Showing posts with label పదనిసలు. Show all posts
Showing posts with label పదనిసలు. Show all posts

Tuesday, September 13, 2016

ప్రేమతో పలికిన మనస్సుతో పిలిచిన వచ్చేస్తానే నేను నీకోసం

ప్రేమతో పలికిన మనస్సుతో పిలిచిన వచ్చేస్తానే నేను నీకోసం
భావంతో తలిచిన మౌనంతో తపించిన చేరేస్తానే నేను నీకోసం  || ప్రేమతో ||

హృదయంలోని గమనమే నీ ప్రేమ తలుపుల పదనిసలు
దేహంలోని మధుర గమకమే నీ తేనే పెదవుల సరిగమలు

ప్రకృతిలో విరిసిన పుష్పాలన్నీ సుమగంధమై నిన్నే చేరేనే
ఆకాశంలో కనిపించే వర్ణాలన్నీ సువర్ణమై నిన్నే ఆవరించేనే  || ప్రేమతో ||

సూర్యోదయం నీకోసమే ఉదయించేలా ప్రతి రోజు అనిపించేనే
శుభోదయం నీకోసమే స్మరించేలా ప్రతి నిమిషం అనుకున్నానే

ఎక్కడ వెళ్ళినా నీ హృదయ భావన నన్నే చేరేనులే
ఎక్కడ చూసినా నీ దేహ బంధం నన్నే తలచేనులే  || ప్రేమతో || 

Monday, August 8, 2016

పలికించవా నా భావన వినిపించవా నా కీర్తన

పలికించవా నా భావన వినిపించవా నా కీర్తన
సంగీతాల సరిగమలతో పదనిసలనే మెప్పించవా
నా జీవన వేదాన్ని స్వర రాగాల లోకాలకు పంపించవా  || పలికించవా ||

నాలోని విజ్ఞానం వినయమా నా అనుభవం అభినయమా
సర్వాంతరం సంగీత యోగమా నిరంతరం నిజతత్వమా

నా నవ జీవితం నవీనత్వమా నా నూతన జీవనం నందనమా
స్వర భాషలో భావం సంయోగమా శృతి ధ్యాసలో సర్వాంతరమా

అమృతాల పలుకులతో మాతృ భావాల సుగంధాలనే మెప్పించనా
మకరందాల పిలుపులతో మాతృ తత్వాల సవ్వడినే ఒడి చేర్చుకోనా  || పలికించవా ||

శృతిలయలో దాగే స్వర రాగ సంగీతాన్ని స్మరించగా తేనీయమే తెలిసిందిలే
ఒడిలయలో దాగే శ్వాస భావ సంతోషాన్ని స్పందించగా మాతృత్వమే తెలిసేనులే

వేదాల సరిగమలు పదనిసలుగా గజ్జెల మువ్వల సవ్వడితో మృదంగమా
సుస్వరాల పలుకుల చరణములు మాటల రాగాలతో వేదాంత స్వరగానమా

సంగీత జ్ఞానం స్వరాల విజ్ఞానం అనుభవానికి గమనమా
సంపూర్ణ గీతం సందేశ గాత్రం అనుబంధానికి తపనమా  || పలికించవా ||