Showing posts with label జీవత్వం. Show all posts
Showing posts with label జీవత్వం. Show all posts

Friday, June 30, 2017

ఎవరు మీరు ఎవరు ఎంతటివారు భావాలకే తోచినవారు

ఎవరు మీరు ఎవరు ఎంతటివారు భావాలకే తోచినవారు
ఎవరు మీరు ఎవరు ఏనాటివారు తత్వాలకే తెలిసినవారు

ఎక్కడున్నా మీరు మహోదయ ప్రజ్వలమే
ఎలావున్నా మీరు మహోన్నత ప్రదర్శనమే   || ఎవరు ||

ప్రకృతిలో పరవశించిపోయే పరిశోధనమా
జగతిలో జలమైపోయే జలధార జీవత్వమా

ఉదయించే పుష్పంలో సుగంధాల పూర్ణోదయమా
జన్మించే స్వర జీవంలో సంకీర్తనల జీర్ణోదయమా   || ఎవరు ||

ప్రకృతిలో సాగే అన్వేషణ మహా పరిశోధనమా
జగతిలో కొనసాగే ఆలోచన మహా ప్రభంజనమా

ఉదయత్వంలో దాగిన మహా ప్రకృతి స్వరూపమా
జీవత్వంలో ఒదిగిన మహా ఆకృతి మీ ప్రతిబింబమా  || ఎవరు || 

Wednesday, October 12, 2016

నేను జన్మించిన క్షణానికి ముందే నా కోసం దురదృష్టం ఉదయించినది

నేను జన్మించిన క్షణానికి ముందే నా కోసం దురదృష్టం ఉదయించినది
నేను జీవించుటలో నా కార్యాలకు ఫలితమే లేనట్లు కర్మయే వరిస్తున్నది  || నేను జన్మించిన ||

ఏ కార్యమైనా కాలం వృధాయే కష్టాల నష్టాలతో సాగిపోయేలా నన్ను వెంటాడుతున్నది
నా నీడైనా నన్ను ద్వేషించేలా నా కార్యాలన్నీ భంగమైపోయేలా నన్ను వెంబడిస్తున్నది

ఏనాటి జీవితమో ఎవరి జీవనమో విశ్వమే ఎరుగని భావ తత్వాలతో సాగుతున్నది
ఏనాటి వరకో ఎందులకో జగమే తెలుపని మహా స్వభావాలతో జీవత్వం చలిస్తున్నది

మేధస్సులో లోపమా రూపంలో వికారమా జన్మించిన స్థానమే అపరాధమా
ఆలోచనలలో అనర్థమా కార్యాలలో అజ్ఞానమా ప్రయాణంలో అప భావమా  || నేను జన్మించిన ||

నేను ఎవరికి నచ్చని జీవన స్వభావమా ఎవరికి చూపరాని తత్వమా
నేను ఎవరికి తెలియని మానసిక ఆవేదనాన్నినా శారీరక దుష్టడునా

నా జన్మలో ఏ భూతాత్మ ఉన్నదో నా కాలంలో ఏ విశ్వాత్మ ఉన్నదో
నా రాశిలో మృగమే ఉన్నదా నా భాషలో మూర్కత్వమే ఉంటున్నదా

నేనెప్పుడూ మార్చుకోలేని స్థిరమైన అవస్థ భావాల బాధితుడనా
నేనెప్పుడూ చెరుపుకోలేని రాతల పురాతనల చరిత్ర గ్రహస్తుడనా  || నేను జన్మించిన || 

నేనెప్పుడూ చెరుపుకోని రాతల పురాతనల చరిత్ర గ్రహస్తుడనా  || నేను జన్మించిన || 

Thursday, August 4, 2016

దైవత్వంలో అద్వైత్వం అమరావతీయం

దైవత్వంలో అద్వైత్వం అమరావతీయం
జీవత్వంలో మాతృత్వం అమరావతీయం
పరతత్వంలో మహా తత్వం అమరావతీయం
ఆత్మత్వంలో మహాత్మ తత్వం అమరావతీయం 

Tuesday, July 19, 2016

ఊపిరిలో ఊహా భావ తత్వమే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలుగా

ఊపిరిలో ఊహా భావ తత్వమే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలుగా శ్వాసతో ఆత్మ జీవం ఉదయించినది
శ్వాసా స్పర్శలో మాతృత్వమే మహా జీవమై తల్లి భావ తత్వాలతో ఆత్మ జీవం ఎదుగుతున్నది
జీవత్వంలో దైవత్వమే అమరమై శ్వాసలో ఆత్మయే లీనమై హృదయంతో జీవిస్తున్నది
అంతర్గత దేహంలో జీవమే సర్వస్వమై శ్వాసే మహాత్మగా విశ్వ జగతిలో లీనమైనది 

Friday, July 15, 2016

మాతృత్వం ఒక జీవ తత్వం

మాతృత్వం ఒక జీవ తత్వం
మహా తత్వం ఒక మహాత్ముని దైవత్వం
ప్రతి తత్వం విశ్వంలో ఒదిగిన జీవత్వం || మాతృత్వం ||

ఆత్మ తత్వం జీవిలో ఒదిగిన మాతృత్వమే
మహా తత్వం మహాత్మునిలో ఎదిగిన జీవత్వమే

దైవత్వం సత్య భావాలతో సాగే ఆత్మ తత్వం
అద్వైత్వం పరమాత్మతో నడిచే పర తత్వం

వేదత్వం మహాత్ముల గుణ తత్వం
వేదాంతం మహానుభావుల సుగుణత్వం  || మాతృత్వం ||

భావంతో సాగే మహా జీవుల జీవనమే ఒక నవ తత్వం
స్వభావంతో సాగే అనేక జీవుల జీవితమే ఒక నవీనత్వం

విశ్వ తత్వం జగతికి మాతృత్వం
మహా తత్వం మహాత్మకు జీవత్వం

ప్రకృతిలో దాగిన పర తత్వాలే కాలంతో తెలిసే విజ్ఞాన తత్వం
అణువులో దాగిన జీవ తత్వాలే పరిశోధనలో కలిగే నవ తత్వం  || మాతృత్వం ||