Showing posts with label దంపతులు. Show all posts
Showing posts with label దంపతులు. Show all posts

Tuesday, August 9, 2016

కల్యాణంతో కలిసిపోయే బంధాలే మరువలేని మన జీవిత సంబంధాలు

కల్యాణంతో కలిసిపోయే బంధాలే మరువలేని మన జీవిత సంబంధాలు
పరిచయాలతో కలిసిపోయే సంబంధాలే సంతోషాన్ని పంచేటి బంధాలు  || కల్యాణంతో ||

నవ జీవితాన్ని సాగించే యువకుల మనో భావాల ప్రయాణమే కళ్యాణం
జంటగా ఆలుమగలై నూతన జీవనాన్ని కొత్తదనంతో సాగించేదే జీవితం

వధూవరులు దంపతులు భార్యాభర్తలు ఈడు జోడుగా కలిసే తరుణం కళ్యాణం
పెళ్లి కుమారుడు కుమార్తె మొగుడు పెళ్ళాంగా తపించే శుభవేళ కళ్యాణ శోభనం

ఒకరికి ఒకరు స్వీకారం చుట్టుకొని పరిణయంతో కలిసి మెలిసి పోయే బంధం కళ్యాణం
ఒకరికి ఒకరై శృంగారం పంచుకొని మధురంతో అలసి సొలసి పోయే కార్యం కమనీయం  || కల్యాణంతో ||

కొత్త తరహా మాటలు చేష్టలు అరిషడ్వార్గాల మనో భావాలు వెల్లు విరిసే సమయం పెళ్లితో ప్రారంభం
పొరపాట్లు తప్పు ఒప్పులు ఇబ్బందులు దుఃఖాలు నష్టాల కష్టాలుగా సాగే తరుణం వివాహంతో ఆరంభం

అర్థం చేసుకుంటే ఇద్దరిలో పరమార్థం తెలుస్తుంది పరివర్తన చెందుతుంది
సంతోషం ఇచ్చుకుంటే ఆనందం కలుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది

మధురమైన జీవితం మహోత్సవమైన ఉత్తేజం మరొకరి జంటకు పెళ్లితో ఆదర్శం
శుభమైన ముహూర్తం బ్రంహోత్సవమైన ఉత్కంఠం ఎందరికో జీవితాంతం సోపానం  || కల్యాణంతో ||