Showing posts with label ఆరోగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యం. Show all posts

Monday, June 5, 2017

ఆరోగ్యంతో జీవితం బహు దూర కాల ప్రయాణం

ఆరోగ్యంతో జీవితం బహు దూర కాల ప్రయాణం
అనారోగ్యంతో జీవనం బహు స్వల్ప కాల గమనం
ధీర్ఘాయుస్సుతో జీవిస్తే జీవం మహా కాలంతో తరుణం
ధీర్ఘారోగ్యముతో జీవిస్తే దేహం మహా కాలంతో కరుణం   

Tuesday, March 21, 2017

మరణాన్ని మరచేందుకా మన కార్యాల ప్రయాణం

మరణాన్ని మరచేందుకా మన కార్యాల ప్రయాణం
మరణాన్ని తొలచేందుకా మన ఆలోచనల విజ్ఞానం
మరణాన్ని విడిచేందుకా మన ఆహారముల ఆరోగ్యం
మరణాన్ని పంపించేందుకా మన భావ స్వభావాల తత్వం  || మరణాన్ని ||

మరణమే లేదనుకో నీ కార్యాలతో ముందుకు సాగిపో
మరణమే కాదనుకో నీ ఆహారములతో ఆరోగ్యం చూసుకో
మరణమే వద్దనుకో నీ ఆలోచనలతో విజ్ఞానం పెంచుకో
మరణమే రాదనుకో నీ భావాలతో తత్వాలను గ్రహించుకో

మరణం ఎలా వస్తున్నా పరిశోధనతో దేహాన్ని రక్షించుకో
మరణం ఎలా చూస్తున్నా పరిశీలనతో రూపాన్ని సాగించుకో    || మరణాన్ని ||

మరణం ఎప్పుడు సంభవించినా ఎదురించే సామర్థ్యం పెంచుకో
మరణం ఎక్కడ ఆవహించినా పోరాటంతో ధైర్యాన్ని నింపుకో

మరణం ఎవరితో వస్తున్నా ప్రశాంతతో శ్వాసను ఉంచుకో
మరణం ఎవరితో పోతున్నా పరధ్యాసతో జీవాన్ని బంధించుకో

మరణం ఏదైనా ఆత్మ ప్రశాంతతో సాగిపో
మరణం ఏమైనా జీవ శాంతంతో వెళ్ళిపో    || మరణాన్ని || 

Thursday, October 6, 2016

అనారోగ్యం కలగక ముందే ఆరోగ్యంతో జాగ్రత్త వహించు

అనారోగ్యం కలగక ముందే ఆరోగ్యంతో జాగ్రత్త వహించు
కాలం వృధా కాకముందే సమయాన్ని సద్వినియోగించు
ధనం అత్యధిక ఖర్చులతో సాగక ముందే సంపాదించు
విశ్వమందు నీవు ఎచట ఎలా ఉన్నా నేను నీ మేధస్సులోనే మిత్రమా! 

Thursday, September 8, 2016

విశ్వంలో ఏమున్నదో జగమంతా ఏమి దాగున్నదో

విశ్వంలో ఏమున్నదో జగమంతా ఏమి దాగున్నదో
అన్వేషణతో సాగే మేధస్సుకు ఏదో రహస్యం తెలియాలి
ఆలోచనలలో విజ్ఞానం అనుభవమై కాలంతో సాగిపోవాలి  || విశ్వంలో ||

తెలిసే వరకు ప్రయోగం చేయాలి అర్థం అయ్యేవరకు పరిశోధన సాగాలి
ఏది ఏమిటో ఎందుకో గ్రహించాకే పర్యవేక్షణతో తీర్పు ఏదో ఇచ్చేయాలి

అద్భుతాలను తిలకిస్తూనే ఆశ్చర్యాన్ని అవగాహనతో పసిగట్టాలి
నిర్మాణాల విధానాలనే గమనిస్తూ మహా మూలాన్ని గ్రహించాలి   || విశ్వంలో ||

