Friday, August 19, 2016

విశ్వం నీలో ఉన్న మాట నీ మేధస్సుకు తెలిసేనా

విశ్వం నీలో ఉన్న మాట నీ మేధస్సుకు తెలిసేనా
జీవంలోనే విశ్వం ఉన్న మాట నీ ఆలోచనకు తెలిసేనా  || విశ్వం ||

విశ్వమే జీవమై ప్రకృతిలో పంచభూతాలను విశ్వ శక్తిగా నీ శ్వాసలో చేర్చేనా
శ్వాసలో జీవమే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రకృతిగా ప్రాణ వాయువునే స్వీకరించేనా

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాసతో హృదయంలో ప్రాణ వాయువు చేరి జీవించేనా
హృదయం పనిచేసే తీరును మేధస్సే గమనిస్తూ శరీర కణాల కార్యాలను గుర్తించేనా

శరీరంలోని ప్రతి అణువు కణాలను గమనించే స్థితి మేధస్సుకు స్పర్శగా తెలిసేనా
మేధస్సులోని స్పర్శ కణాలే మన అంతర్గత భావ శరీర రక్షణ కార్యాలను చూసేనా   || విశ్వం ||

శ్వాసే మనకు ఉత్తేజమై మేధస్సుకు హృదయానికి జీవమై శరీరాన్ని జీవింపజేయునా
శ్వాసే మనకు ఆరోగ్యమై మహా ప్రాణ వాయువై ఆహార శక్తిగా శరీరాన్ని జీవింపజేయునా

ఆహార స్థితియే ఆరోగ్య స్థితిగా మేధస్సులో ఆలోచన భావాలు ఉన్నంతవరకు జీవం ఉండును
జీర్ణ వ్యవస్థ ఆలోచన వ్యవస్థ ఉన్నంతవరకు ఆరోగ్యంతో శరీరం విశ్వ శక్తిగా జీవిస్తూనే ఉండును

మేధస్సుతో మన శరీర వ్యవస్థను ఓ గొప్ప గమనంతో మహా ఎరుకతో ఆరోగ్యాంగా చూసుకోవాలి
మన ఆలోచనల తీరులోనే సూర్యోదయ శక్తి ఉదయిస్తూ విశ్వ శక్తి ఉత్తేజమై జీవించును

ప్రకృతి గాలి సూర్య రశ్మి శుద్ధమైన నీరు వాతావరణ స్థితి శరీరానికి చాలా అవసరం
నిద్ర మంచి పోషక ఫల ఆహారం కార్య గమన ధ్యాస ధ్యాన ఉత్తేజం శ్వాసకు ముఖ్యం  || విశ్వం || 

No comments:

Post a Comment