Showing posts with label ధ్యానం. Show all posts
Showing posts with label ధ్యానం. Show all posts

Tuesday, June 27, 2017

విశ్వమే శ్వాసగా వేదమే ధ్యాసగా

విశ్వమే శ్వాసగా వేదమే ధ్యాసగా
జగమే జీవంగా విజ్ఞానమే ధ్యానంగా

స్వరమే సత్యంగా రాగమే ధర్మంగా
దైవమే దేహంగా గాత్రమే ప్రాణంగా

మేధస్సులో కలిగే భావాలకు ఆలోచనలో అనుభవాలు
మదిలో కలిగే మోహములకు మనస్సులో మధురములు   || విశ్వమే ||

జీవమై ఏ రూపం ఉన్నా శ్వాసగా ప్రాణం జీవిస్తున్నదే
భావమై ఏ జ్ఞానం ఉన్నా ధ్యాసగా మోహం తపిస్తున్నదే

స్వరములో తపనం ఉన్నా మౌనం మహోన్నతమైనదే
జీవములో అదరం ఉన్నా ప్రాణం అభియోగ్యతమైనదే   || విశ్వమే ||

విజ్ఞానం ఎవరితో ఉన్నా స్వధ్యాసతో సత్యమైనదే
వేదాంతం ఎవరిలో ఉన్నా  ధ్యానంతో నిత్యమైనదే

ధర్మం ఎక్కడ ఉన్నా దైవం అన్వేషిస్తున్నదే
జీవం ఎక్కడ ఉన్నా రూపం ఆవహిస్తున్నదే      || విశ్వమే || 

Thursday, April 13, 2017

ఏ దేహమో నీది ఏ రూపమో నీది

ఏ దేహమో నీది ఏ రూపమో నీది
ఏ దైవమో నీది ఏ ఆకారమో నీది

సత్యానికే నిత్యమై మాటకే మౌనమై వెలసినావు జీవుల రూపాలలో   || ఏ దేహమో ||

ప్రతి రూపంలో పరిశోధనగా ప్రతి ఆకారంలో పరిశీలనగా
ప్రతి దేహంలో పర్యవేక్షణగా ప్రతి దైవంలో పరిశుద్ధంగా
పరిపూర్ణమై ప్రజ్ఞానంతో ప్రకారమై జగతిలో జీవిస్తున్నావు   || ఏ దేహమో ||

ప్రతి స్వరములో సంఘర్షణగా ప్రతి శ్వాసలో సంకీర్తనగా
ప్రతి ధ్యాసలో ధీరముగా ప్రతి ధ్యానంలో మహా దివ్యంగా
స్వర విజ్ఞాన సంపూర్ణ స్వయంభువమై విశ్వంలో వెలిసావు   || ఏ దేహమో || 

Tuesday, March 14, 2017

శ్వాసలో ఉదయించే ఉచ్చ్వాస నాలో కలిగే పర ధ్యానం

శ్వాసలో ఉదయించే ఉచ్చ్వాస నాలో కలిగే పర ధ్యానం
శ్వాసలో అస్తమించే నిచ్ఛ్వాస నాలో నిలిచే పర భావనం

శ్వాసలో సాగే ఉచ్చ్వాస నిచ్చ్వాస కలయికల సమ స్వభావం సంభోగమే
శ్వాసలో సాగే ఉచ్చ్వాస నిచ్చ్వాస కలయికల మహా సంగమం సంయోగమే   || శ్వాసలో ||

ఏ జీవిలో ఏ శ్వాస ఉదయించిన ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సమ భావమే
ఏ జీవిలో ఏ శ్వాస అస్తమించిన ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సమ తత్వమే

ప్రతి జీవిలో ప్రతి శ్వాస ప్రతిధ్వనించే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సమ నాదమే
ప్రతి జీవిలో ప్రతి శ్వాస ప్రతిస్పందించే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సమ తుల్యమే  || శ్వాసలో ||

ప్రతి జీవికి ప్రతి శ్వాస ఉచ్చ్వాస నిచ్చ్వాసాల జీవన కార్యాలతో సాగే సంఘర్షణమే
ప్రతి జీవికి ప్రతి శ్వాస ఉచ్చ్వాస నిచ్చ్వాసాల జీవిత కార్యాలతో సాగే ప్రతిఘటనమే

ఏ జీవితో సాగిన ప్రతి శ్వాస ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాణం కాలమే
ఏ జీవితో సాగిన ప్రతి శ్వాస ఉచ్చ్వాస నిచ్చ్వాసాల తరుణం గమనమే  || శ్వాసలో || 

