మేధస్సులో అనంతమైన ఆలోచనలు ఉద్భవిస్తూనే ఉన్నాయి ఎన్నో అపారమైన కార్యాలు సాగుతూనే ఉన్నాయి
అనంతమైన ఆలోచనలలో విజ్ఞాన అభివృద్ధి ఉన్నా జీవించుటకు ఐశ్వర్యం ప్రధానమైనదిగా ప్రథమమైనదిగా ముఖ్యాంశమై ప్రతి మానవునికి మిక్కిలి అవసరమౌతున్నది
ఎలా విజ్ఞానంతో సత్ప్రవర్తనతో పరిశుద్ధతతో జీవించామో తెలుసుకొనుటకైనా ఎలా ఐశ్వర్యంగా ఎదుగుతున్నామో కుటుంబంతో పాటు సమాజం ఎదురు చూస్తున్నది
కుటుంబంలో ప్రతి రోజు ఐశ్వర్య అభివృద్ధికై ఎన్నో ఆలోచనల ఎన్నో కార్యాలతో ఏంతో శ్రమ సాగుతున్నది
శ్రమించుటలో ఫలితం లేని మానవులు కార్య సిద్ధి విజ్ఞాన నైపుణ్యంతో సాగాలి సరైన శ్రమ సాధనతో మహా అభ్యాసతో కృషించాలి
విశ్వంలో ఎన్ని అద్భుతాలు దర్శించినా ఎన్ని ఆశ్చర్యాలు వింటున్నా నీ యందు ఐశ్వర్యం ఉంటేనే జీవించుటలో చమత్కారం కార్యాలలో సాఫల్యత ఉంటుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment