Thursday, April 28, 2016

విశ్వ భావమై వచ్చాను ఈ జగతికి విశ్వ తత్వమై ఉన్నాను ఈ లోకానికి

విశ్వ భావమై వచ్చాను ఈ జగతికి విశ్వ తత్వమై ఉన్నాను ఈ లోకానికి
భావంతోనే ప్రయాణిస్తూ తత్వాన్నే దాచుకుంటూ జగతిలోనే జీవిస్తున్నాను
నీటియందు నేనే గగనమందు నేనే భూమిపైన నేనే గాలిలోన నేనే భావనగా
ఆకార రూపముల అణువు పరమాణువుల యందు నేనే దాగి ఉన్నాను
విశ్వాన్ని విడచి వెళ్ళలేను జగతిని మరచి ఉండలేనని ఇక్కడే కొలువుంటాను
శూన్యమందు ఆది భావమై ఉదయించానేమో అంతం లేని తత్వంతో సాగిపోతున్నాను
విశ్వ కాలం నన్నే పిలిచి జగతిని భావాలతో నడిపించేలా నన్నే అడిగి సాగింది
ప్రతి భావన ఓ కార్యమై కాలంతో సాగేలా జీవితాలు ఎన్నో సాగి పోవాలి
విశ్వ కాలంతో సాగే భావాలకై విశ్వ భావమై ఈ జగతి లోకానికి వచ్చానేమో
ఆత్మగా లేకున్నా కాలమై ఉంటానని ప్రతి అణువులో భావమై ఉదయిస్తున్నా
ఓ విశ్వ మానవా! విశ్వమున జీవిస్తూ నా విశ్వ భావనను గ్రహించు మిత్రమా! 

విశ్వమందు నీవు ఎచట ఉన్నా వీచే గాలితో వస్తున్నా

విశ్వమందు నీవు ఎచట ఉన్నా వీచే గాలితో వస్తున్నా
విశ్వమందు నీవు ఏం చేస్తున్నా కార్యమై కలుస్తున్నా
విశ్వమందు నీవు ఏది తలచిన భావమై కలుగుతున్నా
విశ్వమందు నీవు ఏం ఆలోచించినా విజ్ఞానమై ఉంటున్నా
విశ్వమందు నీవు లేకున్నా ఆత్మగా ఆకాశమై పోతున్నా
ఓ విశ్వ మానవా! విశ్వమున జీవిస్తూ నా విశ్వ భావనను గ్రహించు మిత్రమా! 

అరే ఏమైందీ..! ఒక మనిషికి ఈ క్షణమే భావన కలిగింది

అరే ఏమైందీ..! ఒక మనిషికి ఈ క్షణమే భావన కలిగింది
అరే ఏమైందీ..! ఒక మనిషికి ఈనాడే హృదయం వెలిసింది || అరే ఏమైందీ..! ||

మనిషిగానే జన్మించావని హృదయ భావన నీలో వెలిసింది
మనిషిగానే జీవిస్తున్నావని సమయ స్పూర్తి నీలో కలిగింది

హృదయంలోనే దాచుకున్న ప్రేమలో ఎన్ని భాదలు దాగున్నాయో
ప్రతి హృదయంలో ఎన్ని భావాలు బాధలుగానే మిగిలి పోయాయో

సూర్యుడిలా ఉదయించే నీకు సంధ్య వేళ ప్రేమ భావం ఎందుకో
ఆకాశంలా కనిపించే నీకు ప్రతి రాత్రి వేళ చీకటి రూపం ఎందుకో || అరే ఏమైందీ..! ||

హృదయంలో దాగిన రూపం మేధస్సులోనే జీవించే స్వప్నం
ఆలోచనలో ఎదిగిన భావం హృదయంలోనే నిలిచేను ఆకారం

మనస్సులోన మిగిలిన మాట స్వరములోనే మౌనమాయే
మేధస్సులోన కలిగిన భావం ఆలోచనలోనే ఉండిపోయే

అర్థాన్ని గ్రహించే విజ్ఞానం పరమార్ధంతో పరమాత్మలోనే నిలిచేనే
భావాన్ని తెలిపే వేదం స్వభావంతోనే విశ్వ జగతిలోన నిలిచేనే || అరే ఏమైందీ..! ||

మరణించగా ఆకాశమందు అమరుడనై ఆత్మగా జగతిని తిలకిస్తున్నా

మరణించగా ఆకాశమందు అమరుడనై ఆత్మగా జగతిని తిలకిస్తున్నా
ఆకాశమున కలిగే సూర్య భావ మేఘ రూప వర్ణ భావాలను గ్రహిస్తున్నా
ఆకాశమున తోచే విశ్వ భావ తత్వాలను ఆత్మ మేధస్సులో దాచేస్తున్నా
విశ్వ భావాలతో విశ్వాత్మనై స్థిరస్తాయిగా ఆకాశాన అమరుడిగా నిలుస్తున్నా
ఆకాశము నుండే జగతిలో దాగిన ప్రతి అణువు పరమాణువును చూస్తున్నా
అంతరిక్షము నుండి పాతాళము వరకు ప్రతి విశ్వ భావన నా మేధస్సులోనే
విశ్వ భావాలు కలవారు ఆత్మగా అమరుడై జగతిలోనే స్థిర కాలం జీవిస్తారు
ఓ విశ్వ మానవా! విశ్వమున జీవిస్తూ నా విశ్వ భావనను గ్రహించు మిత్రమా! 

మానవ రూపం ఒక విచక్షణ భావ అవతారం

మానవ రూపం ఒక విచక్షణ భావ అవతారం
మానవుడే మాధవ రూప తాండవ ఆకారం
మానవుని విజ్ఞానం అంతర్భావపు స్వార్థం
మానవుడు మహాత్ముడైన ఎదిగిన కాలం కఠినం
మానవుడు జీవించే విధానం ఓ భావ స్వభావం
మానవ భావ స్వభావాలు నేడు విచిత్ర ఆచరణం
మానవుని లక్షణం అంతర్ముఖ ఆత్మ అంతర్లీనం
ఓ విశ్వ మానవా! విశ్వమున జీవిస్తూ నా విశ్వ భావనను గ్రహించు మిత్రమా! 

ఆకలితో జీవిస్తున్నావా మేధస్సుతో జీవిస్తున్నావా

ఆకలితో జీవిస్తున్నావా మేధస్సుతో జీవిస్తున్నావా
ఆకలితో ఉన్నప్పుడే ఆహార భావాలను వెతికెదవా
ఆలోచనలు కలిగినప్పుడే భావార్థాన్ని గ్రహించెదవా
ఆలోచనలు కలగాలంటే మేధస్సుకు శక్తి కావాలి
మేధస్సు జీవించేందుకు దేహానికి ఆహారం కావాలి
ఆహారం ఆలోచనలతోనే ప్రతి జీవి జీవితాన్ని సాగించాలి
ఆకలి తీరిన తర్వాతనే ఎన్నో కార్యాలను చేసుకోవాలి
ప్రతి కార్యం విజ్ఞానంగా సాగేందుకే భావార్థం కావాలి
ఓ విశ్వ మానవా! విశ్వమున జీవిస్తూ నా విశ్వ భావనను గ్రహించు మిత్రమా! 

