆకాశాన్ని చూస్తూనే నిలిచిపోయే అనంతమైన భావాలు ఆవరణం
విశ్వాన్ని చూస్తూనే తలిచిపోయే అమరమైన తత్వాలు అఖండం
జగతిని చూస్తూనే మరచిపోయే అపురూపమైన గుణాలు ఆనందం   || ఉదయించే ||