Wednesday, December 27, 2017

నా ఆత్మలోనే ఎన్నో ఆత్మలు కలిసున్నాయి

నా ఆత్మలోనే ఎన్నో ఆత్మలు కలిసున్నాయి
నా దేహంలోనే ఎన్నో దేహాలు కలిసున్నాయి

నా జీవంలోనే ఎన్నో జీవాలు కలిసున్నాయి
నా రూపంలోనే ఎన్నో రూపాలు కలిసున్నాయి

ప్రతి  జీవిలో నేనే శ్వాసగా మిళితమై ఉన్నాను  || నా ఆత్మలోనే ||

ఆత్మగా ఉదయిస్తూ వస్తున్నా
దేహమై జీవిస్తూ ప్రయాణిస్తున్నా

జీవమై జన్మిస్తూ ప్రకాశిస్తున్నా
రూపమై స్మరిస్తూ ఎదుగుతన్నా

శ్వాసగా అవతరిస్తూ నిత్యం అధిరోహిస్తూనే ఉన్నా  || నా ఆత్మలోనే ||

ఆత్మలోనే అంతర్లీనమై అవతరించాను
దేహంలోనే దైవాత్మమై దర్శించుకున్నాను

జీవంలోనే జీవోదయమై జీవిస్తున్నాను
రూపంలోనే రమణీయమై రూపశినైనాను

శ్వాసలో స్వయంభువమై సర్వం సందర్శిస్తూనే ఉన్నా  || నా ఆత్మలోనే ||

Friday, December 22, 2017

భాష లేనిదే మేధస్సులో భావన లేదే

భాష లేనిదే మేధస్సులో భావన లేదే
బాష లేనిదే మేధస్సులో తత్వన లేదే

భాష లేనిదే ఆలోచనకు అర్థం లేదే
భాష లేనిదే ఆలోచనకు పరమార్థం లేదే  || భాష ||

భాష లేని భావం అక్షరం లేని పఠనం
భాష లేని తత్వం పదం లేని గణితం

భాష లేని పరిచయం తెలుపలేని తపనం  
భాష లేని సంఘటనం వివరించలేని విధం  || భాష ||

భాష లేనిదే మేధస్సుకు సరైన వివరణ లేదే
భాష లేనిదే ఆలోచనకు సరైన విజ్ఞానం లేదే

భాష లేనిదే సమయ స్పందన సరైన కాలానికి రాదే
భాష లేనిదే సమయ చలన సరైన సందర్భానికి రాదే   || భాష || 

శ్వాసపై ధ్యాసతోనే కార్యం శ్వాసపై ధ్యాసతోనే సర్వం

శ్వాసపై ధ్యాసతోనే కార్యం శ్వాసపై ధ్యాసతోనే సర్వం
శ్వాసపై ధ్యాసతోనే జ్ఞానం శ్వాసపై ధ్యాసతోనే అనంతం
శ్వాసపై ధ్యాసతోనే శాంతం శ్వాసపై ధ్యాసతోనే ప్రశాంతం  || శ్వాసపై ||

ఉచ్చ్వాస నిచ్వాసాల స్వధ్యాస గమనమే సుధీర్ఘ హృదయ చలనం
ఉచ్చ్వాస నిచ్వాసాల స్వధ్యాస ధ్యానమే సుధీర్ఘ హృదయ ప్రయాణం
ఉచ్చ్వాస నిచ్వాసాల స్వధ్యాస సౌఖ్యమే సుధీర్ఘ హృదయ ప్రశాంతం  || శ్వాసపై ||

స్వధ్యాస గమన చలనమే కార్యా చరణం
స్వధ్యాస గమన నైపుణ్యమే కార్య ఫలితం
స్వధ్యాస గమన సాధనమే కార్య ప్రశాంతం
స్వధ్యాస గమన జీవనమే కార్య పరిశోధనం  || శ్వాసపై || 

Thursday, December 21, 2017

మంచినే నేర్చుకో మంచినే ఏలుకో

మంచినే నేర్చుకో మంచినే ఏలుకో
మంచినే ఇచ్చుకో మంచినే తీసుకో
మంచినే దాచుకో మంచినే ఉంచుకో
మంచినే పెంచుకో మంచినే పంచుకో
మనిషిగా మంచినే కోరుకో మంచినే చేసుకో  || మంచినే ||

మంచిగా ఎదుగుటకే మంచినే తెలుసుకో
మంచిగా ఒదుగుటకే మంచినే తెలుపుకో

మంచిగా జీవించుటకే మంచినే చూసుకో
మంచిగా సాగుటకే మంచినే మలుచుకో

మంచిగా ఉండుటకే మంచినే ఆదరించుకో
మంచిగా వెళ్ళుటకే మంచినే సందర్శించుకో  || మంచినే ||

మంచిలోనే జీవం మంచిలోనే ప్రేమం
మంచిలోనే హితం మంచిలోనే స్నేహం

మంచిలోనే సర్వం మంచిలోనే సత్యం
మంచిలోనే నిత్యం మంచిలోనే శాంతం

మంచిలోనే భావం మంచిలోనే తత్వం
మంచిలోనే దైవం మంచిలోనే ప్రశాంతం  || మంచినే || 

Thursday, December 14, 2017

సమయంతో సాగిపోయే రూపం కాలంతో నిలిచిపోయే దేహం

సమయంతో సాగిపోయే రూపం కాలంతో నిలిచిపోయే దేహం
మనస్సుతో సాగిపోయే భావం వయస్సుతో నిలిచిపోయే తత్వం  || సమయంతో ||

మేధస్సుతో ఎంత ఎదుగుతున్నా వయస్సుతో అంతగా ఒదుగుతున్నా
మనస్సుతో ఎంత ఎదుగుతున్నా ఆయుస్సుతో అంతగా ఒదుగుతున్నా

జీవంతో ఎంత ఎదుగుతున్నా ధ్యానంతో అంతగా ఒదుగుతున్నా
రూపంతో ఎంత ఎదుగుతున్నా దేహంతో అంతగా ఒదుగుతున్నా   || సమయంతో ||

సాధనతో ఎంత ఎదుగుతున్నా కార్యంతో అంతగా ఒదుగుతున్నా
ప్రేమంతో ఎంత ఎదుగుతున్నా స్నేహంతో అంతగా ఒదుగుతున్నా

జగతితో ఎంత ఎదుగుతున్నా దైవతితో అంతగా ఒదుగుతున్నా
ప్రకృతితో ఎంత ఎదుగుతున్నా విశ్వతితో అంతగా ఒదుగుతున్నా  || సమయంతో || 

మేధస్సును మరువలేను ఆలోచనను ఆపలేను

మేధస్సును మరువలేను ఆలోచనను ఆపలేను
మనస్సును నిలుపలేను భావనను తొలచలేను

మనస్సు ఉన్నంత కాలం మేధస్సులో భావాలోచన చలించేను  || మేధస్సును ||

శ్వాసతో చలనం ధ్యాసతో కదలికం ఆలోచనతో అనేకం
భాషతో గమనం జీవంతో ప్రయాసం భావనతో మమేకం

కాలంతో ప్రయాణం సమయంతో కార్యాచరణం
వేదంతో పరిశోధనం విజ్ఞానంతో అనుభవగారం   || మేధస్సును ||

రూపంతో బంధాల పరిచయం దేహంతో ప్రకృతి పరిశోధనం
మేధస్సుతో భావాల మధురం మనస్సుతో విశ్వతి ప్రయాణం

పరభాషతో మాటల మాధుర్యం పరధ్యాసతో కాలమంతా తపనం
వయస్సుతో వేదాల పాండిత్యం మనస్సుతో జగమంతా గమనం   || మేధస్సును || 

మేధస్సునే పరిశోధించాను మేధస్సుతోనే అన్వేషించాను

మేధస్సునే పరిశోధించాను మేధస్సుతోనే అన్వేషించాను
మేధస్సునే తిలకించాను మేధస్సుతోనే ఆలోచించాను
మేధస్సునే మెప్పించాను మేధస్సుతోనే అధిగమించాను

మేధస్సులోనే సర్వ లోకాల విశ్వ చరితాన్ని దర్శించాను  || మేధస్సునే ||

ప్రయత్నించుటలోనే విఫలమైన సాధనతో అనుభవం కలిగేను
పరిశోధించుటలో అల్పజ్ఞానమైన సాహసంతో విజ్ఞానం తెలిసేను
ప్రయాణించుటలో ఆటంకమైన పఠనంతో వేదాంతం తెలియును  || మేధస్సునే ||

ఆలోచనలో తెలియని వేదం ఆచరణలో తెలిసేను వేదాంతం
భావనలో తెలియని గమనం ఆదరణతో తెలియును విజ్ఞానం
తత్వనలో తెలియని చలనం ఆదర్శనలో తోచేను అనుభవం  || మేధస్సునే ||

Wednesday, December 13, 2017

ఏనాటి ఋషివో నీవు ఏనాటి మహర్షివో నీవు

ఏనాటి ఋషివో నీవు ఏనాటి మహర్షివో నీవు
ఏనాటి ఆత్మవో నీవు ఏనాటి మహాత్మవో నీవు

ఋషిగా సిద్ధాంతివై మహర్షిగా వేదాంతివైనావు
ఆత్మగా ప్రకృతివై మహాత్మగా పరాకృతివైనావు   || ఏనాటి ||

ఋషిగా సిద్ధాంతాలు రచించినా మహర్షిగా వేదాంతాలు రుచించేవు
ఆత్మగా ప్రకృతినే ఆవహించినా మహాత్మగా పరాకృతులు ధరించేవు

ఋషిగా భావాలతో ఎదిగిన నీవు మహర్షిగా తత్వాలతో జీవించేవు
ఆత్మగా వేదాలతో ఒదిగిన నీవు సత్యాలతో మహాత్మగా ఉదయించేవు  || ఏనాటి ||

ఋషిలోనే కృషి ఉన్నది మహర్షిలోనే స్వయంకృషి ఉన్నది
ఆత్మలోనే ఓ మాత ఉన్నది మహాత్మలోనే జగన్మాత ఉన్నది

ఋషిలోనే పవిత్రం మహర్షిలోనే పరిశుద్ధం ప్రకృతితో కొనసాగుతున్నది
ఆత్మలోనే అన్వేషణం మహాత్మలోనే పరిశోధనం జగతితో జరుగుతున్నది  || ఏనాటి || 

ఏనాడు లేని భావన ఎవరికి తెలియని భావన

ఏనాడు లేని భావన ఎవరికి తెలియని భావన
ఎప్పటికి తోచని భావన ఎలాగైనా కలగని భావన

నా వేద మేధస్సులోనే తత్వమై నిలిచిపోయించి  || ఏనాడు ||

ఆలోచనగా సాగిన నేను అన్వేషణగా పరిశోధించాను
వేదనగా తిలకించిన నేను నీరీక్షణగా ప్రయాణించాను

అన్వేషణలో దిక్సూచిగా సాగిన నేను మహోదయ భావాన్నే దర్శించాను
నిరీక్షణలో దివిటిగా తిలకించిన నేను నవోదయ భావాన్నే సందర్శించాను  || ఏనాడు ||

భావాలలోనే వేదం తత్వాలుగా పరిచయమై అనుభవమే తెలిపేను
వేదాలలోనే జీవం తత్వాలుగా ప్రయాణమై అనుబంధమే కలిపేను

యుగ యుగాలుగా గడిచిన కాలంతో నవ భావాలు పరిశోధనమయ్యేను
తర తరాలుగా సాగిన సమయంతో మహా వేదాలు పర్యవేక్షణమయ్యేను  || ఏనాడు ||

శ్వాస ధ్యాసను నీవే పరిశుద్ధం చేసుకో

శ్వాస ధ్యాసను నీవే పరిశుద్ధం చేసుకో
దేహ స్వరమును నీవే పవిత్రం చేసుకో

భావ తత్వాలను నీవే గమనం చేసుకో
వేద పురాణాలను నీవే పఠనం చేసుకో

కాలాన్ని క్రమంగా విజ్ఞానంతో నీవే మలుచుకో  || శ్వాస ||

ధ్యానించే ప్రకృతిలోనే శ్వాసను ధ్యాసను పరిశుద్ధం చేసుకో
బోధించే పాఠశాలలోనే దేహాన్ని స్వరాన్ని పవిత్రం చేసుకో

ఆలోచనల భావాలలోనే తత్వాలను గమనం చేసుకో
కార్యముల వేదాలలోనే పురాణాలను పఠనం చేసుకో  || శ్వాస ||

స్వధ్యాసలోనే ఉచ్చ్వాస నిచ్చ్వాసత్వాలను పరిశీలన చేసుకో
స్వర శృతిలోనే దేహ హృదయ చలనాలను పర్యవేక్షణ చేసుకో