Friday, January 6, 2017

అణువై అర్థాన్ని కలిగిస్తూ పరమాణువై పరమార్థాన్ని కలిగించేవా

అణువై అర్థాన్ని కలిగిస్తూ పరమాణువై పరమార్థాన్ని కలిగించేవా
దేహాన్ని దైవంగా సత్యాన్ని వేదంగా నిత్యం తెలుపుతూ భోధించేవా   || అణువై ||

ప్రతి అణువు ఓ పర బ్రంహగా ప్రతి పరమాణువు పర విష్ణువుగా పర జీవం ఓ మహా పరమేశ్వరమే
ప్రతి భావం ఓ పర ధ్యానంగా పర తత్వం పర వేదంగా పర దైవాన్ని ఓ మహా సత్యంగా తెలిపేవులే

పరమాణువుల సమూహ చైతన్యాన్ని ఆకార రూప నిశ్చల పరమార్థంగా అణువును చూపెదవు
పరమాణువుల సమూహాన్ని ఆకార రూపంగా ధృడాత్మక స్వభావత్వంతో అణువుగా మార్చెదవు  || అణువై ||

మహా పరమాణువుల స్నేహమే సమైక్యమైన సమన్వయ గుణ భావాల అణువు రూపం
మహా పరమాణువుల సమైక్య స్వభావత్వమే ఏకాభిప్రాయ లక్షణమైన అణువు ఆకారం

వివిధ స్వభావాల అణువులే మహా రూపంగా నిర్మాణమై నవ ఆకారాన్ని దాల్చేను
వివిధ రకాల అణువులే మహా ఆకారంగా నిర్మాణమై నూతన రూపాన్ని ధరించేను  || అణువై || 

Wednesday, December 7, 2016

ఆత్మవు నీవు పరమాత్మవు నీవు

ఆత్మవు నీవు పరమాత్మవు నీవు
మహాత్ములకు మహా తత్వానివి నీవు
మహా ఋషులకు మహర్షివి నీవు
పరంధామగా కరుణించే పరతత్వానివి నీవు  || ఆత్మవు ||

ఆత్మగా వెలిసిన రూపం మహా ఆత్మగా దాల్చిన ఆకారం పరమాత్మగా ఒదిగేనా
మహాత్మగా జీవించే భావం మహర్షిగా ధ్యానించే తత్వం పరంధామగా నిలిచేనా
దేవర్షిగా దైవత్వం బ్రంహర్షిగా బృహత్వం పరతత్వాలతో పరంజ్యోతిగా సాగేనా  || ఆత్మవు ||

వేదాల భావం వేదాంత తత్వం గ్రంధాలలో లిఖించే దైవం ఏనాటి వేదానిదో
కాలం గమనం దేహం ధ్యానం శ్వాసగా ఒదిగే నిత్య రూపం ఏనాటి బంధానిదో
ప్రాణం నేస్తం పత్రం పుష్పం ఒకటిగా సాగే ప్రయాణ దూరం ఏనాటి కాలానిదో  || ఆత్మవు ||

Friday, October 7, 2016

ఓం ఓం నమః శివా నమో నమో హర హర నమః శివా

ఓం ఓం నమః శివా నమో నమో హర హర నమః శివా
ఓం ఓం నమః శివా నమో నమో హర హర నమః శివా

గంగా జల ధార గంగాధర గంగా పవిత్రం పరమేశ్వరం  || ఓం ఓం ||

ఓంకారం శ్రీకారం మకారం త్రికారం ప్రకారం శుభంకరం శంకరం
సురేశం గ్రేష్మం రేష్మం గిరీశం ప్రకాశం ప్రజ్వలం తజ్వలం తేజం
సువర్ణం సుగంధం సుదానం సుమార్గం సుదీశం సుదేశం సుఖాంతం

న పూర్వం న భూతం న కాలం న రూపం న తేజం న శూన్యం
న ముఖం న మోహం న దేహం న ధ్యానం న కారం న భావం

సమస్తం సమాప్తం ప్రళయం ప్రమేయం ప్రతాపం ప్రమాదం
ప్రణామం ప్రశాంతం ప్రసిద్ధం ప్రదేశం ప్రమోదం ప్రకారం    || ఓం ఓం ||

నిదానం నదానం నినాదం నిశ్శబ్దం నిస్వార్థం నిపుణం
నీ దేశం నా దేశం స్వదేశం విదేశం ప్రదేశం ఈ దేశం
నీ రాజ్యం నా రాజ్యం సామ్రాజ్యం స్వరాజ్యం ఈ రాజ్యం

త్రిశూలం త్రివర్ణం త్రిముఖం త్రిపురం త్రిభావం త్రిశుద్ధం
త్రిలోకం త్రికారం త్రిగుణం త్రిశాంతం త్రిభాష్పం త్రినేత్రం  || ఓం ఓం ||

Friday, September 30, 2016

హృదయంలో లేదే నా శ్వాస మేధస్సులో లేదే నా ధ్యాస

హృదయంలో లేదే నా శ్వాస మేధస్సులో లేదే నా ధ్యాస
నాభి నుండి నాసికమున దాగినదే నా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస
దేహములో కలిగినదే చలన భావాల పర తత్వ అభ్యాస      || హృదయంలో ||

నీవే నా శ్వాసగా నేనే నీ ధ్యాసగా ప్రతి సమయం మననం
నీవు నేను ఒకటైతే ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పర ధ్యానం
నీకు నాకు కలిగే స్వభావాలే పరమావధీయ పర తత్వం
నీవు నేను ఒకటిగా జీవిస్తే మనలోనే ఒక పర శ్వాస గమనం  || హృదయంలో ||

నా శ్వాసతో జీవించవా నాతోనే జీవితాన్ని పంచుకోవా
నా ధ్యాసతో చలించవా నాతోనే జీవనాన్ని సాగించవా
నా భావనతో తపించవా నాతోనే ఆలోచిస్తూ ప్రయాణించవా
నా తన్మయంతో స్మరించవా నాతోనే కాలాన్ని నడిపించవా  || హృదయంలో || 

Tuesday, September 27, 2016

ఏనాటి ఋషివో నీవు ఏనాటికి కనిపించని బ్రంహగా నీలోనే మిగిలిపోయావు

ఏనాటి ఋషివో నీవు ఏనాటికి కనిపించని బ్రంహగా నీలోనే మిగిలిపోయావు
ఏనాటి మహాత్మవో నీవు ఏనాటికి తెలియని మహర్షిగా కనిపించలేకపోయావు || ఏనాటి ఋషివో ||

పరంధామగా పరమాత్మవలే పర ధ్యాసలో ఉండిపోయావా
బ్రంహర్షిగా పర బ్రంహ వలే పర ధ్యానంలో నిండిపోయావా

విశ్వ పరంపరలలో ఏ పొరలలో ఎలా దాగి ఉన్నావో తెలుసుకోలేకపోయానే
సకల జీవరాసుల జగతిలో ఎలా ఏ జీవిలో లీనమయ్యావో తెలియకపోయనే  || ఏనాటి ఋషివో ||

ఋషిగా అధిరోహించిన మహర్షి బ్రంహర్షివి నీవే కదా
ఆత్మగా అవతరించిన అవధూత మహాత్మవు నీవే కదా

మహాత్మ విశ్వమంతా విధేయతతో నీ రాకకై ఎదురు చూస్తున్నది
ఓ పరమాత్మ జగమంతా వినయంతో నీ రాకకై తపిస్తూనే ఉన్నది    || ఏనాటి ఋషివో || 

Wednesday, September 21, 2016

ఉన్నావయ్యా నీవు మాలోనే ఉన్నావయ్యా

ఉన్నావయ్యా నీవు మాలోనే ఉన్నావయ్యా
ఉంటావయ్యా నీవు మాతోనే ఉంటావయ్యా
ఎన్నాళ్ళైనా ఏనాటికైనా నీవు మావాడివయ్యా  || ఉన్నావయ్యా ||

శ్వాసలో ధ్యాసవై ఊపిరిలో ఉచ్చ్వాస నిచ్చ్వాసవై ఉంటావులే
ధ్యానంలో దైవమై దేహంలో జీవమై మహా ప్రాణంగా ఉంటావులే

పరంధామగా పరమాత్మగా మా వెంటే వచ్చెదవు
మహాత్మగా మహర్షిగా మాలోనే ఉండి పోయెదవు   || ఉన్నావయ్యా ||

మాధవుడై మా మనస్సులో మహా భావాలతో దాగేవు
మహాత్ముడై మా మేధస్సులో మహా జ్ఞానాన్నే ఇచ్చేవు