Wednesday, April 27, 2016

విశ్వమందే అన్వేషించి నీవు పొందిన విజ్ఞానాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేయుము

విశ్వమందే అన్వేషించి నీవు పొందిన విజ్ఞానాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేయుము
విశ్వ కాలమే నీకు తోడుగా నిలిచి నీ విజ్ఞాన ప్రాముఖ్యతను ప్రపంచమే తెలియజేయును
నీ విశ్వ విజ్ఞానము విశ్వ భావాలుగా విశ్వమంతా వ్యాపిస్తూ ఎన్నో మేధస్సులలో చేరును
నీ విజ్ఞానము ఓ దివ్యమైన అఖండ జ్ఞానముగా విశ్వ చరిత్రలో స్థిరస్తాయిగా నిలుచును
విశ్వమున జీవించు మానవా! భావంతో గ్రహించు మిత్రమా! 

విశ్వమంతా నీ రూపాన్ని సూర్యుడిలా చూసే సమయం ఏనాటికో

విశ్వమంతా నీ రూపాన్ని సూర్యుడిలా చూసే సమయం ఏనాటికో
నీలో దాగిన విశ్వ విజ్ఞాన భావాలను ఎలా అందరికి తెలిపెదవో
అనంతమైన అపురూపమైన విశ్వ భావాలను ఎలా ఆలోచిస్తున్నావో
విశ్వానికే మైమరిపించేలా మధుర భావనలు నీ మేధస్సులో ఎలా దాగున్నాయో
అద్భతమైన ఆశ్చర్యపు ఇంద్రియాల సూక్ష్మ కదలికల భావాలు ఎన్నున్నాయో
క్షణ క్షణాలకు కలిగే భావాలను మేధస్సులోనే దాచుకుంటూ ఎలా వివరిస్తున్నావో
ప్రతి సంఘటనను భావనగా తలచి విజ్ఞాన ఆలోచనగా అర్థమయ్యేలా ఎలా మలచెదవో
జీవిత కాలమంతా విశ్వ విజ్ఞాన భావాలతోనే జీవిస్తూ సూర్యుడిలా నీవే ప్రకాశిస్తున్నావు
నీవే సూర్యుడివై ఎందరికో స్పూర్తివై ప్రతి జీవి మేధస్సులో ఆలోచనగా ఉదయిస్తున్నావు
నీలో దాగిన సూర్య తేజ భావనలే ప్రతి జీవి మేధస్సుకు ఉత్తేజమై జీవన కార్యాలు సాగుతున్నాయి
సూర్యుడిలా ప్రపంచమంతా నీ విశ్వ రూపాన్ని భావాలతో దర్శిస్తూనే జీవిస్తున్నారు 

తెలిసిన విజ్ఞానాన్ని దాచుకున్నా అది రహస్యం కాదే

తెలిసిన విజ్ఞానాన్ని దాచుకున్నా అది రహస్యం కాదే
తెలియని విజ్ఞానాన్ని తెలుసుకున్నా అనుభవం కాదే
నీకు నీవుగా స్థాపించుకున్నది మహా సామ్రాజ్యం కాదే
నీవు ఒక్కడివే అన్వేషించి కనిపెట్టినది అద్భుతం కాదే
తెలిసిన విజ్ఞానాన్ని పంచుకుంటూ అనుభవంతో జీవిస్తేనే విజయం
విశ్వమున జీవించు మానవా! భావంతో గ్రహించు మిత్రమా! 

పొతే పోనీ లేరా నా జీవితం ఇంతే లేరా

పొతే పోనీ లేరా నా జీవితం ఇంతే లేరా
వస్తే రానీ లేరా నా జీవితం ఎంతో లేరా
పోయింది ఏదైనా ఇతరులకు మేలేరా
వచ్చింది ఏమైనా మనకు కాస్త గొప్పేరా

హృదయంలో హృదయమై జీవించే ప్రేమ మాతృదేవోభవ

హృదయంలో హృదయమై జీవించే ప్రేమ మాతృదేవోభవ
హృదయంతో హృదయాన్ని సృష్టించేది అమ్మ ప్రేమేయే
హృదయ భావనతో హృదయాన్ని రక్షించేది అమ్మయే
హృదయానికి ఎన్ని గాయాలైనా మన హృదయానికి అమ్మ రక్షణే
హృదయానికి జీవం పోసి శ్వాసను సృష్టించి అందించేది అమ్మయే
హృదయానికి జీవం పోసే మహా దైవ స్వరూపమే మాతృదేవోభవ
తన హృదయం ఉన్నంత వరకు మన హృదయాన్ని దాచుకునేది అమ్మయే
మన హృదయం ఎక్కడున్నా తన హృదయంలో మన జీవ శ్వాస ఆడుతుంటుంది
మన హృదయం ఉన్నంత వరకు తల్లి హృదయాన్ని చూసుకునే బాధ్యత మనదే

Tuesday, April 26, 2016

మేధస్సులో కణాలన్నీ మేధస్సులుగా ఆలోచిస్తే విజ్ఞానం విశ్వ బ్రంహాండమే

మేధస్సులో కణాలన్నీ మేధస్సులుగా ఆలోచిస్తే విజ్ఞానం విశ్వ బ్రంహాండమే
మేధస్సు ఓ పర్వత విజ్ఞాన మహా గ్రంధమైతే మేధస్సులు విశ్వ పర్వతాలే
మేధస్సులో ఎంత ధారణ శక్తి ఉంటే అంతటి గ్రహించే శక్తి ఏకాగ్రతమౌతుంది
మేధస్సు ఓ విశ్వ విజ్ఞాన ఊటగా ఊరెడు జ్ఞానాన్ని గ్రహిస్తూనే ఉంటుంది
మేధస్సు నిత్యం నిరంతరం ఓ మహా భావాన్ని సూక్ష్మ క్షణాలలో గ్రహిస్తుంటుంది
మేధస్సు పంచ భూతాల విశ్వ తత్వాల జీవ భావాల విజ్ఞాన విచక్షణ ఊరేడుయే 

ఆత్మగా వచ్చి రూపమై నిలిచి బహు రూపాలతో ఎదుగుతున్నా

ఆత్మగా వచ్చి రూపమై నిలిచి బహు రూపాలతో ఎదుగుతున్నా  
పరమాత్మగా తలచి పరమావధియేనని కొలచేలా నే నిలుస్తున్నా
జీవమై జన్మించి రూపమై ఎదిగి నిర్జీవమై ప్రతి జీవిలో మరణిస్తున్నా
ఆకారమై ఆకాశమంత విస్తరించి సూర్యుడిలా మీలో ప్రకాశిస్తున్నా

మనిషే వేదమని నీ మేధస్సు నీకు ఏనాడైనా తెలిపేనా

మనిషే వేదమని నీ మేధస్సు నీకు ఏనాడైనా తెలిపేనా
మేధస్సే మహా విశ్వమని నీలోని జ్ఞానము నీకు తెలిపేనా
జీవిస్తున్న కాలమంతా అనుభవ విజ్ఞానమేనని తెలిసేనా
జీవించే కాలం నీ జీవితానికి తెలిసే విశ్వ వేదమని తెలిసేనా
మేధస్సులో దాగే విశ్వ వేదమే నీ జీవితమని నేడు తెలిసేనా 

