Friday, December 4, 2020

ఎవరి భావమిది ఎవరి తత్వమిది

ఎవరి భావమిది ఎవరి తత్వమిది 
ఎవరి నాదమిది ఎవరి వేదమిది  దేవా 

ఎవరి జీవమిది ఎవరి రూపమిది 
ఎవరి ధ్యాసమిది ఎవరి ధ్యానమిది దేవా 

ఎవరి బంధమిది ఎవరి అంగమిది 
ఎవరి కార్యమిది ఎవరి శౌర్యమిది దేవా 

జీవ తంత్రమై రూప మంత్రమై శ్యాస యంత్రమై ధ్యాస అంత్రమై 
విశ్వ మేధస్సులో మహా మర్మ విజ్ఞాన క్షేత్ర పురమునే సృష్టించావు దేవా  || ఎవరి || 

మనస్సు మనువులో వయస్సు వధువులో మధురమై నిలిచావు 
తపస్సు తనువులో అహస్సు చనువులో మాధుర్యమై నిలిచావు 
 
శ్రేయస్సు దరువులో మేధస్సు పెరువులో మాణిక్యమై నిలిచావు
తరస్సు అరువులో ఛందస్సు గురువులో మనోహరమై నిలిచావు   

శిరస్సు తగవులో మహస్సు విభువులో మహోన్నతమై నిలిచావు 
తేజస్సు మధువులో భువస్సు చెరువులో మహోత్పలమై నిలిచావు  || ఎవరి ||
 
నమస్సు పురవులో జ్యోతిస్సు ననువులో మహాకాంతమై నిలిచావు 
దేహస్సు ధేనువులో ఉషస్సు అణువులో మహోజ్వలమై నిలిచావు  

ప్రభస్సు స్వాధువులో బోధస్సు భానువులో మహాత్మవై నిలిచావు  
జ్ఞానస్సు హరువులో కార్యస్సు చెలువులో మహానందమై నిలిచావు 

ఆయుస్సు నెరవులో క్షేత్రస్సు నెలవులో మహాద్భుతమై నిలిచావు 
యశస్సు మరువులో వచస్సు మృదువులో మహాశ్చర్యమై నిలిచావు  || ఎవరి ||