Tuesday, September 9, 2025

రెండు చేతులు ఎంత కాలం శ్రమిస్తాయి

రెండు చేతులు ఎంత కాలం శ్రమిస్తాయి 
నాలుగు చేతులు శ్రమిస్తూ ఉంటే కార్యాలు సులువుగా సాగిపోతూ ఎన్నో లాభాలను పొందుతాయి  

నాలుగు చేతులు శ్రమిస్తున్నప్పుడు అలసట చెందకుండా రెండు చేతులు కార్యాన్ని సాగిస్తూ మరో రెండు చేతులు విశ్రాంతిని పొంది సామర్త్యాన్ని పెంచుకొని మరల మరో రెండు చేతులతో కలిసిపోతూ కార్యాన్ని సాగిస్తూ శ్రమిస్తాయి (శ్రమించాలి)
అలాగే మరో రెండు చేతులు కలిసినప్పుడు మొదటి నుండి శ్రమిస్తున్న రెండు చేతులు విశ్రాంతిని పొంది సామర్త్యాన్ని పెంచుకొని మరో రెండు చేతులతో కలిసిపోయి శ్రమిస్తాయి (శ్రమించాలి)

ఇలా నాలుగు చేతులు ఎన్నో కార్యాలను సాగిస్తూ పోతే సమస్యలు తీరిపోతూ అభివృద్ధిని త్వరగా చేరుకుంటాయి 
శ్రమలో సంతోషం ప్రశాంతం సామర్థ్యం నైపుణ్యం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ సమకూరుతాయి అన్ని విధాలా శుభంతో సాగిపోతాయి 

ఇంట్లో రెండు చేతులే శ్రమిస్తూ పోతే కార్యాలు సులువుగా సాగవు అలాగే అనారోగ్యం కూడా కలగవచ్చు ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు సమస్యలు తీరకుండా ఉండిపోవచ్చు 

ఇంట్లో ఐనా సమాజంలో ఐనా ఎక్కడైనా జతగా పనిచేస్తూ శ్రమిస్తూ పోతే ఏ కార్యాలైనా ఎన్నో విధాలుగా  ఎన్నో విజయాలను సాధిస్తాయి ఎన్నో సమస్యలను పరిష్కారింపడతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment