Showing posts with label సత్య. Show all posts
Showing posts with label సత్య. Show all posts

Thursday, July 7, 2016

వేణు గాలితో వేద మంత్రముతో వీచిపో కృష్ణా

వేణు గాలితో వేద మంత్రముతో వీచిపో కృష్ణా
శ్వాస ధ్యాసతో స్వర జీవంతో కలిసిపో కృష్ణాకర   || వేణు గాలితో ||

అమర నాయక అనన్య దాయక రావో మురళీ మోహన
దివ్య రాజక ధర్మ తేజక నిలిచిపో సువర్ణ సత్య సుందర

విశ్వ గిరివాస గోవర్ధన హిమ నివాస కదలిరా కమలా కాంత
భువన గిరి వాస భవన బృందావన మందిర మధుర లాలస  || వేణు గాలితో ||

జీవన వేద మహిమాదుర మనో విజ్ఞాన నేత్ర ప్రజ్ఞాధర ధనుంజయ
వీర తేజ రథ సారథి భుజంగ బహు ప్రజ్ఞాన పరాక్రమ పరంధామ

నవ నీత కిశోర శృంగార సుమధుర చిత్ర ధారక మూర్తి మధురేశ్వర
జన జనని జగన జల జీవ జలాధర జీవన జ్యోతిక జ్యోతిర్మయ         || వేణు గాలితో ||