Showing posts with label కష్టం. Show all posts
Showing posts with label కష్టం. Show all posts

Friday, December 23, 2016

ఏదో ఒక సమస్య మనలో కలిగే ఏదో ఒక అన్వేషణ మనలో వెలిగే

ఏదో ఒక సమస్య మనలో కలిగే ఏదో ఒక అన్వేషణ మనలో వెలిగే
సమస్యల పరిష్కారమునకై అన్వేషణయే మనలోనే మోదలాయనే

సమస్యలు లేకపోతే మేధస్సులో ఆలోచనలు తరిగిపోవునే
సమస్యలు తీరకపోతే మేధస్సులో మహా అజ్ఞానమే కలుగునే  || ఎదో ఒక సమస్య ||

సమస్యలు ఎన్నున్నా కొత్త సమస్యలు మరెన్నో మనలో కలిగే
సమస్యలు తీరకున్నా మరెన్నో సమస్యలు మనలోనే కలిగేనే

సమస్యలు ఎలాంటివైనా మనమే పరిష్కారించుకోవాలనే
సమస్యలు మన మిత్ర బంధమైనా పరిష్కారంతో తీర్చాలనే
సమస్యలు మనవి కాకున్నా అవసరానికై ఆలోచించాలనే

సమస్యలు మనలోనే ఉన్నప్పుడు తీరేందుకై మన తోటి వారిని అడగాలనే
సమస్యలు మనవే అనుకుంటూ మన వారికై పరిష్కారం మనమే చేయాలనే

సమస్యలతో మనస్సు చలించినా మేధస్సులో అన్వేషణ విజ్ఞాన పరిష్కారమే
సమస్యలతో లాభనష్టాలైనా సుఖః దుఃఖాలైన కాస్త కష్టంతో సాధించుకోవాలనే   || ఎదో ఒక సమస్య ||

సమస్యలు మనతో తీరకున్నా తీర్చేవారితో కాస్త పరిచయమై వివరిస్తూ పరిష్కారం కోరాలనే
సమస్యలు తీరేందుకు ఏంతో శ్రమించినా పరిష్కారం లేక ఉపయోగం కాస్తైనా లేకపోయేనే

సమస్యలు ఎవరివో ఎందుకు మనకు కలిగెనో ఆలోచనలతో మనస్సు కాస్త చెదిరి పోయేనే
సమస్యలు తరగాలనే ఎక్కడికో ప్రయాణించినా సరైన ఉపాయం లేక సమస్యగానే మిగిలెనే

సమాజంలో కలిగే సమస్యలు కాలంతో వచ్చే వివిధ మార్పులే
సమాజంలో కలిగే లేనిపోని సమస్యలతో కాలం వృధా చేయకే

జీవించడమే సమస్యల తరుణం జీవితమే సమస్యల వలయం
జీవనమే సమస్యల ప్రయాణం జీవులకే మహా సమస్యల చలనం          
ప్రతి కార్యం సమస్యల చదరంగం ప్రతి క్షణం సమస్యల ఆరంభం   || ఎదో ఒక సమస్య ||