భావాలలోనే స్వభావాలను సద్గుణంగా మలుచుకో
తత్వాలలోనే సందర్భాలను సమన్వయంగా చేసుకో  || శ్వాస || 

Tuesday, December 12, 2017

నేను నేను అని తలచుకున్నా నీవు నీవు అని తలచలేవా

నేను నేను అని తలచుకున్నా నీవు నీవు అని తలచలేవా
నేను నేను అని మలుచుకున్నా నీవు నీవు అని మలచలేవా

నేనుగా ఎదగాలని నడుచుకున్నా నీవుగా ఎదగాలని నడిపించలేవా
నేనుగా ఒదగాలని సహనమై ఉన్నా నీవుగా ఒదగాలని సహించలేవా  || నేను ||

నేనే అనే భావన నాలోనే కలిగేను నీవే అనే భావన ఎవరిలో కలిగేను
నేనే అనే తత్వన నాలోనే వెలిగేను నీవే అనే తత్వన ఎవరిలో వెలిగేను

నేనే అనే స్పందన నాలోనే తోచేను నీవే అనే స్పందన ఏనాడు తోచేను
నేనే అనే వేదన నాలోనే తపించేను నీవే అనే వేదన ఏనాడు తపించేను  || నేను ||

నేనే అనే ఆలోచన ఎప్పటికి మరిచేది నీవే  అనే ఆలోచన ఎప్పటికి కోరేది
నేనే అనే మోహన ఎప్పటికి తొలచేది నీవే అనే మోహన ఎప్పటికి తలచేది

నేనే అనే శాంతం ఎప్పటికి వీడేది మనమే అనే ప్రశాంతం ఎప్పటికి కలిగేది
నేనే అనే సర్వం ఎప్పటికి మారేది మనమే అనే సత్యాంశం ఎప్పటికి తెలిసేది  || నేను || 

తల్లి గర్భములో ఒదిగిపోయావా

తల్లి గర్భములో ఒదిగిపోయావా
విశ్వ మందిరములో ఎదిగిపోయావా
జీవ ప్రకృతిలో జీవించిపోయావా

అణువుగా తల్లి గర్భంలో చేరుకున్నావా
రూపముగా విశ్వ మందిరంలో చూసుకున్నావా
దేహముగా జీవ ప్రకృతిలో ఓర్చుకున్నావా        || తల్లి ||

భావాలతో నీవే ఒదిగిపోయావా
ఆలోచనలతో నీవే ఎదిగిపోయావా
తత్వాలతో నీవే జీవించిపోయావా

వేదాలతో విజ్ఞానం చేరుకున్నావా
బంధాలతో వేదాంతం చూసుకున్నావా
దేహాలతో సిద్ధాంతం ఓర్చుకున్నావా    || తల్లి ||

సర్వం నీవే తెలుసుకున్నావా
సత్యం నీవే నడుచుకున్నావా
ఆద్యం నీవే పాఠించుకున్నావా

అంతం నీవే ఆవహించుకున్నావా
నిత్యం నీవే సహకరించుకున్నావా
శాంతం నీవే ప్రసాదించుకున్నావా   || తల్లి || 

నీలోని జీవ శ్వాస ధ్యాసను ఏనాడు గమనించలేదా

నీలోని జీవ శ్వాస ధ్యాసను ఏనాడు గమనించలేదా
నీలోని ఉచ్చ్వాస నిచ్వాసను ఏనాడు స్మరించలేదా

నీలోన నీవే అంతర్భావాలను దర్శించుకోలేదా 
నీలోన నీవే అంతరత్వాలను స్పర్శించుకోలేదా  || నీలోని ||

నీలోన నేనే ఆత్మ పరమాత్మగా పరమార్థమై పరమాణువుతో ఉన్నానుగా
నీలోన నేనే మాత మహాత్మగా అర్థాన్నై సహ అణువుతో ఉంటున్నానుగా

నీలోన నేనే జీవమై పరమాత్మ తత్వంతో జీవిస్తున్నానుగా
నీలోన నేనే శ్వాసనై మహాత్మ భావంతో ఉదయిస్తున్నానుగా  || నీలోని ||

