Tuesday, August 2, 2016

దిక్కులతో చూపులే చెల్లా చెదురు చుక్కలతో చిక్కులే చిటపటలు

దిక్కులతో చూపులే చెల్లా చెదురు చుక్కలతో చిక్కులే చిటపటలు
ఎక్కడికి వెళ్ళినా చిత్రాలే విచిత్రాలు ఎక్కడ ఉన్నా చివాట్లే తప్పట్లు
ఏదేమైనా మదిలో మైమరిపించే కైపులే యదలో దాగిన ఓర ఇక్కట్లు  || దిక్కులతో ||

విషాదంతో సాగే దిక్కు ఎక్కడికి చేర్చునో చుక్కలుగా తెలియుటలేదే
అశాంతతో తోచే చిత్రం విచిత్రమై మైమరిపించే కైపుగా ఉంటుందేమో

చిక్కులెన్నో లెక్కలుగా దిక్కులకే తోచనట్లు చుక్కలన్నీ ఒకటిగా మారి కనిపించునే
చిత్రాలెన్నో రూపాలుగా నేత్రానికే కనబడనట్లు ఆకారాలన్నీ ఒకటై విచిత్రమయ్యేనే   || దిక్కులతో ||

అసత్యాన్ని చూపే దిక్కు రూపం లేని చిత్రంగా కలవరపడి పోయేనే
అధర్మాన్ని సూచించే కాలం చరిత్రకే లేని వేదంతంగా మారి పోయేనే

ఇబ్బందులతో సాగే జీవితం ఇక్కట్లుగా యదలోనే దుఃఖమైపోయెనే
ఒడిదుడుకులతో సాగే జీవనం చీవాట్లుగా మదిలోనే నిలిచిపోయేనే    || దిక్కులతో || 

No comments:

Post a Comment