Friday, August 5, 2016

మళ్ళీ మళ్ళీ ఇది రాని సమయం

మళ్ళీ మళ్ళీ ఇది రాని సమయం
మళ్ళీ మళ్ళీ ఇది రాని జీవితం
ఎవరికైనా ఒకటే బంధం ఎక్కడైనా ఒకే భావం  || మళ్ళీ మళ్ళీ ||

ఎదగాలన్నదే ప్రతి క్షణం సాగాలన్నదే సమయం
వెళ్ళాలన్నదే ఓ క్షణం చేరుకోవాలన్నదే ప్రయాణం

విజ్ఞానంతో సాగే ప్రయాణం దేశ విదేశాలకు వెళ్ళిపోయేనే
అనుభవంతో సాగే మార్గం అంతరిక్షాన్ని దాటి చేరిపోయేనే  || మళ్ళీ మళ్ళీ ||

నీవు సాధించే సమయం సాధనతో నేర్చుకోవాలన్నదే విజ్ఞానం
నీవు తెలిపే వేదాంతం జీవితంలో గుణ పాఠమైనదే అనుభవం

జీవం ఉన్నప్పుడే జీవితాన్ని సరిచేసుకోవడం
సమయం ఉన్నప్పుడే విజ్ఞానాన్ని అనుభవించడం  || మళ్ళీ మళ్ళీ || 

No comments:

Post a Comment