Tuesday, August 16, 2016

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియని నీ రూపం నాలో చిత్రమై ఉన్నది

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియని నీ రూపం నాలో చిత్రమై ఉన్నది
ఎప్పుడు వస్తావో ఎలా వస్తావో తెలుపని నీ సమయం నాలో అన్వేషణ ఐనది  || ఎక్కడ ||

ఎవరికి కనిపిస్తావో ఎవరికి వినిపిస్తావో నీలో నీవే ఉండిపోతావో తెలియుట లేదు
ఎవరిలో ఉన్నావో ఎందరిలో ఉన్నావో నీవే నిర్ణయించుకుంటావో తోచటం లేదు

మహా విజ్ఞానులు ఎందరున్నా నీవు ఉండే స్థానం మహా నిలయం
మహాత్ములు ఎక్కడ ఉన్నా నీవు తెలిపే వేదార్థం మహా విజ్ఞానం   || ఎక్కడ ||

కనిపించే నీ రూపం సూర్యోదయమై విశ్వానికి వెలుగునిస్తున్నది
వినిపించే నీ ప్రతి ధ్వని జీవోదయమై దేహానికి మహా ప్రాణమైనది

ఎవరిని తలిచినా నీ నామ ధ్యాన స్వరూపంలోనే మహత్యం దాగున్నది
ఎందరినో దర్శించినా నీ రూప దర్శనం కలగాలని నేత్రం తపిస్తున్నది || ఎక్కడ || 

No comments:

Post a Comment