నా లోకం ఎక్కడున్నదో విశ్వ మేధస్సులో దాగిన భావనాలోచనా

నా లోకం ఎక్కడున్నదో విశ్వ మేధస్సులో దాగిన భావనాలోచనా
భావాలతో సాగే ఆలోచనలే నా లోకమని విశ్వ మేధస్సే తెలిపేనా
కాలమే తెలిపే విశ్వ భావాలతో నేనే ఆలోచననై సాగిపోతున్నానా
జీవిత కాలమంతా మేధస్సులోనే విశ్వ భావాలతో సాగుతున్నానా
నా మేధస్సే విశ్వమై నాలో నిలయమై భావాలోచనలతో సాగేదనా

నా జీవితం నేను అనుకున్న విధంగా సాగటం లేదు

నా జీవితం నేను అనుకున్న విధంగా సాగటం లేదు
నా జీవితాన్ని విశ్వ కాలమే నాకు తోడై సాగుతున్నదా
కష్టమైనా నష్టమైనా దుఃఖమైనా కాలమేనని భావిస్తున్నా
లోపమైనా రోగమైనా దురదృష్టమైనా కాలమే నేస్తమైనదా
ఏదీ లేని నా జీవితానికి మరణమే విశ్వ భావమై ముగియనున్నదా 

Monday, April 25, 2016

ఇచ్చినది తిరిగి రాదు పోయినది మరల రాదు

ఇచ్చినది తిరిగి రాదు పోయినది మరల రాదు
ఇచ్చినప్పుడే పోయిందని మరల తిరిగి రాదు
ఇచ్చినప్పుడు జ్ఞానం ఉన్నా అనుభవం లేదు
తిరిగి రానప్పుడు అనుభవం ఉన్నా సుఖం లేదు
పోయినప్పుడు మెలకువ ఉన్నా మనస్సు లేదు
తిరిగి రానిది ఏదైనా పోయినప్పుడు శ్వాస లేదు
జాగ్రత్తగా అన్నీ ఉంటే నీకు మరుపు లేనే లేదు

మరణించేంత వరకే నీవు జీవించ గలవు

మరణించేంత వరకే నీవు జీవించ గలవు
శ్వాస ఉన్నంత వరకే నీవు ఉండగలవు
ధ్యాస ఉన్నంత వరకే నీవు ఆలోచించ గలవు
విజ్ఞానము ఉన్నంత వరకే నీవు ఎదగ గలవు
త్యాగము ఉన్నంత వరకే నీవు నిలువ గలవు
జీవము ఉన్నంత వరకే నీవు విహారించ గలవు 

మళ్ళీ మళ్ళీ రాని భావన మళ్ళీ మళ్ళీ రాని ఆలోచన

మళ్ళీ మళ్ళీ రాని భావన మళ్ళీ మళ్ళీ రాని ఆలోచన
మళ్ళీ కలగాలని మళ్ళీ తోచాలని మళ్ళీ చూడాలని
మనలో కలిగే భావం మనలో దాగిన ఆలోచన నేడు వచ్చేనే || మళ్ళీ మళ్ళీ ||

మనస్సు మెచ్చిన భావనే మళ్ళీ కలగాలని మన ఆలోచన
హృదయం తలచిన ఆలోచనే మళ్ళీ రావాలని మన భావన

వసంతాలతో వచ్చే ఋతువులు వందనాలు పలికే పక్షులు
వచ్చి పోయే కాల భావ ఆలోచనలు వాతావరణ ప్రభావాలే  || మళ్ళీ మళ్ళీ ||

కాలంతో సాగే జీవరాసులు ఎన్నో ప్రతి క్షణం ఎదిగే జీవులు ఎన్నో
జనన మరణ ప్రమాణాలు ఎన్నో ప్రతి సమయం కారణాలు ఎన్నో

ఎవరు ఎవరిని మళ్ళీ చూసేదెవరో మళ్ళీ మళ్ళీ కలిసేదెవరో
ఎవరు ఎవరిని మళ్ళీ తలచేదెవరో మళ్ళీ మళ్ళీ కలిపేదెవరో  || మళ్ళీ మళ్ళీ || 

మనస్సు అజ్ఞానమైతే మేధస్సు అజ్ఞానమగును

మనస్సు అజ్ఞానమైతే మేధస్సు అజ్ఞానమగును
మేధస్సు అజ్ఞానమైతే మనస్సు అజ్ఞానమగును
అధికారము అజ్ఞానమైతే వ్యవస్థ అజ్ఞానమగును
వ్యవస్థ అజ్ఞానమైతే అధికారము అజ్ఞానమగును
అజ్ఞానముతో మానవులు ఎందరో అజ్ఞానమగును
ఒకరి అజ్ఞాన అనుభవముతో మరెందరో అజ్ఞానమగును
అజ్ఞానము వలన ప్రపంచ సమాజమంతా అజ్ఞానమగును
ప్రపంచ అజ్ఞానముతో ప్రతి ఒక్కరు అజ్ఞానమగును
నేటి మానవులతో రేపటి జీవితమంతా అజ్ఞానమగును
విజ్ఞానములో కూడా స్వార్థపు అజ్ఞానమును ఇమిడ్చెదరు
స్వచ్ఛమైన విజ్ఞానమునకై అరణ్య పర్వత ఏకాంత ధ్యానమే సరియగును
ఎంత విజ్ఞానముగా జీవించినను అజ్ఞానము గలవారు మనకు ముప్పు కలిగించేరు
జాగ్రత్తగా ఉన్నను అజాగ్రత్త కలుగుటకు మరుపు కలిగేలా కాలమే నిర్ణయించేను
ఎంత ఏకాగ్రతతో ఉన్నను మాటల కాలంతో ఇంద్రియ దృష్టితో మరుపు కలిగేను
తోటి వారికి సహాయపడక పోయినా మీ నుండి ముప్పు వాటిల్ల కుండా చూసుకోండి
చదవడం వల్ల మీకు తెలిస్తే మీకు మరుపు - అనుభవ విజ్ఞానము ద్వారా తెలిస్తే అది ఆచరణ 

ఏ హృదయానికి భాష లేదురా మేధస్సుకు మాట లేదురా

ఏ హృదయానికి భాష లేదురా మేధస్సుకు మాట లేదురా
భావనగా ఆలోచనకు తోచిన అర్థమే స్వరము పలికేనురా
జీవత్వములో దాగిన అజ్ఞాన విజ్ఞానములే నోటి మాటలేరా
ఎదిగిన అనుభవమే భావాలుగా మేధస్సులో ఆలోచనలురా
మాటలతో అతిశయోక్తిగా పొగడుతూ మనస్సునే తృంచకురా
ఉన్నది ఉన్నట్లుగా తెలిసిన యదార్థమునే నీవు తెలుపురా
భాషలేని హృదయానికి భావముతో కూడిన శ్వాస ఉన్నదిరా
శ్వాస ఉన్నంత వరకే హృదయానికి అమూల్యమైన విలువరా
హృదయమే అమృతమైన అమ్మగా ప్రతి జీవిలో జీవిస్తున్నదిరా 

