Showing posts with label భవిష్యత్. Show all posts
Showing posts with label భవిష్యత్. Show all posts

Monday, March 20, 2017

ఏనాటిదో శూన్యం ఏనాటిదో ఆద్యంతం

ఏనాటిదో శూన్యం ఏనాటిదో ఆద్యంతం
ఆది నుండి తుది వరకు అంతం అనంతం
క్షణము నుండి సమయం కాలంతో ప్రయాణం  || ఏనాటిదో ||

శూన్యము నుండే ఉద్భవించినది మహా రూప నిర్మాణం
శూన్యము నుండే ప్రబలించినది అసంఖ్యాక వర్ణ రూపం
శూన్యము నుండే అంతర్భవించినది రూపాంతరం మర్మం

కాలంతో ఆకారాలు ప్రభావితమౌతూ ఎన్నో అనంతమైన రూపాలుగా వెలిసేను
కాలంతో రూపాలు పరిశోధనమౌతూ ఎన్నో అసంఖ్యాక వర్ణాలుగా ప్రజ్వలించేను
కాలంతో పరిసరాలు ప్రాముఖ్యతమౌతూ ఎన్నో అనేక స్వభావాలుగా ఉదయించేను  || ఏనాటిదో ||

శూన్యమే సామర్థ్యమై స్థానమే మూలమై
ఊష్ణమే రూపాంతర బీజమై ప్రభావమే ఆకార నిర్మాణమై
ఆత్మయే జీవమై కాలమే ఎదిగే మహా కార్యమై ఆరంభమైనదే మన బ్రంహాండం

శూన్యము మహా సామర్థంతో మహా నిర్దిష్టమైన కాల ప్రణాళికతో అనేక వివిధ కార్యాలతో
ఎన్నో రూపాలుగా ఆకారాలుగా భావ స్వభావాలుగా తత్వాలుగా ప్రభావితమౌతున్నది

ఆది శూన్యము నుండి నేటి అనంతము వరకు కాల జ్ఞాన వేద విశ్వ విజ్ఞానము తుది లేని భవిష్యత్ కు సాగుతున్నది  || ఏనాటిదో ||