ప్రకృతియే మన వైద్యశాల పరిశోధన చేస్తే రహస్యం మన చెంత
విశ్వమే మన వేద కళాశాల పరిశీలిస్తే మహా పరమార్థం మన వెంట

ప్రయాణిస్తూనే అన్నింటిని గ్రహించాలి అనంతమైన  ఆలోచనలతో ఎన్నో తెలుసుకోవాలి
కాలంతో సాగుతూనే ఆరోగ్యం చూసుకోవాలి ఆయుస్సుతోనే మన విజ్ఞానానికి పదును పెట్టాలి  || విశ్వంలో ||

Friday, August 19, 2016

విశ్వం నీలో ఉన్న మాట నీ మేధస్సుకు తెలిసేనా

విశ్వం నీలో ఉన్న మాట నీ మేధస్సుకు తెలిసేనా
జీవంలోనే విశ్వం ఉన్న మాట నీ ఆలోచనకు తెలిసేనా  || విశ్వం ||

విశ్వమే జీవమై ప్రకృతిలో పంచభూతాలను విశ్వ శక్తిగా నీ శ్వాసలో చేర్చేనా
శ్వాసలో జీవమే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రకృతిగా ప్రాణ వాయువునే స్వీకరించేనా

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాసతో హృదయంలో ప్రాణ వాయువు చేరి జీవించేనా
హృదయం పనిచేసే తీరును మేధస్సే గమనిస్తూ శరీర కణాల కార్యాలను గుర్తించేనా

శరీరంలోని ప్రతి అణువు కణాలను గమనించే స్థితి మేధస్సుకు స్పర్శగా తెలిసేనా
మేధస్సులోని స్పర్శ కణాలే మన అంతర్గత భావ శరీర రక్షణ కార్యాలను చూసేనా   || విశ్వం ||

శ్వాసే మనకు ఉత్తేజమై మేధస్సుకు హృదయానికి జీవమై శరీరాన్ని జీవింపజేయునా
శ్వాసే మనకు ఆరోగ్యమై మహా ప్రాణ వాయువై ఆహార శక్తిగా శరీరాన్ని జీవింపజేయునా

ఆహార స్థితియే ఆరోగ్య స్థితిగా మేధస్సులో ఆలోచన భావాలు ఉన్నంతవరకు జీవం ఉండును
జీర్ణ వ్యవస్థ ఆలోచన వ్యవస్థ ఉన్నంతవరకు ఆరోగ్యంతో శరీరం విశ్వ శక్తిగా జీవిస్తూనే ఉండును

మేధస్సుతో మన శరీర వ్యవస్థను ఓ గొప్ప గమనంతో మహా ఎరుకతో ఆరోగ్యాంగా చూసుకోవాలి
మన ఆలోచనల తీరులోనే సూర్యోదయ శక్తి ఉదయిస్తూ విశ్వ శక్తి ఉత్తేజమై జీవించును

ప్రకృతి గాలి సూర్య రశ్మి శుద్ధమైన నీరు వాతావరణ స్థితి శరీరానికి చాలా అవసరం
నిద్ర మంచి పోషక ఫల ఆహారం కార్య గమన ధ్యాస ధ్యాన ఉత్తేజం శ్వాసకు ముఖ్యం  || విశ్వం || 

Thursday, July 28, 2016

నా హృదయం ప్రతి క్షణం ఉదయిస్తూనే మేధస్సులో కిరణాలుగా స్పర్శను అందిస్తుంది

నా హృదయం ప్రతి క్షణం ఉదయిస్తూనే మేధస్సులో కిరణాలుగా స్పర్శలను అందిస్తుంది
కిరణాలతో ప్రతి కణం ఉత్తేజవంతమై మేధస్సులో విజ్ఞాన అన్వేషణను దివ్యంగా సాగిస్తుంది  || నా హృదయం ||