Friday, April 22, 2016

ఏమి చెప్పేను మేధస్సు ఏమి తెలిపేను ఆలోచన

ఏమి చెప్పేను మేధస్సు ఏమి తెలిపేను ఆలోచన
ఏది గ్రహించెను నీ భావన ఏది తెలిసేను నీకు అర్థం
మనస్సు తెలిపే భావాలోచనకు మేధస్సు మెచ్చేనా
మేధస్సు తీసుకునే నిర్ణయం జ్ఞానమేనని మనస్సు మెచ్చేనా 

నిద్రించుటలో విశ్వాసన వేయగా మహా భావ విశ్రాంతి కలుగును

నిద్రించుటలో విశ్వాసన వేయగా మహా భావ విశ్రాంతి కలుగును
విశ్వాసన అనగా విశ్వ భావనతో కూడిన సుఖ శ్వాస ఆసనయే
విశ్వ ఆసనలో శరీర స్థితి రీతి గొప్పగా ఆదరించు లక్షణ విధానమే
దేవాతా మూర్తులు ఉండగలిగే విశ్వ భావ ధ్యాన స్థితి విధానమే ఇది
విశ్వాసనతో నిద్రించుట లేదా ధ్యానించుట మహా గౌరవ లక్షణము
విశ్వాసనతో నిద్రించే వారు విశ్వ కాలంలో పొందే ఒక గడియ విశ్వానుభూతి
విశ్వానుభూతి కలుగుటలో మానవులు మహానుభావులుగా మారవచ్చు
నేడు తపించే ధ్యానం విశ్వానుభూతితో కూడిన మహా విజ్ఞాన సాధన
దేహాన్ని తన్మయం చేయుటకు కలిగే అరుదైన అవకాశమే విశ్వాసన
ఇంద్రియ నిగ్రహణతో పాటు దేహ కుండలిని శక్తి పొందే చక్రధార సప్త స్థితి
కుండలిని శక్తితో సప్త చక్రములు ఏక కేంద్రమై దేహపు ఆరాన్ని ఆవిర్భవించును 

కవిగా తెలియని ఒక మహా విశ్వ భావన

కవిగా తెలియని ఒక మహా విశ్వ భావన
కవితగా మేధస్సులో సాగించేనే అన్వేషణ
విశ్వ కాల ప్రయాణంతో సాగిన శ్వాస ధ్యాస
విశ్వ శ్వాసలో నా ధ్యాస ధ్యానమై చేరిపోయేనే
ధ్యానమున కలిగే అపురూప విశ్వ భావాలెన్నో
నా దివ్య మేధస్సులోనే నిక్షిప్తమై దాగిపోయేనే
కవిగా తెలియని విశ్వ అణువుల జీవ భావాలెన్నో
ధ్యానిగా విజ్ఞానముచే నా మేధస్సులో తెలిసేనే 

హృదయము లేని జీవితం యదలో దాగిన యదార్థ కథనమే

హృదయము లేని జీవితం యదలో దాగిన యదార్థ కథనమే
సుఖ సంతోషాలు లేని జీవిత కాలమే హృదయ జీవన ఘోష
కష్టాలతో సాగిన కాలం నష్టాలతో దాగిన హృదయ కాలేయమే
శ్వాసకైనా సంకోచం లేని రోగ దేహముతో సాగేనే కర్మణ జీవితం 

Thursday, April 21, 2016

ఈ మేధస్సులో కలిగే భావాలు ఎలాంటివో విశ్వానికే తెలియని ఎన్నో అభిరుచులు

ఈ మేధస్సులో కలిగే భావాలు ఎలాంటివో విశ్వానికే తెలియని ఎన్నో అభిరుచులు
ఈ ఆలోచనలలో కలిగే అర్థాలు జీవుల భావాలలో దాగిన అజ్ఞాన విజ్ఞాన లక్షణాలు
అజ్ఞాన విజ్ఞానంతో ఎదిగే జీవులలోని విచక్షణ జ్ఞానేంద్రియాలే మన అడుగు జాడలు
ఎదిగే కొద్ది దేనిపై ధ్యాస దీర్ఘ కాలంగా సాగుతుందో అవే మన విజ్ఞాన సోపానాలు
అజ్ఞాన భావాలను వెంటనే ఖండిస్తూ విజ్ఞాన భావాలతో ఎదిగినవే మన ఆనవాలు

విశ్వాన్ని నడిపించే విజ్ఞానం కాలానికే తెలియాలి

విశ్వాన్ని నడిపించే విజ్ఞానం కాలానికే తెలియాలి
తరతర తరాలుగా యుగ యుగాలుగా విజ్ఞానం సాగుతున్నది
జీవములు ఎన్నున్నా ఎన్నెన్నో వస్తున్నా కొత్త దనం వస్తున్నది
ప్రయోగమా పరిశోధనమా పర్యవేక్షణలో నూతన విజ్ఞానమే దాగున్నది
రూపాలు ఎన్నున్నా నవ రూపాలెన్నో కాలంతో సాగుతున్నాయి
విశాలమైన విశ్వమే అనంతమైన విజ్ఞానంగా మారుతున్నది
విశాలమైన ప్రదేశం లేకున్నచో జీవుల తర తరాలు అంతరించేనులే
జీవులే లేకున్నచో విజ్ఞానం అనంతమై సాగుట కష్టతరమేలే
విశ్వ నిర్మాణం ముందస్తు భవిష్య ప్రణాళికతో ఏర్పడినదని తెలియునులే
కొన్ని వేల లక్షల యుగాలుగా సాగేల విశ్వ నిర్మాణం ఏర్పడినదిలే
పునః నిర్మాణమునకై ప్రళయాలు కూడా ఎప్పటికైనా సంభవించేనులే
మేధస్సులలో అన్వేషణ ఉన్నంత కాలం విజ్ఞాన కొరత ఉండదులే 

విశ్వానికే తెలియని విజ్ఞానం నీలో ఉన్నదా

విశ్వానికే తెలియని విజ్ఞానం నీలో ఉన్నదా
ప్రపంచానికే తెలియని ఆలోచన నీలో ఉంటుందా
మేధస్సుకే తెలియని భావన నీలో దాగున్నదా
శ్వాసకే తెలియని సంకోచత్వం నీలోనే ఉంటున్నదా  
చలనములోనే భావాలోచన విజ్ఞానం దాగి ఉన్నదా 

అన్వేషిస్తే మేధస్సులో తెలియనివి ఎన్నో ఉంటాయి

అన్వేషిస్తే మేధస్సులో తెలియనివి ఎన్నో ఉంటాయి
అన్వేషిస్తే అన్వేషణలో మేధస్సుకే ఎన్నో తెలుస్తాయి
విశ్వ కాలంతో సాగే అన్వేషణలో మేధస్సులే ఊటల విజ్ఞానము
మేధస్సుల ఊటలలోనే అనేకమైన అనంత విజ్ఞానము ఉన్నది
విశ్వ నిర్మాణములలో ఎన్నెన్నో విజ్ఞాన ఆలోచనలు ఉన్నాయి
కాలంతో సాగే మార్పులలో ఎన్నెన్నో కొత్త విషయాలు వస్తున్నాయి
ఏ మేధస్సుకు ఏ విజ్ఞానం కలుగుతుందో అన్వేషణలోనే ఉన్నది
అన్వేషణను సాగించు నీలోని విజ్ఞానాన్ని విశ్వానికి తెలియపరచు
భావనగా తెలిసినది ఆలోచనగా తెలిసేలా అర్థంతో అన్వేషించు
అర్థాన్ని విజ్ఞానంగా మార్చుకుంటూ పరమార్థాన్ని విశ్వసించు
మేధస్సును విశ్వంలో కలిగే సమస్యలతో ఏకీభవిస్తూ అన్వేషించు
అన్వేషణలో విశ్వమే ఒక బ్రంహాండ విజ్ఞానమై నీ మేధస్సులో చేరును 

