ఒక్కడే శ్రమించుటలో ప్రతిఫలం లేదురా
శ్రమించిన ఫలితమంతా ఖర్చులతో శూన్యమై సమస్యలు మిగిలేనురా
సమస్యలు తీరనిచో ఖర్చులు అధికమై మరో కొత్త సమస్యలు తోడై శ్రమకే భారమై శరీరమే వాలిపోయేనురా
శ్రమకు తోడుగా మరో శ్రామికుడు జతగా చేరితే ప్రతిఫలం అధికమై సమస్యలెన్నో తీరిపోతూ (పాత సమస్యలు) సంతోషంగా జీవించెదమురా
అభివృద్ధిని కలిగించి సంతోషాన్ని సాగించే సమస్యలనే తీర్చుకోవాలి
ఐశ్వర్యాన్ని మిగిలించి ఆనందాన్ని వృద్ధించే కార్యాలనే సాగించుకోవాలి
బంధమే జతగా కుటుంబమే తోడుగా సమస్యలే ఏర్పడినా కలిసిపోయే శ్రమలో కలదురా అపారమైన ప్రతిఫలం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment