పరమాత్మా! నీవు ఎలా ఉన్నావో విశ్వానికే తెలియాలి
పరమాత్మా! నీవు ఎక్కడ ఉన్నావో జగతికే తెలియాలి
పరమాత్మా! నీవు ఎప్పటి నుండి ఉన్నావో బ్రంహాండానికే తెలియాలి
పరమాత్మా! నీవు ఎప్పుడు ఎక్కడ ఎలా స్వయంభువమై ఉద్భవించావో మాతృ భావాల పితృ తత్వాల సృష్టికే తెలియాలి
పరమాత్మా! నీవు ఉన్నావని ఎవరికి తెలుసు
పరమాత్మా! నీవు సర్వం గమనిస్తున్నావని ఎవరికి తెలుసు
పరమాత్మా! నీవు ఎలా ఏ విధంగా ఏ రూపంతో ఏ భావ తత్వాలతో జీవిస్తున్నావు
పరమాత్మా! నీవు ఎలా ఏ విధంగా ఏ రూపంతో ఏ భావ తత్వాలతో దర్శనమిస్తావు
పరమాత్మా! నీవు జీవించే ప్రదేశం పరిశుద్ధమైన పవిత్రమైన ప్రకృతి పర్యావరణమతో నిండిన స్వచ్ఛమైన పరిపూర్ణమైన పరిమళమైన పంచభూతాల శుభోదయమై ఉన్నదా
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment