Wednesday, February 25, 2015

నీవు వస్తావని కబురే లేదు

నీవు వస్తావని కబురే లేదు ఎందుకు మామా
వస్తావని ఎదురు చూస్తున్న ఆశ నిలవటం లేదు మామా
కాలం సాగుతుందే గాని మా జీవితాలు నీటి బుడగలే మామా 
ఎందరో హాయిగా జీవిస్తున్నా మాకు నీవు ఉంటేనే కదా మామా
నీవు వస్తావని నీవు ఉన్నావని అందరం ఎదురు చూస్తున్నాం మామా
ఉదయిస్తూ అస్తమిస్తున్నా విశ్వమే మాకు నీ నిదర్శనం మామా!

నేను నిద్రిస్తున్నా లేపకు మామా

నేను నిద్రిస్తున్నా లేపకు మామా
నిద్రిస్తూ ధ్యానిస్తున్నా పిలవకు మామా
నిద్రిస్తూనే అస్తమిస్తున్నా మాట్లాడకు మామా
నిద్రిస్తూనే ఉదయిస్తున్నా తెలుసుకో మామా
ఉదయిస్తూ అస్తమిస్తున్నా చూసుకో విశ్వమా!

Tuesday, February 3, 2015

విశ్వమందు గొప్పవారు

విశ్వమందు గొప్పవారు మహానీయులు
విశ్వమందు సద్గురువులు మార్గదర్శకులు
విశ్వమందు విజ్ఞానులు స్పూర్తి వంతులు
విశ్వమందు సమాజ సేవకులు ఆదర్శవంతులు
విశ్వమందు జనులు  సమాజానికి సహచరులు 

విశ్వమందు నీవు సత్యమై

విశ్వమందు నీవు సత్యమై ఉన్నావు
విశ్వమందు సమాజం విశాదమౌతున్నది
విశ్వమందు నీవు నిలకడగా ఉండాలి
విశ్వమందు సమాజం చైతన్యం కావాలి
విశ్వమందు సమాజం లోక జ్ఞానమేగా!