Monday, December 11, 2017

మేధస్సులోనే సర్వం కనిపిస్తుంది

మేధస్సులోనే సర్వం కనిపిస్తుంది
మేధస్సులోనే నిత్యం వినిపిస్తుంది
మేధస్సులోనే సమస్తం తపిస్తుంది
మేధస్సులోనే అనంతం తోచేస్తుంది

మేధస్సే మహా వేదమై విశ్వమంతా జీవిస్తుంది  || మేధస్సులోనే ||

మేధస్సులో ఆలోచన విశ్వ భావాలకు సుదర్శకం
మేధస్సులో తత్వన విశ్వ వేదాలకు సుదర్శనం
మేధస్సులో బంధన విశ్వ జ్ఞానులకు సుదర్పితం
మేధస్సులో జీవన విశ్వ జీవులకు దివ్య దర్శితం

మేధస్సులోనే మహా గుణ స్వభావాలన్నీ జీవులకు మార్గదర్శకం  || మేధస్సులోనే ||

మేధస్సులోనే ఆశ్చర్యం దాగున్నది
మేధస్సులోనే అద్భుతం నిండినది
మేధస్సులోనే అంతర్ముఖం వెలసినది
మేధస్సులోనే అంతర్జాలం జీవిస్తున్నది

మేధస్సులోనే సర్వ శాస్త్రీయ సిద్ధాంతముల వేదాంత మర్మం కలదు  || మేధస్సులోనే ||

No comments:

Post a Comment