Showing posts with label చరిత్ర. Show all posts
Showing posts with label చరిత్ర. Show all posts

Thursday, May 4, 2017

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే
జగతికే తెలియని ఊహలు ఎన్నో మేధస్సులలోనే ఆగిపోయెనే

ఎవరికి తెలియని జీవ భావాలు ఆలోచనలలోనే నిలిచిపోయెనే
ఎవరికి తెలియని దేహ తత్వాలు మనస్సులలోనే ఉండిపోయెనే  || చరిత్రకే ||

ఎవరి జీవితం వారికే తెలియునని
ఎవరి సుఖ దుఃఖాలు వారికే చెందునని
ఎవరి మనస్సులో వారే ఒదిగిపోయేనని
ఎవరి మేధస్సులో వారే ఉండిపోయేనని
చరిత్రగా ఎవరికి వారే నిలిచిపోయేనని
గతంలో జరిగిన మహా కథనాలే చరిత్రగా మారేనని
భవిష్య కాల చరిత్రాలే మహా పరిశోధన ప్రజ్ఞానమని  || చరిత్రకే ||

చరిత్రలో ఎన్నో కథనాలు జరిగిపోయేనని
కథలు కథలుగా కలలెన్నో కలిసిపోయేనని
జీవుల స్వభావ తత్వాలు ఎన్నెన్నో చెప్పేనని
కాలమే పురాణాలుగా సాగుతూ మనతో వచ్చేనని
ఎన్నో గొప్ప ఆలోచనలు మహా కార్యాలుగా సాగేనని
మన చరిత్ర నిర్మాణాలు సంపుటాలుగా భోదించేనని  
అనుభవాలకే చరిత్ర పరిశోధనలు విజ్ఞానమయ్యేనని  || చరిత్రకే ||

Wednesday, January 25, 2017

ఏమిటో నీ జాడ కాస్తైనా తెలియకున్నది ఓ పరమాత్మా

ఏమిటో నీ జాడ కాస్తైనా తెలియకున్నది ఓ పరమాత్మా
ఏమిటో నీ రూపం కాస్తైనా కనబడకున్నది ఓ పరంధామా

ఏమిటో నీ భావం ఒకటైనా కలగకున్నది ఓ పురుషోత్తమా
ఏమిటో నీ తత్వం ఒకటైనా ధరించకున్నది ఓ పద్మనాభమా  || ఏమిటో ||

ఏనాటి పర బ్రంహవో యుగ యుగాలకు నీవే మా పూర్వ పురుషోత్తమవు
ఏనాటి పర విష్ణువో తర తరాలకు నీవే మా పురాణ గాధల పురోహితుడవు

ఏ ధ్యానము చేసినా ఏ ధ్యాస ఉంచినా నీవే కానరాని మహోదయ పురుషుడవు
ఏ యాగము చేసినా ఏ దీక్షలు సాగించినా నీవే దర్శించని మహా పురంధరుడవు  || ఏమిటో ||

నీవు లేకున్నా ఉన్నావనే భావనతో దైవ ప్రవక్తగా కొలిచి వేదాల ప్రవచనాలనే నీకు అర్పించెదము
నీవు ఎలా ఉన్నావో తెలియకున్నా విశ్వ కర్తగా తలిచి శతాబ్దాలుగా కీర్తనలనే నీకు వినిపించెదము

నీవు లేనన్న మాట ఎవరికి తెలియనివ్వక మీ పూర్వ చరణములనే భోదించెదము
నీవు రావన్న బాట ఎవరికి చూపనివ్వక మీ పురాణ చరిత్ర గాధములనే తెలిపెదము  || ఏమిటో || 

Wednesday, December 28, 2016

కథలు నావే కలలు నావే కవితలు నావే ఊహలు నావే

కథలు నావే కలలు నావే కవితలు నావే ఊహలు నావే
రచయితగా వ్రాసే కథల కలలు నాలోన ఉన్న భావాలే
కవిగా వ్రాసే కవితల ఊహలు నాలోన ఉన్న తత్వాలే    || కథలు నావే ||