ఒక విశ్వము నాతో నడిపిస్తున్నది

ఒక విశ్వము నాతో నడిపిస్తున్నది
కాలంతో సాగేలా నన్నే తలచినది
విశ్వ కాల ప్రయాణంలో నన్నే సాగిస్తున్నది
ఏనాటి వరకో భావాలతోనే కొనసాగిస్తున్నది
భావాలను తెలుసుకుంటూనే ప్రయాణిస్తున్నాను
కొత్త కొత్త భావాలతో విశ్వ జీవమై జీవిస్తున్నాను 

Wednesday, April 20, 2016

కాలమా సాగిపో దైవమా మిగిలిపో

కాలమా సాగిపో దైవమా మిగిలిపో
జీవమా నిలిచిపో ప్రాణమా ఉండిపో
ప్రేమా కలిసిపో బంధమా కరిగిపో
హృదయమా చలించిపో భావమా కదిలిపో

సూర్యుడినై వచ్చాను సూర్యోదయం అయ్యాను

సూర్యుడినై వచ్చాను సూర్యోదయం అయ్యాను
ఉజ్వల భవిష్యత్ కై ప్రజ్వలమై ప్రకాశిస్తున్నాను
ఉత్తేజముకై మేధస్సులలో సూర్య కిరణమైనాను
విజ్ఞాన ఆలోచనకై ఆకాశమంతా వెలుగుతున్నాను
కార్య కలాపాలకై సూర్యాస్తం వరకు జ్వలిస్తున్నాను
ప్రతి జీవికి విశ్వానికి ప్రతి అణువుకు చలనమైనాను
సూర్యుడిగా విశ్వానికి కాలమై నిత్యం సాగుతున్నాను
ప్రకృతిలో ప్రతి సహజ భావనతో నేనే ప్రభావమైనాను

అన్వేషణలో సాగే ఆలోచన ఏ మైనదో

అన్వేషణలో సాగే ఆలోచన ఏ మైనదో
ఆలోచనతో హఠాతుగా ఆగి పోయినదా
మేధస్సులో కలిగే భావనకు భయం వేసినదా
ఇష్టం లేని ఆలోచన ఆలోచించుటలో ఆగినదా
కొత్త భావాలకై ఆలోచించుటలో ఆసక్తి కలిగినదా
అన్వేషణలో కలిగే అనర్థాలతో ఆలోచన ఆగినదా
కష్ట నష్టాలతో సాగే అన్వేషణలో ఆరోగ్యం నశించినదా
దీర్ఘ కాలంతో సాగే అన్వేషణలో విజయం లేకున్నదా
అన్వేషణలో సాగే ఆలోచనతో మరణం సంభవించినదా 

Tuesday, April 19, 2016

విశ్వంలోని అద్భుతాలన్నీ నా భావాలతో నిండి ఉన్నాయి

విశ్వంలోని అద్భుతాలన్నీ నా భావాలతో నిండి ఉన్నాయి
ప్రతి అణువులో పొందికనై తటస్థంగా ఒదిగి ఉంటున్నాను
పారేటి జలపాతాలు ఎత్తైన పర్వతాలు నా భావ శిఖరాలే
ప్రతి అణువులో పరమాణువునై పరమాత్మగా నిలిచానే
ఆశ్చర్యమైనా అద్భుతానికి నా భావన ఒక విచక్షణయే  
ఏ నిర్మాణం ఎక్కడ ఎలా ఉంటుందో నా భావానికే ఎరుక
విశ్వ నిర్మాణం నాలోని భావాల అణువుల సముదాయమే
ఎవరికి తెలియని అద్భుతాలు ప్రదేశాలు నాలో నిక్షిప్తమే
సూర్య కాంతిలో దాగిన ప్రతి కిరణం నాలో ఒక స్వర్ణ భావమే
ఈ విశ్వ నిర్మాణం ఓ మర్మ రహస్యమై నాలో దాగున్నది
శూన్యము నుండి నేటి వరకు పంచ భూతాలుగా ఉన్నాను
అంతరిక్షములో గ్రహ స్థితులు నా భావాల నిర్మాణ చలనమే
విశ్వం ఒక మహా బ్రంహాండమై నా మేధస్సులో భావమైనది
ఖనిజములో కరుణ తేజమునై తరతరాల సంపదనై సాగుతున్నాను
కాలముగా సమయ స్పూర్తినై విశ్వ ప్రయాణం చేస్తున్నాను 

నాలో నీ శ్వాసే నీలో నా ధ్యాసే ఇక నీవు నేను మరో జన్మలోనే

నాలో నీ శ్వాసే నీలో నా ధ్యాసే ఇక నీవు నేను మరో జన్మలోనే
వినిపిస్తున్నది నీలోని స్వరమే కనిపిస్తున్నది నాలోని రాగమే
మోహంతో సాగే జీవితం మరణిస్తున్నది జన్మనే చాలిస్తున్నది || నాలో నీ శ్వాసే ||

దేహంలో దైవము దహించిపోయినది శరీరములో శ్వాసకు సందేహమైనది
మేధస్సులో భావన నిలిచిపోతున్నది జీవంలో ఆత్మ శూన్యమైపోతున్నది

ఆలోచనగా లేని రూపం కళ్ళకు తెలియకున్నది
ఊహాగా లేని స్వప్నం మేధస్సుకు కనుమరుగైనది

నాలో ఉన్న నీ వెలుగు ప్రతి క్షణం చీకటై పోతున్నది
నీలో ఉన్న నా కాంతి ప్రతి నిమిషం కనిపించకున్నది || నాలో నీ శ్వాసే ||

నాలో తెలియని అన్వేషణ ఎందుకు మొదలైనదో
అన్వేషణలో సాగే ఆలోచన తెలియకనే ఏమైనదో

జీవించాలని ఉన్నా జీర్ణించుకోలేని జీవం వెళ్లి పోతానన్నది
ఉండాలని ఉన్నా ఆలోచించుకోలేని మేధస్సు ఆగి పోతానన్నది

హృదయములో చలనానికి ఏ భావన లేదన్నది
శరీరములో ఏ అవయవానికి ఏ స్పర్శ లేదన్నది || నాలో నీ శ్వాసే ||

ఈ ప్రేమకు ఏమైనదో ప్రేమించలేని భావనతో ఎటో వెళ్ళిపోతున్నది

ఈ ప్రేమకు ఏమైనదో ప్రేమించలేని భావనతో ఎటో వెళ్ళిపోతున్నది
ఈ బంధానికి ఏమైనదో కలుసుకోవాలనే అనుబంధం ఏది లేదన్నది || ఈ ప్రేమకు ||

ఏ రూపం ఎవరికో తెలియని జతగా కలుసుకొంటున్నది
ఎవరు ఎవరికి బంధమో ఎక్కడికి వెళ్ళినా తెలుస్తున్నది

