Wednesday, August 31, 2016

కలే కన్నానని మెలకువ తెలిపేనే

కలే కన్నానని మెలకువ తెలిపేనే
నిజమే కాదని ఉదయంతో తోచేనే
ఎన్నెన్నో కలలు కంటూనే నిద్రిస్తున్నానులే
కలలన్నీ కలలుగానే మిగిలి పోతున్నాయిలే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్నదని మరో ఊహ కలగా సాగుతున్నదిలే
కలే జీవితమని ఊహలతోనే కాలం మరుపుతో సాగేనులే

కల నిజం కాదని తెలిసినా ఊహతో ప్రయత్నమే మొదలాయనే
కల సాధ్యం కాదని తెలిసినా ఓర్పుతో సాధన ఆరంభమయ్యేనే

కలను అందుకోవాలని మనస్సులో కోరిక పుట్టేనే
కలను జయించాలని మేధస్సులో ఆలోచన తట్టేనే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్న వేళ మదిలో సంతోషమే కలిగేనే
కలే నిజమౌతున్న వేళ యదలో ఆనందమే ఉప్పొంగేనే

అన్నీ కలలు తీరవు అన్నీ కలలు మనకు గుర్తుగా ఉండవు
అన్నీ కలలు మంచివి కావు అన్నీ కలలు ఒకటిగా ఉండవు

ఆలోచిస్తేనే భావంతో కల ఎటువంటిదో తెలిసేను  
ఊహతో నెమరువేస్తేనే కల ఏమని అర్థమయ్యేను  || కలే కన్నానని || 

No comments:

Post a Comment