Tuesday, April 12, 2016

ఊపిరితో ఉన్నావా ఊహలతో జీవిస్తున్నావా

ఊపిరితో ఉన్నావా ఊహలతో జీవిస్తున్నావా
శ్వాసతో ఉంటూనే ఊహలలో తేలిపోయావా
హృదయంలో దాగి ఉంటూనే మేధస్సులో ఆలోచిస్తూ ఉన్నావా || ఊపిరితో ||

ఊపిరి నాదైతే జీవం విశ్వానిదే కదా
ఊపిరి నా దేహానికైతే శ్వాస ఆత్మకే కదా

నిరంతరం ఉచ్చ్వాస నిచ్చ్వాస లతో సాగే శరీరం అలసిపోతున్నది
నిరంతరం శ్వాసతో ఆడే హృదయం అనారోగ్యంతో అలసిసొలసినది

వృద్ద్యాపంలో జీవ శ్వాస శరీరాన్ని కవలిస్తున్నది
మరణంతో ఊపిరి దేహాన్ని వదిలించుకుంటున్నది || ఊపిరితో ||

యోగం ధ్యానం చేసినా ఊపిరి సాగేందుకే ప్రయత్నం చేస్తున్నది
భోగం భాగ్యం ఉన్నా ఊపిరి సాగుతూనే ఏదేదో ఆలోచిస్తున్నది

కాలంతో స్నేహం చేసినా దేహాన్ని సాగించే శక్తి ఊపిరికే లేదన్నది
విశ్వంతో బంధం చేసినా ప్రకృతిలో నిలిచే సామర్థ్యం శ్వాసకే లేదన్నది

ఊహలతో సాగే ఊపిరిగా జగతిలోనే నిలిచి పోవాలని
శ్వాసతో ఆగే ఊపిరిగా ఊహకే మరణం లేదని సాగేనని  || ఊపిరితో ||

No comments:

Post a Comment