విశ్వాన్ని నడిపించే విజ్ఞానం కాలానికే తెలియాలి
తరతర తరాలుగా యుగ యుగాలుగా విజ్ఞానం సాగుతున్నది
జీవములు ఎన్నున్నా ఎన్నెన్నో వస్తున్నా కొత్త దనం వస్తున్నది
ప్రయోగమా పరిశోధనమా పర్యవేక్షణలో నూతన విజ్ఞానమే దాగున్నది
రూపాలు ఎన్నున్నా నవ రూపాలెన్నో కాలంతో సాగుతున్నాయి
విశాలమైన విశ్వమే అనంతమైన విజ్ఞానంగా మారుతున్నది
విశాలమైన ప్రదేశం లేకున్నచో జీవుల తర తరాలు అంతరించేనులే
జీవులే లేకున్నచో విజ్ఞానం అనంతమై సాగుట కష్టతరమేలే
విశ్వ నిర్మాణం ముందస్తు భవిష్య ప్రణాళికతో ఏర్పడినదని తెలియునులే
కొన్ని వేల లక్షల యుగాలుగా సాగేల విశ్వ నిర్మాణం ఏర్పడినదిలే
పునః నిర్మాణమునకై ప్రళయాలు కూడా ఎప్పటికైనా సంభవించేనులే
మేధస్సులలో అన్వేషణ ఉన్నంత కాలం విజ్ఞాన కొరత ఉండదులే

No comments:
Post a Comment