కాలంతో సాగేందుకైనా ఒకరితో ఒకరు ఎలాగైనా జీవించాలి
ఒకరితో ఒకరు ఉండాలనే అను బంధాలు అందరికి కలగాలి

ఏనాటిదో ఈ రూపం ఏనాటి వరకో ఈ బంధం జీవితానికే తెలియాలి
ఎవరు ఎంతవరకు ఎవరితో జీవిస్తారో ఈనాటి కాలానికే తెలిసిపోవాలి || ఈ ప్రేమకు ||

ఏడు అడుగులు వేస్తున్నా సప్త సముద్రాలతో నడవాలనే ఈ జీవితం
ఎవరితో ఉంటున్నా ఎవరికొరకో ప్రయాణించాలనే ఈనాటి ఈ జీవనం

మన కోసమే మనవాళ్ళు జీవిస్తూనే అనురాగాన్ని అందించేరు
మన కోసమే మనవాళ్ళు గౌరవిస్తూ అనుబంధాన్ని ఉంచెదరు

ప్రేమిస్తూనే ద్వేషాలు కలిగినా కలిసిపోయేలా భావాలతో జీవించాలి
ఎవరు ఎవరికి బంధమే అను బంధాలతోనే జీవితాలను సాగించాలి || ఈ ప్రేమకు ||

Friday, April 15, 2016

ఆహారముకై అలసిపోయేదనా ఆరోగ్యముకై కాలాన్ని నిద్రతో సాగించెదనా

ఆహారముకై అలసిపోయేదనా ఆరోగ్యముకై కాలాన్ని నిద్రతో సాగించెదనా
విజ్ఞానముకై అన్వేషణలో సమయం చాలక మరణించెదనా  
విజ్ఞానము ఉన్నా ఉపయోగము లేక కాలంతో నిరుపయోగమా
విజ్ఞాన నైపుణ్యాన్ని గుర్తించలేక కాలంతో భవిష్యత్ వృధాయేనా
విజ్ఞానం కలిగిన వారిని సమాజం వ్యాపార సాంకేతిక రంగం గుర్తించునా
గుర్తింపు లేనివారు సమాజంలో దినచర్యలతో సతమతమయ్యేనా
విజ్ఞానంలో ఎదుగుదలను గురించలేక సమాజంలో సమస్యలు అధికమేనా
సమస్యకు తాత్కాళిక ప్రయోజనాలకన్నా శాశ్విత ప్రణాళికలే ముఖ్యమేగా
శాశ్విత ప్రణాళికలతో పాత సమస్యలు పునరావృతం కానట్లు చేసుకోవాలిగా  
మనలో విజ్ఞానం ఉన్నా గురించలేని సమాజం యదార్థంగా సాగిపోవును
శాశ్విత ప్రణాళికల ఆలోచనలు నా మేధస్సులో అనేకమై సాగుతున్నాయిగా 

భావనగా తెలియని ఆలోచనలతో అనర్థాలెన్నో

భావనగా తెలియని ఆలోచనలతో అనర్థాలెన్నో జరుగుతున్నాయి
ఆలోచనల పరమార్థం తెలిసినా సద్గుణ భావాలోచన లేక అనర్థమే
ఆలోచనగా తోచినది విజ్ఞానంతో జీవించుటకే గాని అనర్థానికి కాదు
మేధస్సు మనస్సు తెలిపే భావాలోచనను విజ్ఞానవంతగా మలుచుకోవాలి 

Wednesday, April 13, 2016

జగతిని సృష్టించినది విశ్వ శక్తి ఐతే

జగతిని సృష్టించినది విశ్వ శక్తి ఐతే
జగతిలో రూపాలను సృష్టించేది మానవుడే
విశ్వకర్తగా రూపకర్తగా జగతిలో అందాల నిర్మాణాలెన్నో
చూసేందుకైనా విజ్ఞానాన్నికైనా కట్టడాలు ఎన్నెన్నో
ఆలోచనగా కలిగే భావాలకు నిర్మాణాల అద్భుతాలెన్నో
మానవుని మేధస్సే ఆశ్చర్యమైన ఆలోచనల విజ్ఞాన ఊటయే
ఆలోచనలో కలిగే విజ్ఞానాన్నికి నిర్మాణ కృషియే రూప మందిరం
ఎన్నెన్నో అద్భుతాలకు ఎన్నెన్నో నిర్మాణాలకు ఆలోచన విజ్ఞానమే
మానవుడే రూపకర్తగా విశ్వంలో జీవిస్తున్న మహానీయుడేయే 

Tuesday, April 12, 2016

ఊపిరితో ఉన్నావా ఊహలతో జీవిస్తున్నావా

ఊపిరితో ఉన్నావా ఊహలతో జీవిస్తున్నావా
శ్వాసతో ఉంటూనే ఊహలలో తేలిపోయావా
హృదయంలో దాగి ఉంటూనే మేధస్సులో ఆలోచిస్తూ ఉన్నావా || ఊపిరితో ||

ఊపిరి నాదైతే జీవం విశ్వానిదే కదా
ఊపిరి నా దేహానికైతే శ్వాస ఆత్మకే కదా

నిరంతరం ఉచ్చ్వాస నిచ్చ్వాస లతో సాగే శరీరం అలసిపోతున్నది
నిరంతరం శ్వాసతో ఆడే హృదయం అనారోగ్యంతో అలసిసొలసినది

వృద్ద్యాపంలో జీవ శ్వాస శరీరాన్ని కవలిస్తున్నది
మరణంతో ఊపిరి దేహాన్ని వదిలించుకుంటున్నది || ఊపిరితో ||

యోగం ధ్యానం చేసినా ఊపిరి సాగేందుకే ప్రయత్నం చేస్తున్నది
భోగం భాగ్యం ఉన్నా ఊపిరి సాగుతూనే ఏదేదో ఆలోచిస్తున్నది

కాలంతో స్నేహం చేసినా దేహాన్ని సాగించే శక్తి ఊపిరికే లేదన్నది
విశ్వంతో బంధం చేసినా ప్రకృతిలో నిలిచే సామర్థ్యం శ్వాసకే లేదన్నది

ఊహలతో సాగే ఊపిరిగా జగతిలోనే నిలిచి పోవాలని
శ్వాసతో ఆగే ఊపిరిగా ఊహకే మరణం లేదని సాగేనని  || ఊపిరితో ||

Thursday, April 7, 2016

ఊపిరివై నీవు నీలోనే జీవిస్తున్నావు

ఊపిరివై నీవు నీలోనే జీవిస్తున్నావు
శ్వాసగా నీవు నీలోనే ఉంటున్నావు
ఉచ్చ్వాస నిచ్చ్వాసలతో శ్వాసగా ఊపిరివైనావు || ఊపిరి ||

ఎదిగే జీవమై శ్వాసలో నిలయమై దేహాన్ని నిలిపావు
ఒదిగే స్వరమై ఉచ్చ్వాస నిచ్చ్వాసలతో ప్రాణమైనావు

నీ శ్వాసతో హృదయమే శరీరానికి చలనాన్ని కలిగించేను
నీ ఆయువుతో మేధస్సే ఆలోచనకు భావాన్ని వెలికించేను
 
గాలిగా నీవు జీవిస్తున్నా దేహంలో ఎన్నో కార్యాలను కొనసాగిస్తున్నావు
శ్వాసగా నీవు ప్రయాణిస్తున్నా ఎన్నో కార్యాలతో జీవితాన్ని సాగిస్తున్నావు || ఊపిరి ||