హృదయంలో వెలసిన రూపం నీలాంటి ఆకాశాన్నే సూచిస్తున్నది
మదిలో కొలువైన ఆకారం నీలాగే సూర్యోదయమై వెలుగుతున్నది  || ఉన్నావయ్యా || 

Monday, September 12, 2016

భారంగా ప్రేమకు దూరంగా హృదయానికి చేరువ లేదనగా

భారంగా ప్రేమకు దూరంగా హృదయానికి చేరువ లేదనగా
కళ్ళల్లో కన్నీరే రాలేక నీకోసం మదిలో భాదే మొదలాయనే  || భారంగా ||

తప్పేదో జరిగిందా ఒప్పేదో తెలియదా జరిగినది ఏమైనదో
కాలంతో కలిగే విధిని మీరు కథలతోనే కలగా మిగిల్చెదరా

భావాల జీవం స్వభావాల శ్వాస తత్వమైన ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే
ధ్యాస ధ్యానం భాషా జ్ఞానం విశ్వం విజ్ఞానమై ఒకటిగా నీలో దాగినదే  || భారంగా ||

మాటలే శూన్యం మౌనమే గానం మనస్సుకు నీవు మోహనమే
స్నేహమే ప్రేమగా సాగిన ఊహల ఆశలు కలలుగా మిగిలేనా

వేదమే నాలో కలిగిన భావం నీతో సాగినదే అనుకున్నా ఆనాడు
జీవమే నీలో కదిలిన వేదం నాతో సాగేనని అనిపించేను ఆనాడే  || భారంగా || 

Friday, August 5, 2016

ఏదీ మరచిపోవద్దు దేనిని వదలవద్దు

ఏదీ మరచిపోవద్దు దేనిని వదలవద్దు
విజ్ఞానాన్ని మేధస్సులో జ్ఞాపకాలతో నెమరువేసుకో  || ఏదీ ||

ప్రతి అక్షరం ప్రతి పదం మాటగా అంతా పరమార్థమే
ప్రతి అణువు ప్రతి పరమాణువు రూపంగా అంతా చిత్రమే

ప్రతి క్షణం ప్రతి సమయం అంతా కార్యానికి అవసరమే
ప్రతి శ్వాస ప్రతి ధ్యాస అంతా ధ్యానంతో ఉపయోగమే     || ఏదీ ||


ప్రతి భావం ప్రతి తత్వం అంతా దైవత్వ అద్వైత్వమే
ప్రతి స్పర్శ ప్రతి స్పందన అంతా మధురమైన అద్భుతమే

ప్రతి రూపం ప్రతి ఆకారం అంతా చిత్రాల కళాత్మకమే
ప్రతి గమ్యం ప్రతి మార్గం అంతా జీవితానికి సోపానమే   || ఏదీ || 

Tuesday, July 5, 2016

సాహసమే శ్వాస సాగించునా సంతోషమే శ్వాసతో సాగిపోవునా

సాహసమే శ్వాస సాగించునా సంతోషమే శ్వాసతో సాగిపోవునా
శ్వాసయే సాహసమై జీవితాలను యుగ యుగాలుగా సాగించునా  || సాహసమే  ||

శ్వాసలోని జీవమే ఆయుధమై జీవిత సాహసాన్ని సాగించునా
శ్వాసలోని భావమే ఊపిరై జీవన సాహస కార్యాలను సాగించునా

శ్వాసలో స్వర జీవమే ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాలతో సాగునా
శ్వాసలో స్వర బీజమే మహా ప్రాణ వాయువై సాగిపోవునా

శ్వాసలో ఏ శక్తి ఉన్నదో ధ్యాసలో ఏ మర్మం ఉన్నదో
శ్వాసలో ఏ ధీక్ష ఉన్నదో ధ్యాసలో ఏ సాధన ఉన్నదో   || సాహసమే  ||

శ్వాసలోని శ్వాసయే జీవమై మరో జీవాన్ని సృస్టించునా
శ్వాసలోని జీవమే మరో శ్వాసగా జీవమై అలాగే సాగునా

శ్వాసలోని సృష్టి తత్వమే యుగ యుగాలుగా  గడిచిపోవునా
శ్వాసలోని భావమే జీవమై సాహసంతో జీవితాన్ని సాగించునా

శ్వాసలోనే దైవం ఉన్నది అందులోనే మర్మం ఉన్నది
శ్వాసలోనే ధ్యానం ఉన్నది అందులోనే బంధం ఉన్నది  || సాహసమే  ||