రచయితల ఆలోచనలు వాక్యముల సముదాయ భాగాలుగా వ్రాయబడెను
ఎన్నో విభాగాలుగా వాక్యముల సముదాయ విషయాలను లేఖరి తెలిపేను

కవి ఆలోచనలు కవిత్వమై పద్య కావ్యములుగా కీర్తనలు లిఖించబడెను
ఎన్నో వాక్య పద్యములు కలిసి మహా గ్రంథాల సారాంశాన్ని తెలుపబడెను

జరిగిన ఎన్నో విషయాలను చరిత్రగా లిఖించబడెను
జరగబోయే మరెన్నో కలలను కథలుగా వ్రాయబడెను   || కథలు నావే ||

భవిష్య ప్రజ్ఞానాన్ని కవితల కీర్తనలుగా ఎందరో తెలిపేను
తెలిసిన పాత విజ్ఞానాన్ని కవితల కావ్యాలుగా తెలుపబడెను

పద్య భావాలనే ప్రతి పదార్థాలుగా ఎందరో గురువులు భోదించేను
పద్యాల పదాలనే నానార్థాలుగా ఎందరో మహా అర్థాన్ని తెలిపేను

కథలనే చిత్రాలుగా మార్చి విషయాలను క్లుప్తంగా వివరించబడెను
చిత్రాలనే కథలుగా మలచి ఎన్నో అర్థాలను మనకు తెలుపబడెను

ఏనాటి కాలం నుండైనా ఎప్పటి వరకైనా బోధనలు కథలుగా మారుస్తూ సాగేను
ఏనాటి ప్రయాణమైనా ఎప్పటి వరకైనా కవితలు పాఠాలుగా చెప్పుతూ వచ్చేను  || కథలు నావే || 

Friday, December 9, 2016

తల్లి ప్రేమతో ఎదిగిన జీవం తల్లి తత్వంతో ఒదిగిన ప్రాణం

తల్లి ప్రేమతో ఎదిగిన జీవం తల్లి తత్వంతో ఒదిగిన ప్రాణం
విశ్వానికి పరిచయమై జగతికి రక్షణమై సాగేను మన జీవితం  || తల్లి ప్రేమతో ||

వేద భావాలతో వేదాంత సిద్ధాంతాలతో మహా గుణ విజ్ఞానంతో జీవిస్తున్నాం
సత్య ధర్మాలతో నిత్యం అన్వేషణతో ఎన్నో అనుభవాలను నేర్చేస్తున్నాం

చరిత్ర గ్రంధాలను వేద పురాణాలను పఠనం చేస్తున్నాం
విశ్వ రహస్యాలకై అంతరిక్ష పరిశోధనలను సాగిస్తున్నాం   || తల్లి ప్రేమతో ||

తల్లి స్వభావాల విశ్వ జీవితం విజ్ఞాన వేదాల సంపుటంగా భావిస్తున్నాం
తల్లి బంధాల జ్ఞాన రూపం సహజ వనరుల మాతృత్వంగా చూస్తున్నాం

విశ్వ భావాల విజ్ఞానంతోనే జగతిని తల్లి ప్రేమగా అర్థం చేసుకున్నాం
విశ్వ తత్వాల అనుభవాలతోనే ప్రతి జీవిని స్నేహంగా ప్రేమిస్తున్నాం  || తల్లి ప్రేమతో || 

Thursday, November 10, 2016

మానవునికే తెలియని ఎన్నో జీవరాసులు విశ్వంలోనే ఉన్నాయి

మానవునికే తెలియని ఎన్నో జీవరాసులు విశ్వంలోనే ఉన్నాయి
మానవుడే తెలుకోలేని ఎన్నో జీవరాసులు జగతిలోనే ఉన్నాయి
మానవుడే తెలుపలేని ఎన్నో జీవరాసులు చరిత్రలోనే ఉన్నాయి
మానవుడే తలచని ఎన్నో జీవరాసులు సృష్టిలోనే ఉంటున్నాయి
మనిషికి ఎంత తెలిసినా మేధస్సులో తెలియని అన్వేషణ అనంతం 