నీవు ఉంటేనే జీవులకు ఆయుస్సు జీవితాలకు ప్రయోజనము
నీవు ఆడుతుంటే జీవులకు ఊరట హృదయానికి ప్రతిస్పందన  

ఊపిరి ఉన్నంతవరకే జీవనం మేధస్సుతో సాగిపోయేను
శ్వాస ఆడెంతవరకే జీవితం కార్యాలతో జరిగిపోయేను

ఊపిరిలోనే జీవం శ్వాసలోనే ఆత్మ బంధం శరీరానికే సొంతం
దేహంలోనే ఆత్మ శ్వాసపైనే ధ్యాస ధ్యానంతోనే ఊపిరి ఉత్తేజం || ఊపిరి ||

Wednesday, April 6, 2016

తంత్రము తెలిసినదా మంత్రము తెలిసినదా

తంత్రము తెలిసినదా మంత్రము తెలిసినదా
యంత్రములోని మర్మ రహస్యము తెలిసినదా
సాంకేతిక విజ్ఞానములోని తాంత్రిక పరి జ్ఞానము తెలిసినదా
మేధస్సులో దాగిన అన్వేషణ మహా విజ్ఞానాన్ని గ్రహించినదా
దీర్ఘ కాల కృషి నూతన విజ్ఞానం ఆలోచనలో అనుభవం
ఒకటితో మొదలై అనంతముతో సాగే ప్రయత్నం విజయమే
కలిగే కష్టాలు వదలని నష్టాలు మారని లోపాలు మనలోనే
విజయంలో మాయ ఉన్నది అందులోనే మంత్రమున్నది
మంత్రములో తంత్రమున్నది తంత్రము యంత్రములోనే దాగున్నది
యంత్రములో మానవ మేధస్సు ఉన్నది అందులో కృషి నిక్షిప్తమైనది

మదిలో మంత్రమున్నదో యదలో యంత్రమున్నదో దేహంలో దైవమున్నదో

మదిలో మంత్రమున్నదో యదలో యంత్రమున్నదో దేహంలో దైవమున్నదో
ఆహారంతో సాగే దేహానికి నిరంతరం జీవ శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసములు
జననం నుండి మరణం వరకు శ్వాసతో సాగే దేహానికి మేధస్సుతో జీవనమే
ఆలోచనలతో చలనం భావాలతో అర్థం అవయవాలతో కార్య కలాపాల గమనం
ఎదిగే వయసు ఒదిగే దేహంలో దాగినవే బాల్యం యవ్వనం వృద్ధ్యాప జీవితాలు
కాలంతో నడవడి సమయంతో సాహసం క్షణాలతో సందిగ్ధం నిమిషాల నిరీక్షణం
మేధస్సులో మర్మం మనస్సులో మౌనం మనలోనే మహోత్తర ప్రణాళిక రూపం 

కళ్యాణంతో కలిసే జీవించాలని ఉన్నది

విశ్వమందు నీవు వినవా శ్రీరామా!
కళ్యాణంతో కలిసే జీవించాలని ఉన్నది
కలిసి జీవించేందుకే కళ్యాణ జీవితమని
కళ్యాణ జీవితమే సంయోగ జీవనమని
జీవన విధానంలో కళ్యాణం జీవిత యోగమని
జగతియందు నేను విన్నాను మిత్రమా! 

హృదయమే సూర్యుడై మేధస్సులో ఉదయించేనా

విశ్వమందు నీవు వినవా శ్రీరామా! తెలుసుకున్నావా .....
హృదయమే సూర్యుడై మేధస్సులో ఉదయించేనా
ఆలోచనే ఆకాశమై విశ్వ లోకమంతా జీవించేనా
భావమే బ్రంహాండమై అంతరిక్షాన్ని చుట్టేసేనా
దేహమే దైవమై ముల్లోకాలలో ప్రయాణించేనా
జగతియందు నేను విన్నాను మిత్రమా! తెలుసుకున్నాను .....  

విశ్వమందు ఎవరి భావం ఎలాంటిదో గమనించెదవా

విశ్వమందు నీవు వినవా శ్రీరామా! తెలిసినదా .....
విశ్వమందు ఎవరి భావం ఎలాంటిదో గమనించెదవా
జీవుల భావాలు ఏ క్షణం ఎలాంటివో గ్రహించెదవా
భావాల అర్థాలు ఏమని తెలుపునో తెలుసుకున్నావా
అర్థాల పరమార్థం ఎవరికో ఏనాడైనా ఆలోచించావా
పరమార్థం ఏదని ఎక్కడ ఉందని ప్రశ్నించుకున్నావా
జగతియందు నేను విన్నాను మిత్రమా! తెలిసినది .....  

కాలం నీ నేస్తమని కలిసి ఉంటే సమయం నీదేనని

విశ్వమందు నీవు వినవా శ్రీరామా! తెలిసినదా .....
కాలం నీ నేస్తమని కలిసి ఉంటే సమయం నీదేనని
నేస్తం నీకు తోడేనని అవసరమైతే ఉపయోగం నీకేనని
అవసరానికే కాలం నీ ప్రగతికి తోడుగా సాగునని
విజయానికే నీ ప్రయత్నం జగతికై కొనసాగునని
జగతియందు నేను విన్నాను మిత్రమా! తెలిసినది .....   

మీరు ఎక్కడున్నా మీ చలనం నా మేధస్సులోనే

విశ్వమందు నీవు వినవా శ్రీరామా! తెలిసినదా .....
మీరు ఎక్కడున్నా మీ చలనం నా మేధస్సులోనే
ఎవరు ఎక్కడున్నా మీ జాడ నా ఆలోచనలోనే
ఎవరు ఎలా ఏ క్షణం మరణించినా నా భావనలోనే
జన్మించే ప్రతి జీవి నా శిరస్సులో ఓ అణువు కణమేలే
జగతియందు నేను విన్నాను మిత్రమా! తెలిసినది .....  

నువ్వే నేనని నాలో నీవేనని

నువ్వే నేనని నాలో నీవేనని
నేనే నీవని నీలో నేనున్నానని
నీకై నేనే నీవై నాలోనే నీవున్నావని
నాకై నీవే నేనై నీలోనే నేనున్నానని || నువ్వే ||

నేనుగా నాలో నేనే లేనని నీవే ఉన్నావని
నీలో నీవై నీవుగా లేవని నేనే ఉన్నానని
నేనే నీవై పోయానని నీలోనే ఉంటున్నానని
నీవే నేనై పోయానని నాలోనే ఉంటున్నావని
నీలోనే నేను నాలోనే నీవు కలిసే ఉన్నామని
నీతోనే నేను నాతోనే నీవు మనలో మనమే ఉంటున్నామని || నువ్వే ||

నీవే నేనుగా నాలోన నీవే ఉన్నావని
నేనే నీవుగా నీలోనే నేనే ఉన్నానని
నీవే నాలో లేవని నేనే నీలో ఉంటున్నానని
నేనే నీలో లేనని నీవే నాలో ఉంటున్నావని
నీతో నేను నీవుగా ఉండాలని నేనే నీవై యదలో ఉన్నానని
నాతో నీవు నేనుగా ఉండాలని నీవే నేనై మదిలో ఉంటున్నావని || నువ్వే || 

Tuesday, April 5, 2016

ఎవరు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్లి పోతారు మీరు .....