హృదయంలో ప్రతి స్పందన ప్రతిసారి పరిచయమై స్పర్శలనే కలిగిస్తుంది
ప్రతి క్షణం స్పందనలతో నా జీవానికి అంతర్భావ కార్యాలను నెరవేరుస్తుంది

మేధస్సులో విజ్ఞానాన్ని దేహంలో ఆరోగ్యాన్ని రూపంలో తేజాన్ని హృదయమే సరిచేస్తుంది
జీవంలో భావాన్ని ఆత్మలో తత్వాన్ని శ్వాసలో స్వభావాన్ని మేధస్సే లీనమై ఆలోచిస్తుంది   || నా హృదయం ||

ప్రతి సూర్యోదయం హృదయానికి మేధస్సుకు మహా దివ్యమైన ఆరోగ్య తత్వాన్నిస్తుంది
ప్రతి సూర్యాస్తమయం దేహానికి విశ్రాంతి మేధస్సుకు తాత్కాళిక నిద్రను సమర్పిస్తుంది

ప్రతి సూర్య కిరణం ప్రతి జీవికి ఉత్తేజం ఆరోగ్యంతో విజ్ఞాన కార్యాలపై గమనాన్ని కలిగిస్తుంది
ప్రతి సూర్య తేజం ప్రతి జీవికి భావ స్వభావాల తత్వాలతో మహా విచక్షణను తెలియజేస్తుంది  || నా హృదయం || 

Wednesday, July 20, 2016

భావనే నిలిచిపోయేనా రోగమే వదిలిపోయేనా

భావనే నిలిచిపోయేనా రోగమే వదిలిపోయేనా
కాలమే మార్గాన్ని చూపి ఆరోగ్యాన్నే అందించేనా  || భావనే ||

రోగంతో చెలగాటం నిరంతరం పోరాటం
ఆరోగ్యంతో సహవాసం నిత్యం సంక్షోభం

అవకాశమే జీవితం విజ్ఞానమే ప్రయత్నం
సమయమే ఔషధం సమయోచితమే వైద్యం  || భావనే ||

ప్రకృతిలో ఆరోగ్య ప్రాణం ఆనందకర జీవితం
జగతిలో వేదాంత విజ్ఞానం నయగార అనుభవం

నిరాశే లేకుండ కార్య సాధనలో దశబ్దాల సహనం
విజయమే తెలియని ధీక్షలో శతాబ్దాల సహచరం  || భావనే || 

Monday, July 11, 2016

శ్వాస పై ధ్యాస - ఇక ఏ ఆలోచన లేదు

శ్వాస పై ధ్యాస - ఇక ఏ ఆలోచన లేదు
శ్వాస పై ధ్యాసతో జీవితం మరింత కాలం
రోగాన్ని ఆరోగ్యాంగా మార్చుకునే అవకాశం
ఏకాగ్రతతో శ్వాసపై ధ్యాస పెడుతూ ఆలోచనలను తగ్గించడడం
ఆలోచనలేని మేధస్సు శ్వాసలో సుఖాసనమై ఆరోగ్యమై నిద్రిస్తుంది
అవయవాలలో ఉన్న ఒత్తిడి తగ్గి హృదయ శ్వాసలో రక్తం ప్రసరిస్తుంది
ధ్యాసతో శరీరానికి కావలసిన సుఖాంతరమైన మహా విశ్రాంతి లభిస్తుంది
శ్వాసతోనే అవయవాలకు ఓదార్పు శ్వాసతోనే ఊపిరికి సహనం
కదలికలో నెమ్మది ఆలోచనలో ఆరోగ్య భావన మేధస్సులో ఉత్సాహం
దీక్షతో సాధన కాలంతో అభ్యాసం పట్టుదలతో అధ్యాయం
ప్రతి రోజు ఒక మహా ప్రయత్నం ప్రతి రోగానికి మహా మార్గం
వైద్యం పొందుతూనే శ్వాసపై ధ్యాస పెట్టండి త్వరగా రోగాన్ని వదిలించండి
అంతిమ స్థాయిలో ఆఖరి స్థాయిలో శ్వాస ధ్యాస కంటే ఇప్పుడే ప్రయత్నించండి
నేటి శ్వాసపై ధ్యాస ఓ ఆరోగ్యం ఓ సామర్థ్యం ఓ ఏకాగ్రత ఓ విజ్ఞాన విజయం
సమయానికి ఆహారం విశ్రాంతి నిద్ర శ్వాసపై ధ్యాస సమపాలలో సద్వినియోగం
ఎప్పటికైనా మరువకుండా ఆలోచనలేని ప్రతి క్షణం గుర్తుగా ఆలోచిస్తూ సాధన చేయండి
శ్వాసపై ధ్యాస ఒక మొక్క వృక్షమైన తీరు స్వభావం తత్వం అంతా సూక్ష్మ పరిశీలనయే
శ్వాసపై ధ్యాస ఒక శాస్త్రీయమైన సూక్ష్మ స్వభావ విశ్వ తత్వపు సాధన  
ఖాళీ సమయమే శ్వాస పై ధ్యాస అదే జీవన ఆరోగ్య సూత్రం శాస్త్రీయం  