Friday, September 30, 2016

ప్రకృతిలో ప్రతి నిత్యం ఎన్నో తెలియని అద్భుతాల ఆశ్చర్యపు సంఘటనలు జరిగేను

ప్రకృతిలో ప్రతి నిత్యం ఎన్నో తెలియని అద్భుతాల ఆశ్చర్యపు సంఘటనలు జరిగేను
ప్రతి నిమిషం అన్వేషణలో విశ్వ జగతి ఎంతటిదో బ్రహ్మాండ లోకమంటే ఏమిటో తెలిసేను || ప్రకృతిలో ||

విశ్వం ఎంత విశాలమైనదో ఆకాశపు ఎత్తున ప్రయాణిస్తూ అంచులను చేరేస్తే తెలిసేనా
జగతి ఎంత మహోత్తరమైనదో ఉదయిస్తూ అస్తమించే రోజుల యుగాలు గడిస్తే తెలిసేనా

లోకం ఎంత గొప్పదైనదో అంతరిక్షాన ఉన్న గ్రహాల నక్షత్రాల కూటమిని దర్శిస్తే తెలిసేనా
బ్రహ్మాండం ఎంత మహత్యమైనదో మానవ మేధస్సే నిత్యం దైవత్వంతో అన్వేషిస్తే తెలిసేనా || ప్రకృతిలో ||

మన విశ్వం మన విజ్ఞానం మన ప్రకృతి మన కుటీర ఆరోగ్య వాతావరణ స్థావరం
మన జగతి మన చరిత్ర మన గ్రంథం మన జ్ఞాపకాల మహాత్ముల రహస్య నిదర్శనం

మన భావం మన స్వభావం మన తత్వం మహా జీవులలో దాగిన ప్రతి రూప దర్పణం
మన సాహసం మన నిర్మాణం మన ప్రగతి అపురూపమైన యంత్ర భాషలకే మహా నిర్వచనం || ప్రకృతిలో ||

Wednesday, September 21, 2016

అనగనగా ఏనాడో ఒక రాజు ఒకరికి ఒకరే ఆ రారాజు

అనగనగా ఏనాడో ఒక రాజు ఒకరికి ఒకరే ఆ రారాజు
రాజుకే ఓ యువరాజు ఆ రాజ్యానికి అతడే మహారాజు
స్వరాజ్యానికే సామంత రాజు సామ్రాజ్యానికే ధర్మరాజు  || అనగనగా ||

ప్రపంచమంతా రాజులకు మహా దేవరాజు
జనులందరికి జనక రాజు మహా జయరాజు

యుద్ధం అవసరమే లేనట్లు పరిపాలించిన విజయరాజు
జగతికి ఇతనే పృథ్వీ రాజు మన దేశానికి భారత రాజు
గొప్పతనంలో రామ రాజు సహాయంలో గోవింద రాజు     || అనగనగా ||

భుజ బలగంలో గజ రాజు నాట్యంలో నటరాజు
ఏకాగ్రతలో ధ్యాన రాజు సంగీతంలో శృతి రాజు
ఐశ్వర్యంలో ధన రాజు పేదలకు ఓ పెద్ద రాజు
పాటలలో త్యాగ రాజు ఆటలలో మన రాజు

అరణ్యానికి సింహ రాజు శత్రువులు లేకున్నా నరసింహ రాజు
చరిత్రకు శివ రాజు పూజ్యులకు మహా లింగ రాజు పేరుకు శ్రీ రాజు  || అనగనగా || 