నీలోన నేనే పరిశోధనమై మహా విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నానుగా
నీలోన నేనే పరిశుద్ధమై మహా విశ్వ ప్రకృతిని పర్యావరిణిస్తున్నానుగా

నీలోన నేనే అంతర్ముఖమై మేధస్సునే అభ్యసిస్తున్నానుగా
నీలోన నేనే అంతర్జాలకమై ఆలోచననే అధిగమిస్తున్నానుగా    || నీలోని || 

Monday, December 11, 2017

మేధస్సులోనే సర్వం కనిపిస్తుంది

మేధస్సులోనే సర్వం కనిపిస్తుంది
మేధస్సులోనే నిత్యం వినిపిస్తుంది
మేధస్సులోనే సమస్తం తపిస్తుంది
మేధస్సులోనే అనంతం తోచేస్తుంది

మేధస్సే మహా వేదమై విశ్వమంతా జీవిస్తుంది  || మేధస్సులోనే ||

మేధస్సులో ఆలోచన విశ్వ భావాలకు సుదర్శకం
మేధస్సులో తత్వన విశ్వ వేదాలకు సుదర్శనం
మేధస్సులో బంధన విశ్వ జ్ఞానులకు సుదర్పితం
మేధస్సులో జీవన విశ్వ జీవులకు దివ్య దర్శితం

మేధస్సులోనే మహా గుణ స్వభావాలన్నీ జీవులకు మార్గదర్శకం  || మేధస్సులోనే ||

మేధస్సులోనే ఆశ్చర్యం దాగున్నది
మేధస్సులోనే అద్భుతం నిండినది
మేధస్సులోనే అంతర్ముఖం వెలసినది
మేధస్సులోనే అంతర్జాలం జీవిస్తున్నది

మేధస్సులోనే సర్వ శాస్త్రీయ సిద్ధాంతముల వేదాంత మర్మం కలదు  || మేధస్సులోనే ||

నాలో విశ్వ భావన ఎక్కడ ఉన్నదో

నాలో విశ్వ భావన ఎక్కడ ఉన్నదో
నాలో విశ్వ తత్వన ఎక్కడ ఉందో

నాలోని భావనయే వేదమని తెలిసేనా
నాలోని తత్వనయే జ్ఞానమని తోచేనా

జ్ఞానేంద్రియాల విచక్షణచే విశ్వ వేదాంతం మేధస్సుకే కలిగేనా  || నాలో ||

దేహంలోని దైవత్వం దాగున్నదో
జీవంలోనే జీవత్వం నిండున్నదో
రూపంలోనే సర్వత్వం వెలిసినదో
శరీరంలోనే శతత్వం అవతరించిందో

జీవుల మేధస్సులలోనే సర్వ జీవ దేహ రూప భావాలు వెలిసేనా  || నాలో ||

మనస్సులోనే జీవ మాధుర్యమా
వయస్సులోనే భావ వయ్యారమా
ఆయుస్సులోనే వేద ఆరోగ్యమా
ఉషస్సులోనే దేహ ఉదయమా 

మనస్సు వయస్సుతోనే కాలం ఉషస్సుతో ప్రయాణించేనా  || నాలో ||

Sunday, December 3, 2017

శివ ధ్యానం దైవత్వం

శివ ధ్యానం దైవత్వం
శివ దేహం నిత్యత్వం

శివ జీవం సర్వత్వం
శివ రూపం సత్యత్వం  || శివ ||

శివ గమనం గాంధర్వం
శివ చలనం చాతుర్యం 

శివ ఆలయం అద్భుతం
శివ నిలయం ప్రాచుర్యం

శివ కీర్తనం కమనీయం
శివ ప్రార్థనం పరిశుద్ధం

శివ కార్యం కరుణాదయం
శివ గమ్యం గమకానందం  || శివ ||

శివ స్థానం సంపూర్ణం
శివ దానం దాంపత్యం

శివ భావం బంధుత్వం
శివ తత్వం తపనత్వం

శివ వేదం వేదాంతం
శివ జ్ఞానం జ్ఞానాంతం  || శివ ||

శివ భోగం బ్రంహాండం
శివ యోగం యాదృచ్చికం

శివ తేజం తాత్వికం
శివ బీజం బ్రంహాస్త్రం

శివ శాంతం శుభకరం 
శివ ప్రదేశం ప్రశాంతం  || శివ ||