Monday, April 25, 2016

మనస్సు అజ్ఞానమైతే మేధస్సు అజ్ఞానమగును

మనస్సు అజ్ఞానమైతే మేధస్సు అజ్ఞానమగును
మేధస్సు అజ్ఞానమైతే మనస్సు అజ్ఞానమగును
అధికారము అజ్ఞానమైతే వ్యవస్థ అజ్ఞానమగును
వ్యవస్థ అజ్ఞానమైతే అధికారము అజ్ఞానమగును
అజ్ఞానముతో మానవులు ఎందరో అజ్ఞానమగును
ఒకరి అజ్ఞాన అనుభవముతో మరెందరో అజ్ఞానమగును
అజ్ఞానము వలన ప్రపంచ సమాజమంతా అజ్ఞానమగును
ప్రపంచ అజ్ఞానముతో ప్రతి ఒక్కరు అజ్ఞానమగును
నేటి మానవులతో రేపటి జీవితమంతా అజ్ఞానమగును
విజ్ఞానములో కూడా స్వార్థపు అజ్ఞానమును ఇమిడ్చెదరు
స్వచ్ఛమైన విజ్ఞానమునకై అరణ్య పర్వత ఏకాంత ధ్యానమే సరియగును
ఎంత విజ్ఞానముగా జీవించినను అజ్ఞానము గలవారు మనకు ముప్పు కలిగించేరు
జాగ్రత్తగా ఉన్నను అజాగ్రత్త కలుగుటకు మరుపు కలిగేలా కాలమే నిర్ణయించేను
ఎంత ఏకాగ్రతతో ఉన్నను మాటల కాలంతో ఇంద్రియ దృష్టితో మరుపు కలిగేను
తోటి వారికి సహాయపడక పోయినా మీ నుండి ముప్పు వాటిల్ల కుండా చూసుకోండి
చదవడం వల్ల మీకు తెలిస్తే మీకు మరుపు - అనుభవ విజ్ఞానము ద్వారా తెలిస్తే అది ఆచరణ 

No comments:

Post a Comment