Tuesday, July 5, 2016

చరిత్రలోనే ఉదయించాను చరిత్రలోనే సాగుతున్నాను

చరిత్రలోనే ఉదయించాను చరిత్రలోనే సాగుతున్నాను
జీవితమంతా చరిత్రగానే సాగుతూ చరితనై పోతున్నాను  || చరిత్రలోనే ||

చరిత్రలో సాగర తీరమై చరితవై సాగరా
చరిత్రతో సాగుతూ సాగరాన్ని చేరుకోరా  

చరిత్రలో సాహస ప్రపంచం దాగినట్లు మర్మమే ఉందిరా
చరిత్రలో విజ్ఞానం ఉన్నట్లు అనుభవమే దాగున్నదిరా

చరిత్రలో అపురూపం మహా గొప్ప నిర్మాణాల సోయగం
చరిత్రలో అమోఘం మహా అద్భుత శిల్ప కళా చాతుర్యం

చరిత్రలోనే మహాత్ముల వీర సిద్ధాంతాలు దాగున్నాయి
చరిత్రలోనే మహా మతాల వేద గ్రంథాలు దాగున్నాయి

చరిత్రలోనే వీర జవానుల దేశ విదేశ సాహస భావాలున్నాయి
చరిత్రలోనే మహా మహా రా రాజుల సామ్రాజ్యాలు ఉన్నాయి     || చరిత్రలోనే ||

చరిత్రతో జీవిస్తే పరిశోధనలలో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి
చరిత్రతో సాగితే పర్యవేక్షణలలో ఎన్నెన్నో అద్భుతాలు తెలుస్తాయి

చరిత్రలోనే ఎన్నో వస్తువుల రూపకల్పనల యంత్ర విధానం దాగున్నది
చరిత్రలోనే ఎన్నో ప్రయత్నాల మహా కఠిన సాధన సాహసం దాగున్నది

నేటి విజ్ఞానానికి తెలియని ఎన్నో సూక్ష్మ జ్ఞాన విశేషాలు చరిత్రలోనే ఉనాయి
నేటికి తెలియని ఎన్నో శాస్త్రీయ శాస్త్ర వైద్య విధానాలు చరిత్రలోనే ఉన్నాయి

చరిత్రలోనే అణువు నుండి అంతరిక్షం దాకా ఎంతో విజ్ఞానం ఉన్నది
చరిత్రలోనే శాస్త్రము నుండి సాంకేతిక పరిశీలన ఎంతో దాగి ఉన్నది

చరిత్రతోనే నీటి జీవుల సాంకేతిక పరిజ్ఞాన జీవన విధానం సాగుతున్నది
చరిత్రతోనే నేటి వస్తువుల యంత్ర విజ్ఞాన జీవిత విధానం సాగుతున్నది   || చరిత్రలోనే || 

Friday, February 19, 2016

చరిత్రలో భావమై నిర్మాణాలలో ఆలోచననై

చరిత్రలో భావమై నిర్మాణాలలో ఆలోచననై
ప్రదేశంలో శక్తినై విశ్వానికి మేధస్సునై
కాలానికి తోడునై జీవికి ఉత్తేజమై ప్రకృతికి అథిదినై జీవిస్తున్నా ఈ లోకంలో
స్వరాలలో రాగ భావమై తాళాలలో తావినై గాలిలో సుగంధమై
సాగరంలో ప్రయాణమై కెరటాలలో అలలనై తీరంలో చేరువై
ఆకాశానికి సూర్యుడినై చీకటికి నక్షత్ర కాంతినై ఉన్నాను చంద్ర లోకంలో
ప్రతి అణువుకు భావమై ప్రతి జీవికి ఆలోచననై విశ్వానికి అనుభూతినై
వర్ణానికి తేజస్సునై విజ్ఞానానికి అనుభవమై వేదాలకు ప్రతిభనై
శ్వాసకు ధ్యాసనై దేహానికి దైవమై కొలువై ఉన్నాను ఈ జగతిలో