Wednesday, April 6, 2016

మదిలో మంత్రమున్నదో యదలో యంత్రమున్నదో దేహంలో దైవమున్నదో

మదిలో మంత్రమున్నదో యదలో యంత్రమున్నదో దేహంలో దైవమున్నదో
ఆహారంతో సాగే దేహానికి నిరంతరం జీవ శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసములు
జననం నుండి మరణం వరకు శ్వాసతో సాగే దేహానికి మేధస్సుతో జీవనమే
ఆలోచనలతో చలనం భావాలతో అర్థం అవయవాలతో కార్య కలాపాల గమనం
ఎదిగే వయసు ఒదిగే దేహంలో దాగినవే బాల్యం యవ్వనం వృద్ధ్యాప జీవితాలు
కాలంతో నడవడి సమయంతో సాహసం క్షణాలతో సందిగ్ధం నిమిషాల నిరీక్షణం
మేధస్సులో మర్మం మనస్సులో మౌనం మనలోనే మహోత్తర ప్రణాళిక రూపం 

No comments:

Post a Comment