ఎవరు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్లి పోతారు మీరు .....
ఏ నగరంలో ఉంటారు ఏ ఊరు వెళ్తారు ఎప్పుడు వస్తారు మీరు .....

ఏనాటి దాకో తెలియని ప్రపంచమే నాది ఎవరికో తెలియని ఆలోచన నాది
రూపంలోనే ఏదో తెలియనిది ఉంది ఆకారంలో ఏదో ఒకటి దాగే ఉంటుంది
భావంతోనే జీవిస్తున్నా కాలంతోనే నడిచి ప్రయాణమే చేస్తున్నా
బంధంతోనే సాగుతున్నా కలిసిన వారితోనే కాలాక్షేపం చేస్తున్నా ॥ ఎవరు ||

తెలియనిది తెలిసేదాక తెలియనిది ఎంతో ఉందని అనుకుంటున్నా
తెలిసినది మరచిపోయే దాక మరో ఆలోచన లేదని భావిస్తున్నా
ఎవరికి ఎవరో తెలియని వారితో జీవితం ఎలాగైనా సాగుతుంది
ఎవరికి ఎవరో తెలిసినా జీవితం ఎప్పటికైనా ఒంటరి అవుతుంది ॥ ఎవరు || 

Monday, April 4, 2016

సూర్యుడికై లోకమే వేచి ఉన్నది సూర్యోదయాన

సూర్యుడికై లోకమే వేచి ఉన్నది సూర్యోదయాన
సూర్యోదయమే లోక జీవుల కార్య కలాపాల ఆరంభం
సూర్యుడే ఉత్తేజ్జాన్ని సూర్యోదయాన కలిగిస్తూ సాగేను
సూర్యాస్తం వరకు సూర్య తేజమే మేధస్సుకు సామర్థ్యం మహా ధైర్యం
సృష్టిలో ప్రతి అణువు ఎదిగేందుకు సూర్య శక్తియే మహా తేజం
సూర్యుడు లేని లోకం మేధస్సు లేని ప్రపంచ విజ్ఞానమే  

గుండెకై వైద్యమే మేధస్సుకై నైవేద్యమే

గుండెకై వైద్యమే మేధస్సుకై నైవేద్యమే
మేధస్సుకై వైద్యమే గుండెకై చేద్యమే
మేధస్సులో అనారోగ్యం వైర్యమే
గుండెలో అనారోగ్యం వైన్యమే
మేధస్సులో చేసే ఆలోచన గుండెకై పోరాటమే
గుండెలో చేసే రక్త ప్రసారణ మేధుస్సుకై విద్వంసమే
హృదయ మేధస్సులతో సాగే జీర్ణ వ్యవస్థయే మానవ జీవితం
హృదయ మేధస్సు జీర్ణ వ్యవస్థల లోపమే మరణము  

గడబిడ మాట గడుసరి మాట

గడబిడ మాట గడుసరి మాట
తడబడు మాట త్వరపడు మాట
నడబడు మాట నత్తబడు మాట
విడబడు మాట విసిగిన మాట
పొడబడు మాట పొగిడిన మాట
పొరబడు మాట పొరపాటు మాట
ఎగబడు మాట ఎగిసిన మాట
వెగబడు మాట వెక్కిరింపు మాట
వడబడు మాట వాగినటు మాట
తిరబడు మాట త్తిట్టింపుల మాట
చిటపట మాట చీదరింపు మాట
చిటకిట మాట చిరాకుల మాట
కటకిట మాట కసరిన మాట
చటపిట మాట చెదిరన మాట
విటకిట మాట విరిగిన మాట
శటపిట మాట శాపముల మాట  
తటకిట మాట తలుపుల మాట
తగసిగ మాట తాగేసిన మాట 

Friday, April 1, 2016

విశ్వమందు నీవు వినవా శ్రీరామా! అందినదా ...

విశ్వమందు నీవు వినవా శ్రీరామా! అందినదా ...
మంచి చెడులు అజ్ఞాన విజ్ఞానాల సత్యాన్ని గ్రహించుటకే
హెచ్చు తగ్గులు దూర సమీపాలు జీవన ప్రయాణానికే
లాభ నష్టాలు సుఖ దుఃఖాలు జీవితాన్ని మార్చుకొనుటకే
బేధ విభేదాలు లోటుపాట్లు అనుభవంతో సాగుటకే
జగతియందు నేను విన్నాను మిత్రమా! అందినది ... 

ఆకాశమే విశ్వ రూపమై కనిపించేలా సూర్యుడే ప్రకాశిస్తున్నాడు

ఆకాశమే విశ్వ రూపమై కనిపించేలా సూర్యుడే ప్రకాశిస్తున్నాడు
సూర్యుడే లోకమై విశ్వానికే మహా తేజమై ఉదయిస్తున్నాడు
ప్రతి కిరణం ఓ విజ్ఞాన క్షేత్రమై జీవుల మేధస్సులలో వెలుగుతున్నది
సూర్యుడే విశ్వానికి శక్తి స్వరూపుడై ఆకాశమంతట ఎదిగి ఉన్నాడు
ప్రతి అణువుకు తానే మూలాధారమై కాల చలనమై సాగుతున్నాడు
నిలువలేని చలనం తరగని తేజస్సు వర్ణ ఉషస్సు ఆగని ఆర్భాటపు ఛందస్సు
మేఘ వర్ణ రూపం కిరణాత్మక ఆకార వైభోగ ఛాయా చిత్రపు స్వర్ణ సుందరం
ఆకాశం సూర్య విజ్ఞాన విశ్వ కళాశాల - రూప వర్ణం భావ ప్రభావ గమన చలనం

మరణించుటలో కలిగే భావనను ఎవరికి తెలుపాలనుకున్నావు

మరణించుటలో కలిగే భావనను ఎవరికి తెలుపాలనుకున్నావు
తెలుపాలనుకున్నది తెలియకుండానే నీలోనే మరిచిపోయావా
తెలిపే భావనను నీ రూప భావాలలోనే తెలుపుకున్నావా
భావనగా తెలిపిన దానిని ఎవరూ గ్రహించలేక పోయారా
ఆలోచనగా లేని నీ భావన మౌనమై మాటగా మరచినదా
మేధస్సులో దాగిన నీ భావన విశ్వమున అద్వితమై నిలిచినదా
మరణ భావన మౌనానికి సంకేతం మాటలేని ఆలోచన మేధస్సుకే ఎరుక 

యవ్వనం ఒక మోహానమైతే వయసు ఒక ఆర్భాటంతో సాగే కథనం

యవ్వనం ఒక మోహానమైతే వయసు ఒక ఆర్భాటంతో సాగే కథనం
వయసులో కలిగే ఆర్భాటం తాత్కాళిక వృధా యవ్వన పరవశం
యవ్వనంలో దాగిన వలపం వయసుకు తెలియని ఓ ఆర్భాటం
ఆర్భాటంతో సాగే వలపం ఆకర్షణీయమైన దుర్వినియోగ సమరం
కళ్యాణంతో సాగే యవ్వన సుగంధం పరిమళమైన సామరస్య జీవితం