Tuesday, April 19, 2016

విశ్వంలోని అద్భుతాలన్నీ నా భావాలతో నిండి ఉన్నాయి

విశ్వంలోని అద్భుతాలన్నీ నా భావాలతో నిండి ఉన్నాయి
ప్రతి అణువులో పొందికనై తటస్థంగా ఒదిగి ఉంటున్నాను
పారేటి జలపాతాలు ఎత్తైన పర్వతాలు నా భావ శిఖరాలే
ప్రతి అణువులో పరమాణువునై పరమాత్మగా నిలిచానే
ఆశ్చర్యమైనా అద్భుతానికి నా భావన ఒక విచక్షణయే  
ఏ నిర్మాణం ఎక్కడ ఎలా ఉంటుందో నా భావానికే ఎరుక
విశ్వ నిర్మాణం నాలోని భావాల అణువుల సముదాయమే
ఎవరికి తెలియని అద్భుతాలు ప్రదేశాలు నాలో నిక్షిప్తమే
సూర్య కాంతిలో దాగిన ప్రతి కిరణం నాలో ఒక స్వర్ణ భావమే
ఈ విశ్వ నిర్మాణం ఓ మర్మ రహస్యమై నాలో దాగున్నది
శూన్యము నుండి నేటి వరకు పంచ భూతాలుగా ఉన్నాను
అంతరిక్షములో గ్రహ స్థితులు నా భావాల నిర్మాణ చలనమే
విశ్వం ఒక మహా బ్రంహాండమై నా మేధస్సులో భావమైనది
ఖనిజములో కరుణ తేజమునై తరతరాల సంపదనై సాగుతున్నాను
కాలముగా సమయ స్పూర్తినై విశ్వ ప్రయాణం చేస్తున్నాను 

No comments:

Post a Comment