Wednesday, October 7, 2015

ఆరోగ్యమే మహా భాగ్యం

ఆరోగ్యమే మహా భాగ్యం
ఆరోగ్యమే ఐశ్వర్య యోగం
ఆరోగ్యమే ఆనంద శిఖరం
ఆరోగ్యమే మహా చైతన్యం
ఆరోగ్యమే విశ్వ విజ్ఞానం
ఆరోగ్యమే ప్రయత్న భావం
ఆరోగ్యమే లోక కల్యాణం
ఆరోగ్యమే మరో ప్రపంచం
ఆరోగ్యమే దైవ సత్యం
ఆరోగ్యమే దివ్య దర్శనం
ఆరోగ్యమే సర్వ శాంతం
ఆరోగ్యమే మహా ధ్యానం
ఆరోగ్యమే అందరి స్వప్నం
ఆరోగ్యమే దీర్ఘ కాలం
ఆరోగ్యమే పవిత్ర పరిశుద్ధం
ఆరోగ్యమే దివ్య క్షేత్రం
ఆరోగ్యమే మహా బంధం
ఆరోగ్యమే మహా ఖండం
ఆరోగ్యమే మహా మంత్రం
ఆరోగ్యమే మహా తంత్రం
ఆరోగ్యమే మహా యంత్రం
ఆరోగ్యమే నవ వసంతం
ఆరోగ్యమే అందరికి ఆహారం
ఆరోగ్యమే సూర్య తేజం
ఆరోగ్యమే సుదీర్ఘ ప్రయాణం
ఆరోగ్యమే మహా సైన్యం
ఆరోగ్యమే వీరుల ధైర్యం
ఆరోగ్యమే అన్నింటికీ మూలం  
ఆరోగ్యమే ప్రయోజన కార్యం
ఆరోగ్యమే శక్తి స్థూపం
ఆరోగ్యమే కాల చక్రం
ఆరోగ్యమే మహా బ్రంహాండం
ఆరోగ్యమే జన్మ రహస్యం
ఆరోగ్యమే ఆధార ధర్మం
ఆరోగ్యమే స్నేహ సహాయం
ఆరోగ్యమే పుష్ప సుగంధం
ఆరోగ్యమే ప్రకృతి సహజం
ఆరోగ్యమే దేహ వైద్యం
ఆరోగ్యమే ఉద్దేశ లక్ష్యం
ఆరోగ్యమే అక్షర జ్ఞానం
ఆరోగ్యమే వాస్తు వరం
ఆరోగ్యమే ఆకాశ తత్వం
ఆరోగ్యమే ఆలోచన అర్థం
ఆరోగ్యమే మహా రూపం
ఆరోగ్యమే ఎదుగుదల లక్షణం