Showing posts with label నేత్రానందం. Show all posts
Showing posts with label నేత్రానందం. Show all posts

Monday, February 6, 2017

ఆనందం ఆనందం ఏది ఈ జన్మకు మహా ఆనందం

ఆనందం ఆనందం ఏది ఈ జన్మకు మహా ఆనందం
ప్రతి జీవికి కలిగే శాశ్విత ఆనందమే మహా ఆనందం
దేహాంతర్భావాలలో కలిగే ఆత్మానందమే మహా ఆనందం అదే బ్రంహానందం  || ఆనందం ||

విశ్వ భావాలతో కలిగే సర్వానందమే నిత్యానందం
జగతి తత్వాలతో పొందే ఏకాంతానందమే దైవానందం

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో సాగే జీవానందమే జన్మానందం
మేధస్సుల ఆలోచనలతో చలించే కార్యానందమే భావానందం  || ఆనందం ||

అనంతమైన భావాలతో కలిగే వేదానందమే బ్రంహాండమైన ఆనందం
ప్రకృతి స్వభావాలతో జ్వలించే పరిశోధానందమే పర్యావరణ ఆనందం

విజ్ఞాన అన్వేషణ తపనతో తోచే ఆకాశానందమే ప్రజ్ఞాన ఆనందం
ప్రేమతో ఆదరించే స్నేహ జీవులతో సాగే జీవానందమే సర్వానందం
రూప స్వరూపాల ఆకారాల రూపకల్పన ప్రభావాల నిర్మాణందమే నేత్రానందం  || ఆనందం ||